అర్జెంటీనా: గల్లంతైన జలాంతర్గామి పేలిపోయిందా?

ఫొటో సోర్స్, Reuters
గల్లంతైన అర్జెంటీనా జలాంతర్గామిలోని సిబ్బంది ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందా? అంటే, లేదనే చెబుతున్నాయి తాజా పరిణామాలు. సబ్‌మెరైన్ మిస్సైన ప్రాంతంలోనే భారీ పేలుడు సంభవించినట్టు తెలిసిందని నేవీ అధికారులు వెల్లడించారు.
దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో అరా శాన్ జ్వాన్ జలాంతర్గామి గత బుధవారం గల్లంతైంది. అందులో 43 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. సబ్ మెరైన్‌లో పనిచేస్తున్న తొలి అర్జెంటీనా మహిళా అధికారి ఆమె.
ఆ జలాంతర్గామి ఆచూకీ కనిపెట్టేందుకు అర్జెంటీనాకు తోడుగా అమెరికా, బ్రిటన్, రష్యా సహా పలు దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
అయితే, సముద్రంలో అసాధారణ రీతిలో, భయంకరమైన పేలుడు సంభవించినట్టు వియన్నాలోని కాంప్రెహెన్సివ్ న్యూక్లియర్- టెస్ట్- బ్యాన్ ట్రెటీ ఆర్గనైజేషన్(సీటీబీటీఓ) గుర్తించిందని అర్జెంటీనా నేవీ తెలిపింది.
సబ్ మెరైన్ గల్లంతైన కొద్ది గంటల అనంతరం పెద్ద శబ్దం వచ్చిందని అమరికా కూడా చెప్పింది.
దీంతో ఆ సబ్‌మెరైన్‌లోని సిబ్బంది బంధువులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. నేవీ తప్పుడు వార్తలు ఇస్తోందంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలాంతర్గామి భద్రతను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడుతున్నారు.

ఫొటో సోర్స్, Reuters
గల్లంతైన జలాంతర్గామి విశేషాలు
- 1983లో జర్మనీలో తయారు చేశారు
- పొడవు - 66 మీటర్లు
- గరిష్ఠ వేగం - గంటకు 45 కిలోమీటర్లు
- పరిధి - 22,224 కిలోమీటర్లు
గతంలో జరిగిన కొన్ని జలాంతర్గాముల ప్రమాదాలు
- 2003లో చైనా సబ్ మెరైన్ పాడైపోయింది. ఆ ప్రమాదంలో 70 మంది సిబ్బంది ఊపిరాడక మృతి చెందారు.
- 2000లో రష్యా జలాంతర్గామి బారెంట్స్ సముద్రంలో మునిగి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 118 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
- 1968లో అట్లాంటిక్ సముద్రంలో అమెరికా నేవీకి చెందిన యూఎస్‌ఎస్ స్కార్పియో మునిగిపోయింది. ఆ ఘటనలో 99 మంది సిబ్బంది మరణించారు.
- 1963లో అమెరికా జలాంతర్గామి 'థ్రెషర్' మునిగిపోయింది. అందులోని 129 మంది మృతి చెందారు. చరిత్రలో అదే అతిపెద్ద సబ్‌మెరైన్ ప్రమాదం.
గల్లంతైన జలాంతర్గాములను ఎందుకంట కష్టం?
గల్లంతైన సబ్ మెరైన్‌లను గుర్తించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే, ఎవరూ గుర్తించలేని విధంగా వాటిని తయారు చేస్తారు. సోనార్ డిటెక్టర్లు సైతం అంత సులువుగా కనిపెట్టలేవు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









