ఈ బికినీ ఎక్కడ పుట్టింది? ప్రపంచమంతా ఎలా పాకింది?

బికినీ
    • రచయిత, గ్రెగ్ బ్రోస్నన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాటలీనా అల్వరేజ్ తన తండ్రి నిర్వహించే బట్టల ఫ్యాక్టరీకి ఎప్పుడూ వెళ్తూ ఉండేవారు. ఓ రోజు కాటలీనా చూపు ఆ ఫ్యాక్టరీలో ఓ మూలన పడి ఉన్న రంగురంగుల, మెరిసే బట్ట ముక్కలపై పడింది.

కత్తిరించి పడేసిన గుడ్డముక్కల కుప్పలోంచి ఓ ఐడియా పుట్టుకొచ్చింది. అంతే, కొలంబియా మీదుగా మొత్తం ప్రపంచమంతా ఆ ఐడియా పాకిపోవడమే కాదు, కాటలీనాకు బోల్డంత గుర్తింపు, ఆదాయం సమకూర్చి పెట్టింది.

ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ కాటలీనా ఇలా అన్నారు - "అది నాకు వావ్ అనుకునే సందర్భం. నాకో ఖజానా దొరికిందనుకోండి. ఎందుకంటే, ఆ గుడ్డముక్కల్లోంచి నేనేమైనా చెయ్యగలననే విశ్వాసం నాకప్పుడే కలిగింది."

వీడియో క్యాప్షన్, అగువా బెండిటా 60 దేశాలకు స్విమ్‌వేర్ ఎగుమతి చేస్తుంది.

కాటలీనా తనకొచ్చిన ఈ ఐడియాను డిజైనింగ్ కోర్సు చదువుతున్న తన స్నేహితురాలితో పంచుకున్నారు. ఆ తర్వాత తన బామ్మ ఇంట్లో ఉన్న కుట్టు మిషన్‌పై కూర్చొని పని మొదలుపెట్టారు.

గుడ్డ ముక్కలతో ఆ కుట్టుమిషన్‌పైనే కాటలీనా బికినీలను కుట్టేశారు.

బికినీ

ఫొటో సోర్స్, Agua Bendita

ఫొటో క్యాప్షన్, ఈ కంపెనీ బికినీలు 60 దేశాలలో సరఫరా అవుతాయి.

ఇది 2003 నాటి మాట. ఇప్పుడు కాటలీనాకు చెందిన అగువా బెండిటా కంపెనీ 60 దేశాలకు బికినీలు సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ వార్షికాదాయం 7.5 మిలియన్ డాలర్లు.

కాటలీనా కంపెనీ రూపొందించిన ఓ డిజైన్ 2007లో స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మ్యాగజీన్‌లో చోటు సంపాదించుకుంది. దీని ప్రాముఖ్యత ఏంటో చెప్పాలంటే... అలా చోటు దక్కడం స్విమ్ సూట్ల ప్రపంచంలో ఆస్కార్ అవార్డు లభించడంతో సమానం.

ప్రస్తుతం ఈ కంపెనీ ఏటా లక్షన్నర బికినీలు విక్రయిస్తోంది. అదనంగా 50 వేల బీచ్‌వేర్ విక్రయిస్తోంది.

అగువా బెండిటా

ఫొటో సోర్స్, Agua Bendita

ఈ కంపెనీ అంతగా ప్రాచుర్యంలో లేని నమూనాలలో బికినీలను రూపొందిస్తుంది. వీటిలో మెరిసే రంగుల్ని బాగా ఉపయోగిస్తారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం మెండలిన్‌లో ఉంది. 120 మంది ఈ కార్యాలయంలో పని చేస్తారు.

బికినీల ఫినిషింగ్ కోసం గ్రామీణ ప్రాంతాలలో నివసించే దర్జీల సమూహాలకు పంపిస్తారు. ఈ బికినీల తయారీలో మొత్తం 900 మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పని చేస్తున్నట్టు కంపెనీ చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)