పద్మావతి: నిరసనలకు కారణం వదంతులా? వాస్తవాలా?

ఫొటో సోర్స్, Alamy
పద్మావతి సినిమాపై కొన్ని హిందూ సంస్థలు, రాజ్‌పుత్ కులానికి చెందిన కొందరు నిరసనలకు దిగడంతో ఆ సినిమా నిర్మాతలు దాని విడుదలను నిరవధికంగా వాయిదా వేశారు. ఆ చిత్రం చుట్టూ నెలకొన్న వివాదంపై సుధా జీ తిలక్ వివరణాత్మక కథనం.
వివాదం దేని గురించి?
పద్మావతి చిత్రం 14వ శతాబ్దంలో రాజ్‌పుత్ కులానికి చెందిన హిందూ రాణి, ముస్లిం పాలకుడు అలావుద్దీన్ ఖిల్జీకి మధ్య జరిగిన కథ గురించి చెబుతుంది.
సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపికా పదుకోనె, రణవీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
కొన్ని హిందూ, రాజ్‌పుత్ సంఘాలు ఈ రెండు పాత్రల మధ్య శృంగారపరమైన దృశ్యాలు చిత్రీకరించారని ఆరోపిస్తున్నాయి. అయితే దీనిని ఈ చిత్ర నిర్మాతలు కొట్టిపారేస్తున్నారు.
16వ శతాబ్దపు కవి మాలిక్ ముహమ్మద్ జాయ్‌సీ రచించిన ఇతిహాస కావ్యం 'పద్మావత్' లో ముఖ్య నాయిక పద్మావతి.
అవధి భాషలో ఉన్న ఈ కావ్యంలో - రాజ్‌పుత్ రాజైన తన భర్తను చంపిన ముస్లిం చక్రవర్తి ఖిల్జీ బారి నుంచి తనను తాను కాపాడుకోవడానికి పద్మావతి సతీసహగమనం చేసిందని పేర్కొన్నారు.
700 ఏళ్ల క్రితం రాజ్‌పుత్‌లలో ఈ సతి ఆచారం పుట్టిందని భావిస్తున్నారు.
యుద్ధంలో తమ మగవాళ్లు ఓటమి పాలైనపుడు విజేతలు తమను ఎత్తుకెళ్లకుండా రాజ్‌పుత్ మహిళలు తమను తాము చితికి ఆహుతి చేసుకునేవారని చెబుతారు. కానీ తర్వాత కాలంలో ఇది భార్యల పతిభక్తికి నిదర్శనంగా మారింది. భారతదేశంలోని సంస్కరణవాదుల కృషి ఫలితంగా 1829లో బ్రిటిష్ పాలకులు సతిని నిషేధించారు.
ఒక హిందూ రాణి అందానికి ఆకర్షితుడైన ముస్లిం చక్రవర్తి అన్న అంశం ఆధారంగా జాయ్‌సీ ఈ ఇతిహాస కావ్యం రాశారు. చరిత్ర ప్రకారం ఆ దురాక్రమణ జరిగిన 200 ఏళ్ల తర్వాత జాయ్‌సీ ఈ కావ్యాన్ని అక్షరబద్ధం చేశారు. అయితే దానిలో సతిని కీర్తించడం వల్ల అది వివాదాస్పదంగా మారింది.
ఇటీవలి నిరసన ప్రదర్శనలను గమనిస్తే - పద్మావతిని దేవతగా కొలుస్తూ, ఆమెను రాజ్‌పుత్ మహిళల గౌరవానికి ప్రతీకగా భావిస్తున్నారని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, VIACOM18 MOTION PICTURES
హిందూ వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
ఈ చిత్రంలో ఒక ముస్లిం రాజు హిందూ రాణితో శృంగారం గురించి కలలు కంటాడనే వదంతులతో రాజ్‌పుత్ కర్ణీ సేనలాంటి సంస్థలు ఆగ్రహానికి లోనయ్యాయి. దాంతో వారు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
గత ఏడాది సినిమా షూటింగ్‌ను అడ్డుకుని, భన్సాలీపై దాడి చేసిన ఈ సంస్థ, ఇప్పుడు సినిమా హాళ్లను ధ్వంసం చేసి, రామాయణంలో శూర్పణఖ ముక్కును కోసేసినట్లు దీపిక ముక్కును కోసేస్తామని హెచ్చరించింది.
బీజేపీ పాలిస్తున్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాలతో పాటు అనేక రాష్ట్రాలలో కర్ణీ సేన నిరసస ప్రదర్శనలు నిర్వహించింది.
రాజ్‌పుత్ కులానికి చెందిన వారు భన్సాలీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజె ఏ వర్గం వారి మనోభావాలను దెబ్బ తినకుండా ఆ సినిమాలో అవసరమైన మార్పులు చేసేంతవరకు దానిని విడుదల చేయరాదని అన్నారు.
భన్సాలీ, దీపికల తలలు నరికిన వారికి పది కోట్లు ఇస్తానని ఓ బీజేపీ నేత గతవారం ప్రకటించారు.
రాజస్థాన్‌కు చెందిన కొంత మంది మాజీ రాజవంశీకులు కూడా ఈ చిత్రాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు.
వారిలో ఒకరైన మహేంద్ర సింగ్ చిత్రంలో నృత్యాన్ని ప్రస్తావిస్తూ ''ఒక పక్క ఆమెకు నీరాజనాలు అర్పిస్తున్నామంటూనే ఆమె చేత వేశ్య లాగా డ్యాన్స్‌లు వేయించడం చారిత్రక వక్రీకరణే'' అన్నారు.
అయితే దర్శకులు భన్సాలీ మాత్రం తమ చిత్రంలో ఎలాంటి 'డ్రీమ్ సీక్వెన్స్' ఉండవని తెలిపారు. "కేవలం కొన్ని వదంతుల వల్లే పద్మావతి వివాదాల్లో చిక్కుకుంది" అని ఆయన అన్నారు.
అయితే ఒక ఊహాజనిత రాణి గౌరవమర్యాదలను కాపాడాలనుకుంటున్న వారు ఆయన చేస్తున్న విజ్ఞప్తులను చెవిన పెట్టడం లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చరిత్రకారులు ఏమంటున్నారు?
పలువురు చరిత్రకారులు, విద్యావేత్తలు బాలీవుడ్ నిర్మాతలు, నటులకు అండగా నిలబడ్డారు. వారిపై బెదిరింపులకు, చిత్రాన్ని నిషేధించాలన్న ప్రచారానికి వ్యతిరేకంగా అనేక చోట్ల నిరనన ప్రదర్శనలు నిర్వహించారు.
ఒక కాల్పనిక చిత్రంపై ఇలాంటి దౌర్జన్యపూరిత ప్రతిస్పందన రావడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Reuters
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ప్రముఖ చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ పద్మావతి కేవలం ఒక ఊహాజనిత పాత్ర అని స్పష్టం చేసారు.
మరోవైపు, ఈ సినిమాలో ముస్లిం చక్రవర్తి ఖిల్జీని ఒక చపలచిత్తుడైన దుష్టుడిగా చూపించారని ఈ సినిమా ట్రైలర్ చూసిన కొంతమంది ఉదారవాదులు ఆరోపించారు.
రచయిత దేవదత్ పట్నాయక్ భన్సాలీ చిత్రం సతిని 'గ్లామరైజ్' చేస్తోందని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
క్రిష్ అశోక్‌లాంటి ఇతరులు మీడియా ఈ విషయానికి అనవసరంగా ప్రాధాన్యత ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
నటి షబానా అజ్మీ ఈ చిత్రానికి రక్షణ కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, Viacom18 Motion Pictures
తర్వాత ఏం జరగబోతోంది?
పద్మావతిపై నిరసనల కారణంగా డిసెంబర్ 1న విడుదల కావాల్సిన ఆ సినిమాను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ఆదివారం ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
నటి ట్వింకిల్ ఖన్నా బెదిరింపులకు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పే విధంగా ఆ చిత్రం భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)