శ్రీదేవికి చివరి వీడ్కోలు!

ఫొటో సోర్స్, EXPANDBLES
శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, EXPNADBLES
శ్రీదేవికి చివరిసారి వీడ్కోలు పలికి శ్రద్ధాంజలి ఘటించడం కోసం పలువురు బాలీవుడ్ తారలు, ఆమె అభిమానులు ముంబయిలోని సెలెబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ వద్దకు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Expandable
శ్రీదేవి భౌతిక కాయాన్ని విలే పార్లేలోని శ్మశానవాటికకు తరలిస్తున్నారు.

ఫొటో సోర్స్, EXPANDBLE
శ్రీదేవి మద్దతుదారులు రోడ్లపై గుంపులు గుంపులుగా గుమిగూడారు.

ఫొటో సోర్స్, DIVYAKANT SOLANKI/EPA
శనివారం నాడు శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని ముంబయికి తీసుకొచ్చారు. ప్రజలు ఆమెను చివరిసారి చూడడానికి వీలుగా స్పోర్ట్స్ క్లబ్‌లో ఉంచారు.

ఫొటో సోర్స్, DIVYAKANT SOLANKI/EPA
బుధవారం సాయంత్రం శ్రీదేవి అంతిమయాత్ర ప్రారంభమైంది. 54 ఏళ్ల శ్రీదేవి దుబాయ్‌లోని ఒక హోటల్ గదిలో మరణించారు.

స్పృహ కోల్పోయాక, బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోవడం వల్ల శ్రీదేవి చనిపోయినట్టు దుబాయ్ పోలీసులు నివేదికలో తెలిపారు.

ఫొటో సోర్స్, EXPANDABLE/PR
తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించిన శ్రీదేవి ఒక దశలో సక్సెస్‌కు మారుపేరుగా పేరు పొందారు.

ఫొటో సోర్స్, EXPANDABLE/PR
యాదృచ్ఛికంగా, సరిగ్గా 21 ఏళ్ల క్రితం, ఫిబ్రవరి 28 నాడే శ్రీదేవి నటించిన హిందీ చిత్రం 'జుదాయి' (ఎడబాటు) విడుదలైంది.

ఫొటో సోర్స్, EXPANDABLE/PR
ఇవి చదివారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








