ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ వాహనం పేల్చివేత.. 9 మంది జవాన్లు మృతి

నక్సల్ దాడి

ఫొటో సోర్స్, Alok Putul/BBC

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఒక మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చివేయడంతో తొమ్మిదిమంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు.

చత్తీశ్‌గఢ్ స్పెషల్ డీజీ (నక్సల్ ఆపరేషన్స్) డీఎం అవస్థి కథనం ప్రకారం.. జిల్లాలోని కిష్టారం-పలోడి రహదారిపై మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. 212వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ సిబ్బంది ఒక ఆపరేషన్ నిమిత్తం వెళుతుండగా, ఈ ఘటన జరిగింది.

ఈ మైన్ ప్రూఫ్ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ పేల్చివేతలో మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే వాయుమార్గం ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు.

ఈ సంఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

నక్సల్ దాడి

ఫొటో సోర్స్, Alok Putul/BBC

ఈ ఘటన జరిగిన వెంటనే రాయ్‌పూర్ నుంచి భారీ ఎత్తున భద్రతా బలగాలను సుక్మా జిల్లాకు తరలించారు.

గత ఏడాది మార్చి 11న జిల్లాలోని భేజి ప్రాంతంలో మావోయిస్టులు చేసిన దాడిలో 12 మంది జవాన్లు మరణించారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే ఏప్రిల్ 24న మావోయిస్టులు ఇదే తరహాలో చేసిన దాడిలో 25 మంది పారామిలటరీ సిబ్బంది మృతి చెందారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)