మధుమేహం: తన రక్తంతో బట్టలకు రంగులద్దుతున్న డిజైనర్

ఫొటో సోర్స్, MELANIE HYAMS
పోపి నాష్‌కు ఆరు సంవత్సరాల వయసులోనే మధుమేహ వ్యాధి వచ్చింది. దీంతో ఆమె శరీరంలో ఇన్సూలిన్ ఉండేది కాదు.
"డాక్టర్ మధుమేహం వ్యాధి గురించి చెప్పేవాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. అలాంటి భయాన్ని నేనెప్పుడూ చూడలేదని" పోపి నాష్ తెలిపింది.
మధుమేహం ఉందని నిర్ధారించిన తరువాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.

ఫొటో సోర్స్, MELANIE HYAMS
పరీక్షలు అమ్మే చేసేది
"ఒక రోజుకు ఎన్నో సార్లు నాకు రక్త పరీక్ష చేసి ఇన్సూలిన్ ఇచ్చేవారు. అమ్మే ఇవన్నీ చేసేదని" ఆమె తెలిపింది.
18 ఏళ్ల వయసులో ఎక్కువ మోతాదులో ఇన్సూలిన్ తీసుకోవడంతో పోపి నాష్ అనారోగ్యం పాలయ్యింది. దీంతో కొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే గడిపింది.
" ఆ సంఘటన నా కళ్ళు తెరిచింది అప్పుడే ఈ వ్యాధి గురించి పూర్తిగా అర్ధమయ్యిందని" నాష్ తెలిపింది.

ఫొటో సోర్స్, MELANIE HYAMS
ఆ తరువాత గ్లాస్గో స్కూల్ అఫ్ ఆర్ట్‌లో కమ్యూనికేషన్ డిజైన్‌లో చేరి వస్త్ర రంగాన్ని ఎంచుకుంది. అక్కడే నాష్ స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకుంది.
"మానసిక ఒత్తిడి వల్ల నా శరీరంలో చక్కర అదుపులో ఉండేది కాదు. అందుకే నేను నా ప్రాజెక్ట్‌ను ఆపేశాను. కానీ నా భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తే జీవితమంటే ఏమిటో అర్ధమయ్యింది.’’
మధుమేహ పరీక్ష చేసే పరికరంలో నమూనాలను చూసేది. అప్పుడే ఆమెకు జీవ క్రియ కోసం శరీరం ఎంత కష్ట పడుతుందోనని అర్ధమయ్యింది.

ఫొటో సోర్స్, MELANIE HYAMS
అప్పుడే ఆమెకు ఓ కొత్త ఆలోచన తట్టింది
మధుమేహ పరీక్ష చేసేందుకు తీసే రక్తంలో కొంత రక్తాన్ని తీసుకొని ఉంచేది దాన్నే కొత్త వస్త్రాలపై ప్రింట్ చేసేది. "అలా చేస్తున్నప్పుడు నా రక్తంతో వస్త్రాలను డిజైన్ చేస్తున్నట్లు అనిపించేదని" తెలిపింది.
"మీరెప్పుడైనా ఏదైనా ప్రాజెక్ట్‌పై పని చేస్తుంటే.. తప్పకుండా దానిపై మీకు పూర్తి నమ్మకం, విస్వాసం ఉండాలి" అని చెప్పింది.
ప్రతిరోజూ తన చక్కెర స్థాయిల అంకెల్ని కూడా వస్త్రాలపై ముద్రించటం మొదలు పెట్టింది. ఈ అంకెల్ని ఒక మధుమేహ రోగిలాగా కాకుండా ఒక కళాకారిణిగా చూస్తుంటానని ఆమె అంటోంది.
"పని చేస్తున్నప్పుడు నాకు చాలా భయమేసేది అయినా కూడా నేను నేను భయపడలేదు ఎందుకంటే ఈ భయం నాకు వరం. అదే నన్ను నా ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునేలా చేసింది. నా గురించి, నా ఆరోగ్యం గురించి పూర్తి శ్రద్ధ తీసుకుంటానని" నాష్ తెలిపింది.
పనిని ఒక కళగా భావిస్తే మానసికంగా ఎలాంటి ఒత్తిడి ఉండదని నాష్ తేలిపింది. అది ఒక "అద్భుత చికిత్స" అని ఆమె అంటోంది. తాను కూడా తన పనిని కళగా భావిస్తానని తెలిపింది.

ఫొటో సోర్స్, MELANIE HYAMS
ప్రస్తుతానికి నాష్ దుస్తులు, డిజైన్ చేసిన వస్త్రాల ప్రదర్శనలపై పూర్తిగా దృష్టి పెట్టింది.
తన మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు, తన పనిలో సృజనాత్మకతకు మరింత పదును పెట్టడమే తన లక్షమని తెలిపింది.
‘‘మధుమేహంతో చాలా మంది నిద్రలోనే ప్రాణాలు విడుస్తున్నారు. కానీ, నేను మాత్రం అలా కాకూడదు అని గట్టిగా అనుకుంటాను. నేను రూపొందించిన దుస్తుల్ని ప్రజలు ధరించాలని నేను కోరుకుంటాను. అవి కేవలం మధుమేహ రోగులకు మాత్రమే కాదు. మధుమేహం లేని వాళ్లు కూడా దీనిపై చర్చించుకోవాలి’’ అని నాష్ తెలిపింది.
(నవంబర్ 14 అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం. మధుమేహంపై అవగాహన పెంచేందుకు దీన్ని పాటిస్తుంటారు)
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








