యూట్యూబ్ షూటింగ్: కాలిఫోర్నియా కాల్పుల్లో ముగ్గురికి గాయాలు
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ మహిళ కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
కాల్పుల అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, NASIM AGHDAM
ఈమె పేరు నసీం అగ్దాం అని స్థానిక మీడియా వెల్లడించింది.
ఇంట్లో గొడవల వల్ల ఆమె ఈ కాల్పులకు పాల్పడ్డారని అమెరికా మీడియా తెలిపింది.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడు కాల్పులు జరిపిన మహిళకు ప్రియుడై ఉంటారని సీబీఎస్ న్యూస్ పేర్కొంది.
ఈయనతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు.

స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.48 గంటలకు ఈ ఘటన జరిగిందని శాన్ బ్రూనో పోలీసు అధికారి ఎడ్ బర్‌బెరిని చెప్పారు.
తాము ఘటనాస్థలానికి చేరుకునే సమయానికి అక్కడ పరిస్థితి విషమంగా ఉందని, ఉద్యోగులు భయంతో పరుగులు తీస్తున్నారని ఆయన వివరించారు.
కాల్పులు అనంతరం ఆ మహిళ తనను తాను తుపాకీతో కాల్చుకుందని ఆయన వెల్లడించారు. అయితే కాల్పులకు తెగబడిన మహిళ వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
గూగుల్‌కు చెందిన యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో 1,700 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. చేతులు పైకెత్తి కార్యాలయం నుంచి బయటకు వెళుతున్న ఉద్యోగుల చిత్రాలను స్థానిక టీవీ చానెళ్లు చూపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కాల్పుల్లో గాయపడిన ముగ్గురిని సమీపంలోని జుకెర్‌బర్గ్ శాన్ ప్రాన్సిస్కో జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. యూట్యూబ్ అధికార ప్రతినిధి క్రిస్ డేల్ మాట్లాడుతూ, పోలీసులు సరైన సమయంలో స్పందించారని ప్రశంసించారు.
చాలా మంది యూట్యూబ్ ఉద్యోగులు ఈ ఘటనపై ట్వీట్ చేశారు. కాల్పులు వినిపించగానే ఉద్యోగులందరూ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తారని సంస్థ మేనేజర్ టోడ్డ్ శెర్మన్ తెలిపారు.
కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. సకాలంలో స్పందించిన లా అండ్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









