అల్ట్రానిక్స్: ‘వైద్యులు తప్పు చేస్తారేమో, ఇది మాత్రం చేయదు’
ఆధునిక వైద్యం మనిషికి అందించిన వరం.. స్కానింగ్. ఆ స్కానింగ్ చేయాలంటే డాక్టర్ల సహాయం కావాలి. కానీ భవిష్యత్తులో ఆ అవసరం ఉండకపోవచ్చు. వైద్యుల కంటే ముందే రోగాన్ని పసిగట్టే యంత్రం వచ్చేస్తోంది.
డాక్టర్లకంటే కచ్చితత్వంతో స్కానింగ్ నిర్వహించే కృత్రిమ మేధస్సును యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఆ యంత్రం పేరు ‘అల్ట్రానిక్స్’. ప్రపంచంలోనే తొలి సైబర్ కార్డియాలజిస్ట్ అది. వైద్యుల కంటే చాలా ముందుగానే రోగాలను పసిగట్టే శక్తి దాని సొంతం.
ఆ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యంత్రం వైద్యరంగ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
‘రాబోయే ఇరవై ఏళ్లలో వైద్య వ్యవస్థలో కృత్రిమ మేధస్సు కీలకపాత్ర పోషిస్తుంది. ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. వైద్యులు, ప్రస్తుతం ఉన్న యంత్రాల కంటే మెరుగ్గా అవి జబ్బుల్ని గుర్తిస్తాయి’ అంటారు సర్ జాన్ బెల్. యూకేలోని ‘ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్’ విభాగానికి ఆయన అధిపతి.

యూకేలోని జాన్ రాడ్‌క్లిఫ్ ఆస్పత్రిలో అల్ట్రానిక్స్‌ను అభివృద్ధి చేశారు. గుండె స్కానింగ్‌ను ఆ యంత్రం విశ్లేషిస్తుంది. దాని ఆధారంగా రోగికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఏ మేరకు ఉందో అది స్పష్టంగా చెబుతుంది.
డాక్టర్లు నిర్వహించే ప్రతి ఐదు వైద్య పరీక్షల్లో ఒక దాని ఫలితాలు తప్పయ్యే అవకాశాలున్నాయి. కానీ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహించే పరీక్షల్లో కచ్చితత్వం ఎక్కువ.
ఈ యంత్రం ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను కూడా పసిగడుతుంది. వైద్యుల కంటే ఎన్నో నెలల ముందే కృత్రిమ మేధస్సు ఆరోగ్య సమస్యలను గుర్తించగలదు.
దీని వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. రోగులు అనవసరమైన టెన్షన్ నుంచి కూడా బయటపడతారు.
కృత్రిమ మేధస్సుకి బ్రిటన్ పెట్టింది పేరు. ఈ యంత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అక్కడి ప్రభుత్వ రంగ ఆస్పత్రులకు రాబోయే రోజుల్లో ఉచితంగా దీని సేవలు అందించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
మా ఇతర కథనాలు
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- ఇంటి పనులు చేయడం లేదా? అయితే ఇది చదవండి!
- జికా వైరస్: క్యాన్సర్‌కు మందు
- టీవీ సీరియల్ తెచ్చిన చైతన్యం
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- ముందు బాబు పుట్టాడు.. మళ్లీ వెంటనే పాప పుట్టింది.. ఇద్దరూ చనిపోయారని వైద్యులు చెప్పారు.. పార్సిల్ చేశారు.. తర్వాత ఏమైంది?
- తన రక్తంతో బట్టలకు రంగులద్దుతోందీమె!
- పొడవుంటే కేన్సర్ రిస్క్ ఎక్కువా?
- 'ఉత్తర కొరియా జైలులో నేను శవాల్ని పూడ్చిపెట్టాను'
- ఇది రైతు కూలీలను మింగేస్తుందా?
- రజినీకాంత్ మాటలకు అర్థమేమిటి?
- ఆమె ‘డర్టీ పిక్చర్స్’ ఎందుకు తీస్తున్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










