శ్రీదేవిని స్మరించుకున్న ఆస్కార్

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఆస్కార్ నిర్వహకులు ఇటీవల చనిపోయిన భారతీయ సినీ నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు.
ఆస్కార్ వేడుకలకు ముందు ఏడాది కాలంలో చనిపోయిన ప్రముఖ సినీ నటులందర్నీ నిర్వహకులు ‘ఇన్ మెమోరియమ్’ అనే విభాగంలో చేరుస్తారు. భారతీయ నటి శ్రీదేవిని కూడా ఆ విభాగంలో చేర్చి ఆస్కార్ సభ్యులు ఆమెను స్మరించుకున్నారు. గత డిసెంబర్‌లో చనిపోయిన బాలీవుడ్ నటుడు శశికపూర్‌ను కూడా ఆ జాబితాలో చేర్చారు.
భారత్ నుంచి ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో వీళ్లిద్దరి పేర్లను మాత్రమే ప్రస్తావించారు. మరోపక్క జనవరిలో చనిపోయిన హాలీవుడ్ నటుడు బిల్ పాక్స్‌టన్ ఫొటోను ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో ప్రదర్శించనందుకు సోషల్ మీడియాలో అతడి అభిమానులు ఆస్కార్ నిర్వహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎక్కువ మంది సినీ విశ్లేషకులు ఊహించినట్టుగానే 2018కి గానూ ఉత్తమ చిత్రంగా ‘ది షేప్ ఆఫ్ వాటర్’కి ఆస్కార్ అవార్డు దక్కింది.

ఫొటో సోర్స్, oscar
2018 ఆస్కార్ అవార్డుల జాబితా
- ఉత్తమ చిత్రం: ది షేప్ ఆఫ్ వాటర్
- ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మన్ (డార్కెస్ట్ అవర్)
- ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్‌డార్మండ్ (త్రీ బిల్ బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ)
- ఉత్తమ దర్శకుడు: గల్లీర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్)
- ఉత్తమ సహాయ నటుడు: శామ్ రాక్‌వెల్ (త్రీ బిల్ బోర్డ్స్ అవుట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ)
- ఉత్తమ సహాయ నటి: అల్లీసన్ జెన్నీ (ఐ, టోన్యా)
- ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: కోకో
- ఉత్తమ ఎడిటర్: లీ స్మిత్ (డన్‌కర్క్)
- ఉత్తమ విదేశీ చిత్రం: ఎ ఫెంటాస్టిక్ ఉమన్ (చిలీ)
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: బ్లేడ్ రన్నర్ 2049
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: జోర్డన్ పీలే (గెటౌట్)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




