ఆర్కిటిక్ మహా సముద్రంలోంచి ఓడల రవాణా మార్గానికి చైనా ప్రణాళిక

ఫొటో సోర్స్, Getty Images
ఆర్కిటిక్ మహా సముద్రంలోంచి ఓడల రవాణా మార్గం అభివృద్ధి కోసం రూపొందించిన ప్రణాళికను చైనా విడుదల చేసింది. ఆ మార్గం పోలార్ సిల్క్ రూటుగా మారనుంది.
భూతాపం(గ్లోబల్ వార్మింగ్) ప్రభావంతో ఆర్కిటిక్‌లో ఏర్పడే ఈ మార్గం క్రమంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలకు ఎంతో కీలకంగా మారుతుందని చైనా అభిప్రాయడింది.
ఈ మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు రష్యాతో పాటు.. ఇతర ఆర్కిటిక్ దేశాలతో కలిసి పనిచేస్తామని పేర్కొంది.
ఈ రూట్‌లో సౌకర్యాలను అభివృద్ధి చేసి.. ట్రయల్ రన్స్ నిర్వహించాలని షిప్పింగ్ సంస్థలకు పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, MAXIM ZMEYEV
జల, రోడ్డు మార్గాల ద్వారా యూరప్‌తో పాటు పలు దేశాలతో అనుసంధానం అయ్యేందుకు చైనా ఎంతో కాలంగా తహతహలాడుతోంది. అందులో ఈ ఆర్కిటిక్ మార్గం కీలకమైనది.
చైనా కేంద్రంగా ఆసియా.. యూరప్ భూభాగాల్లో రోడ్లు.. పోర్టులు.. రైల్వేల అభివృద్ధికి దాదాపు రూ. 63 లక్షల కోట్లు(ట్రిలియన్ డాలర్ల) ప్రాజెక్టు చేపట్టాలన్నది చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆలోచన.

ఫొటో సోర్స్, Getty Images
ఈ మార్గం కార్యరూపం దాల్చితే.. చైనాకు అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.
ప్రస్తుతం చైనా నుంచి జలమార్గంలో నెదర్లాండ్స్‌లోని రాటర్‌డామ్ చేరుకునేందుకు 48 రోజులు పడుతోంది. అదే.. ప్రతిపాదిత ఆర్కిటిక్ రూట్ అందుబాటులోకి వస్తే.. 28 రోజులకు తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి.
"భూగోళం వేడెక్కడానికి పరిశ్రమలు కారణమయ్యాయి. ఇప్పుడు ఈ సమస్యే అదే పరిశ్రమలకు మరిన్ని వ్యాపార అవకాశాలను సృష్టించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చిత్రంగా ఉంది" కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రష్యాకు చెందిన ట్యాంకర్ తొలిసారిగా గత ఏడాది ఆగస్టులో నార్వే నుంచి మంచు గడ్డలను తొలగించే వాహనం అవసరం లేకుండానే ఆర్కిటిక్ సముద్రం గుండా దక్షిణ కొరియా వరకు వెళ్లింది.
ఆర్కిటిక్ ప్రాంతంలోని వాతావరణానికి నష్టం కలిగించేలా చైనా ఆలోచనలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే.. ఆ అనుమానాలు అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి షాన్‌యు అన్నారు.
ఇవి కూడా చూడండి:
- శ్రీలంకలో భారత్, చైనా వ్యాపార యుద్ధం!
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- సోషల్ మీడియా హీరోగా మారిన నిరసనకారుడు
- శ్రీలంక: మహిళలు 'డ్రమ్ము'లా ఉండరాదన్న జిమ్.. వెల్లువెత్తిన నిరసనలు
- 'పద్మావత్' పద్మావతికే ఎలా వ్యతిరేకం?
- తొలి రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
- అంటార్కిటికా సముద్రం అడుగున రహస్యాలు ఇవే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








