శ్రీదేవి మృతదేహంపై జాతీయజెండా ఎందుకు కప్పారు?

ఫొటో సోర్స్, Getty Images
నటి శ్రీదేవికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
కుమార్తెలు ఖుషి, జాన్వీ చెంతన ఉండగా, భర్త బోనీకపూర్ ఆమె చితికి నిప్పంటించారు.
హిందూ సంప్రదాయ పద్ధతిలో శ్రీదేవికి తుది వీడ్కోలు పలికారు.
కడసారి చూపు కోసం శ్రీదేవి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

ఫొటో సోర్స్, Expandable
అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు.
అధికార లాంఛనాల్లో భాగంగా పోలీసులు తుపాకులు గాల్లోకి పేల్చారు.
శ్రీదేవి భౌతికకాయానికి త్రివర్ణ పతాకాన్ని కప్పారు.
ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒక నటి డెడ్‌బాడీకి జాతీయజెండాను కప్పడంపై సోషల్ మీడియాలోనూ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.


ఫొటో సోర్స్, Twitter


ఫొటో సోర్స్, Twitter

శ్రీదేవి మృతదేహంపై జాతీయజెండా ఎందుకు కప్పారు?
మొదట్లో కొందరికి మాత్రమే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేవారు.
ప్రస్తుతం ఒక వ్యక్తి హోదా, సమాజంలో ఉన్న గౌరవం ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నారు.
'రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ బట్టి ఈ నిర్ణయం ఉంటుంది' అని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మాజీ మంత్రి ఎంసీ నానయ్య బీబీసీతో చెప్పారు.
మరణించిన సదరు వ్యక్తికి అధికార లాంఛనాలతో వీడ్కోలు పలకాలా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని, దానికి ప్రస్తుతానికి ఎలాంటి గైడ్‌లైన్స్ లేవని ఆయన అన్నారు.
సాధారణంగా రాజకీయాలు, కవిత్వం, న్యాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలు, చిత్ర పరిశ్రమలో విశిష్ట సేవలు అందించిన వారు మరణించినప్పుడు వారికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
2013లో భారత ప్రభుత్వం శ్రీదేవిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఫొటో సోర్స్, Expandable
ఈ నిర్ణయం ఎవరు తీసుకుంటారు?
ఇతర సీనియర్ మంత్రులతో చర్చించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటారు.
ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలి. అధికార లాంఛనాల ఏర్పాట్లను వారు పర్యవేక్షిస్తారు.
స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి మహాత్మాగాంధీకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
మాజీ ప్రధానమంత్రి నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీలకు కూడా అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు.
రాజకీయాలతో సంబంధంలేని మదర్ థెరిస్సా, సత్యసాయి బాబాలకు కూడా అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికారు.

ఫొటో సోర్స్, Twitter
ఇదే తొలిసారి కాదు!
అయితే, 'సినిమా నటులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఇదే తొలిసారి కాదు' అని మాజీ హోంమంత్రి ఎస్‌సీ శ్రీవాత్సవ చెప్పారు.
గతంలో శశికపూర్‌కి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంప్రదాయం ఉంది.
అయితే, రాజేశ్ ఖన్నా, వినోద్ ఖన్నా, షమ్మీ కపూర్‌లకు మాత్రం ఈ గౌరవం దక్కలేదు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
మీరివి చదివారా?
- REALITY CHECK: ఈ ఫొటోలు ఇప్పటివి కావు!
- సిరియా: ‘ఆకలి తీరాలంటే కోరిక తీర్చాలన్నారు’
- కార్తి చిదంబరం అరెస్టు: ఆరోపణలేంటి?
- అస్సాం: ‘మేం బంగ్లాదేశీయులం కాదు.. భారతీయులమే! ఇవిగో ఆధారాలు!
- 'ఎప్పుడు ఏ వైపు నుంచి తూటాలు దూసుకొస్తాయో!'
- చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ పోలీసుల బుల్లెట్లకే బలయ్యాడా?
- ఏ సెల్‌ఫోన్‌తో ఎంత ప్రమాదం?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








