శ్రీదేవి ట్విటర్ హ్యాండిల్ నుంచి ఇదే చివరి ట్వీట్!

ఫొటో సోర్స్, Getty Images
ఫిబ్రవరి 28న రాత్రి శ్రీదేవి ట్విటర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది.
ఆ ట్వీట్ చదివిన తర్వాత అది శ్రీదేవి భర్త బోనీకపూర్ రాసినట్లు గుర్తించారు.
కుటుంబం కోసం తాను ఎంతగా తపించానో, శ్రీదేవి అంటే తనకు ఎంత ఇష్టమో బోనీకపూర్ అందులో రాశారు.
ట్వీట్‌లో బోనీ కపూర్ ఏమన్నారు?
స్నేహితురాలు, భార్యను పోగొట్టుకుని నేను, తల్లిని కోల్పోయి ఇద్దరు పిల్లలు ఎంత బాధ పడుతున్నామో మాటల్లో చెప్పలేను.
కష్టకాలంలో అండగా నిలబడిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. శ్రీదేవి అభిమానులకు రుణపడి ఉంటా.
తిరిగి కోలుకోలేని ఈ నష్టాన్ని నేను, మా పిల్లలు తట్టుకుని నిలబడాలి.

ఫొటో సోర్స్, Getty Images
'శ్రీదేవే మా బలం.. మా చిరునవ్వుకు కారణం ఆమె'
ప్రపంచానికి శ్రీదేవి ఒక పండు వెన్నెల. నటనలో అందర్ని మెప్పించి వారి సొంత మనిషి అయిపోయింది.
కానీ శ్రీదేవి మై లవ్. నా స్నేహితురాలు. ఇద్దరు పిల్లలకు తల్లి. నా జీవిత భాగస్వామి.
పిల్లలకు ఆమే సర్వస్వం. మా కుటుంబానికి శ్రీదేవే వెన్నెముక.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికాం. ఇప్పుడు మీకొక విజ్ఞప్తి చేస్తున్నా.. మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి.
శ్రీదేవి గురించి చెప్పాలనుకుంటే, ప్రతీఒక్కరిని శ్రీదేవితో కలిపే ప్రత్యేక జ్ఞాపకాల గురించి చెప్పండి.
ఆమె అద్భుతమైన నటి. ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆ విషయంలో శ్రీదేవిని ప్రేమించండి..గౌరవించండి.
ఆమె భౌతికంగా దూరమైనా.. వెండితెరపై ఆమె శాశ్వతంగా నిలిచే ఉంటారు.
నా పిల్లల్ని కాపాడుకోవాలి. శ్రీదేవి లేకుండా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అవే ఇప్పుడు నా ముందున్న సవాళ్లు.
శ్రీదేవే మా జీవితం. మా బలం. నా చిరునవ్వుకు కారణం ఆమె. శ్రీదేవిపై మా ప్రేమ వెలకట్టలేనిది.
నీ ఆత్మకు శాంతి కలగాలి మై లవ్, మా జీవితాలు ఇక ఎప్పటికీ గతంలోలా ఉండవు.
- బోనీ కపూర్
మీరివి చదివారా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









