లైంగిక ఆరోపణలతో నోబెల్ సాహిత్య పురస్కారం వాయిదా

ఫొటో సోర్స్, Alfrednobel.org
ఏటా సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారం ఇచ్చే సంస్థ ఈ ఏడాది ఆ పురస్కారాన్ని ప్రకటించబోమని వెల్లడించింది. సంస్థలో లైంగిక దాడుల ఆరోపణలు ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
స్వీడన్‌కు చెందిన ఈ అకాడమీలో ఓ సభ్యురాలి భర్త లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆమె పదవి నుంచి వైదొలిగారు.
2018 సాహిత్య నోబెల్ పురస్కారాన్ని 2019 సంవత్సరం పురస్కారంతో కలిపి ఇస్తామని ఈ అకాడమీ వెల్లడించింది.
ఈ నోబెల్ పురస్కారాన్ని 1901 నుంచి ఇస్తున్నారు.
తాజా లైంగికారోపణల వివాదం ఈ పురస్కారాన్ని ఓ కుదుపు కుదిపింది.
అకాడమీలో కొందరు ఏటా పురస్కారం ప్రకటించే సంప్రదాయాన్ని కొనసాగించాలని పట్టుబట్టగా.. మరికొందరు పురస్కారాన్ని ఇచ్చే స్థాయిలో ఈ సంస్థ లేదని వాదించారు.
ప్రపంచ యుద్ధాల సమయంలో ఆరేళ్లను పక్కన పెడితే ఇప్పటి దాకా కేవలం ఒక్క ఏడాదే ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు.
1935లో విజేత ఎంపిక కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సంక్షోభానికి కారణమేంటి?
గత నవంబరులో ఫ్రెంచ్ ఫొటో గ్రాఫర్ జీన్-క్లాడ్ ఆర్నాల్ట్ ఈ సంస్థ ఫండింగ్‌తో ఓ సాంస్కృతిక ప్రాజెక్టు చేపట్టారు. ఆయనపై 18 ఏళ్ల యువతి లైంగిక దాడి ఆరోపణలు చేశారు. దీంతో వివాదం మొదలైంది.
తర్వాత ఈ అకాడమీకి చెందిన వివిధ చోట్ల లైంగిక దాడుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆర్నాల్ట్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు.
తర్వాత ఈ సంస్థ ఆర్నాల్ట్ భార్య కటారినా ఫ్రోస్టెన్సన్‌ను తమ కమిటీ నుంచి తొలగించాలని నిర్ణయించింది.
ఈ వివాదంతో పాటు నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లు లీక్ కావడం కూడా తీవ్ర దుమారాన్ని రేపింది.
దీంతో ఈ సంస్థలో చీలిక వచ్చింది. ఫ్రోస్టెన్సన్, అకాడమీ అధ్యక్షుడు సారా డానియస్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇప్పుడు సంస్థలో 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరిలో 1989 నుంచి కెర్‌స్టిన్ ఎక్మాన్ పేరుకే ఉన్నారు.
ఎవరైనా కొత్తగా సభ్యులుగా చేరాలంటే కనీసం 12 మంది కోరం ఉండాలి.
సాంకేతికంగా ఈ అకాడమీలో సభ్యులుగా చేరితే మళ్లీ రాజీనామా చేయడానికి కుదరదు. కానీ.. వారు ఇందులో పాల్గొనకుండా ఉండొచ్చు.
అయితే అకాడమీ ప్యాట్రన్ కింగ్ కార్ల్ XVI గుస్టాఫ్ సభ్యులు వైదొలిగే విధంగా నిబంధనలను మార్చుతామని తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
తర్వాత ఏం జరుగుతుంది?
2019లో సాహిత్యంలో రెండు పురస్కారాలను ప్రదానం చేస్తారు.
అయితే ఇలా రెండు పురస్కారాల ప్రదానం మొదటిసారి కాదు.
ఉదాహరణకు 1936లోనూ పురస్కారం ప్రకటించలేదు. తర్వాత ఈ సంవత్సారానికి సంబంధించిన పురస్కారాన్ని అమెరికన్ నాటక రచయిత ఓ నీల్‌కి ఇచ్చారు.
ఇటీవల మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి వెలుగులోకి వచ్చిన #metoo ప్రచారం ఈ అకాడమీ ఇలా నిర్ణయం తీసుకొనేలా చేసిందని చెబుతున్నారు.
అకాడమీ ఇలా వివాదంలో ఉన్నపుడు ప్రకటించిన పురస్కారాలను విజేతలు తిరస్కరించే అవకాశం కూడా ఉంది.
నోబెల్ పురస్కారం ఎలా పుట్టింది?
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









