రైతు కూలీలకు గండికొట్టే రోబోలు వచ్చేస్తున్నాయ్
వ్యవసాయ రంగంలోకి రోబో రైతులు ప్రవేశిస్తున్నాయి. వీటితో భవిష్యత్తులో వ్యవసాయ కూలీల ఉపాధికి పెద్దఎత్తున గండిపడే అవకాశం ఉంది.
రానున్న రెండు మూడు దశాబ్దాల్లో వ్యవసాయం పూర్తిగా డిజిటల్ అయిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రైతుగా.. కూలీగా.. వ్యవసాయ శాస్త్రవేత్తగా.. ఇలా అన్ని పనులూ అలవోకగా చేసే రోబోలు రానున్నాయని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పొలంలో కలుపు మొక్కలను గుర్తించి తొలగించడం మొదలుకుని.. పంట కోత వరకు అన్ని పనులూ చేయగలవు.
రైతు పొలానికి వెళ్లాల్సిన పనుండదు. ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్‌తో కమాండ్ ఇచ్చి రోబో సాయంతో పంటలను పర్యవేక్షించొచ్చు.
బీబీసీ స్టూడియోస్ అందిస్తున్న పై వీడియోలో పంట చేలలో కలుపు తీసే రోబోను చూడొచ్చు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)