రోడ్డు దాటుతున్న పాదచారిని గుద్ది చంపిన ఉబర్ డ్రైవర్ రహిత కారు

ఫొటో సోర్స్, Reuters
ఉబర్ సంస్థకు చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ (స్వయం చోదక) కారు ఒక మహిళను ఢీకొట్టింది. అరిజోనా రాష్ట్రంలోని టెంపేలోని ఒక వీధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ దుర్ఘటనలో 49 ఏళ్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఉత్తర అమెరికాలోని అన్ని నగరాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఉబర్ ప్రకటించింది.
డ్రైవర్ అవసరం లేకుండా తమంతట తాముగా డ్రైవింగ్ చేసుకునే ఈ కార్లు పలు యాక్సిడెంట్లకు కారణమయ్యాయి. అయితే, ఇలాంటి కార్లు ఒక మనిషి మరణానికి కారణమయ్యేంతటి పెద్ద ప్రమాదం జరపటం ఇదే తొలిసారి.
మహిళ మృతి ‘చెడు వార్త’ అని ఉబర్ సంస్థ అధిపతి డారా ఖొస్రోవ్‌షాహీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, అప్పుడు కారు తనంతట తాను పనిచేసే విధానం (అటానమస్ మోడ్)లో ఉందని పోలీసులు తెలిపారు. కారు స్టీరింగ్‌కు వెనుక ఒక మానవ పర్యవేక్షకుడు కూడా ఉన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు ఎలీనే హెర్జ్‌బెర్గ్ (49 ఏళ్లు) అనే మహిళ పాదచారులు రోడ్డు దాటేందుకు ఉద్దేశించిన జీబ్రా క్రాసింగ్‌ను ఉపయోగించలేదని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే మహిళను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ ఆమె మృతి చెందారు.
టెంపే నగరానికి తమ బృందాలను పంపిస్తున్నామని అమెరికా జాతీయ రహదారుల రద్దీ భద్రత నిర్వహణ, జాతీయ రవాణా భద్రత బోర్డు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘మేల్కొలుపు’
ఫోర్డ్, జనరల్ మోటార్స్, టెస్లా, వేమో తదితర కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల అభివృద్ధి పరిశోధనలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే రవాణా రంగానికి భవిష్యత్ అని కొందరు అభివర్ణిస్తుండగా, వీటివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పలువురు చెబుతున్నారు.
కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అమెరికాలోని చాలా రాష్ట్రాలు ఈ కార్ల పరీక్షలను స్వాగతించాయి.
అయితే, ఈ సాంకేతికత పూర్తిగా తయారవ్వకుండానే వినియోగించటంపైన పలు హెచ్చరికలు కూడా ఉన్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఆ దేశ రవాణా మంత్రిగా పనిచేసిన ఆంథోనీ ఫాక్స్ ఈ రోడ్డు ప్రమాదంపై స్పందిస్తూ.. ‘‘(స్వయం చోదక వాహనాల) రంగానికి, ప్రభుత్వానికి ఇదొక మేల్కొలుపు. ఇప్పటికైనా భద్రతకు పెద్దపీట వేయాలి’’ అని అన్నారు.
అమెరికాలో 12కు పైగా రాష్ట్రాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వివిధ దశల్లో పరీక్షల నిమిత్తం రోడ్లపై తిరుగుతున్నాయి.
ఆటోమోటివ్ రీసెర్చి సెంటర్ చెప్పినదాని ప్రకారం.. ఇలాంటి కార్ల విషయంలో ఏదైనా జరగరానిది జరిగితే స్పందించేందుకు కారులో కానీ, సమీపంలో కానీ ఒక మనిషి అవసరం.
ఇలాంటి వాహనాల కోసం జాతీయ భద్రతా మార్గదర్శకాలను తయారు చేసే పనిలో ఉంది అమెరికా.
2016లో పిట్స్‌బర్గ్‌లో డ్రైవర్ రహిత కార్ల పరీక్షలను ఉబర్ ప్రారంభించింది. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో, పిట్స్‌బర్గ్, టొరంటో, ఫోనిక్స్ ఏరియాల్లో ఈ పరీక్షలను ఉబర్ నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఇక పైలట్ రహిత స్కై టాక్సీలు రాజ్యమేలుతాయా?
- ఉబర్ డిజిటల్ సేవల సంస్థ కాదు.. రవాణా సంస్థే
- గూగుల్ రహస్యాలను ‘దొంగిలించిన’ ఉబర్.. కోర్టుకెక్కిన గొడవ
- జీపీఎస్ లేనప్పుడు ఏం వాడేవాళ్లో తెలుసా?
- ఆర్కిటిక్ మహా సముద్రంలోంచి ఓడల రవాణా మార్గం
- ఆరు వేల కిలోమీటర్లు, అరగంటలో!.. ప్రపంచంలో ఎక్కడికైనా గంటలోపే
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- రోడ్డు ప్రమాదాలు: అతడికి వినిపించకపోయినా.. అందరూ వినేలా చెబుతాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








