స్టీవెన్ సీగల్ నన్ను లైంగికంగా వేధించారు: పోర్షియా దె రోసీ

ఫొటో సోర్స్, Getty Images
నిన్నటి తరం హాలీవుడ్ యాక్షన్ హీరో స్టీవెన్ సీగల్ తనను లైంగికంగా వేధించినట్లు నటి పోర్షియా దె రోసీ ఆరోపించారు.
‘అరెస్టెడ్ డెవలప్‌మెంట్’ సినిమాతో నటిగా పేరు తెచ్చుకున్న దె రోసీ బుధవారం రాత్రి ఒక ట్వీట్‌లో ఈ ఆరోపణ చేశారు.
నటుడు, నిర్మాత కూడా అయిన సీగల్ ఒక సినిమా ఆడిషన్ సందర్భంగా ‘‘తెర వెనుక ‘కెమిస్ట్రీ’ ఉండటం ఎంత ముఖ్యమో’’ అని తనతో చెప్తూ ప్యాంటు విప్పారని ఆమె ఆరోపించారు.
ఈ ఆరోపణపై వ్యాఖ్యానించడానికి సీగల్ నిరాకరించారని ఆయన మేనేజర్ ‘బీబీసీ’తో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
1980, 1990లలో యాక్షన్ పాత్రలకు సీగల్ ప్రసిద్ధి గాంచారు. అండర్ సీజ్, ఫ్లైట్ ఆఫ్ ఫ్యురీ వంటి సినిమాలు అందులో ఉన్నాయి. 2016లో ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా పౌరసత్వం ఇచ్చారు.
‘గుడ్ వైఫ్‘ సినిమా నటి జూలియానా మార్గ్యులీస్, మోడల్ జెన్నీ మెక్‌కార్తీలు సహా ఇంకొందరు ఇతర మహిళలు కూడా సీగల్ అనుచిత ప్రవర్తన, వేధింపుల మీద ఆరోపణలు చేశారు.
నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ తమపై లైంగిక వేధింపులు, లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పలువురు మహిళలు ఆరోపణలు చేయడం మొదలైన తర్వాత హాలీవుడ్‌లో తాజాగా అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు స్టీవెన్ సీగల్.

ఫొటో సోర్స్, Getty Images
తనపై చేసిన సమ్మతి లేని సెక్స్ ఆరోపణలన్నిటినీ హార్వీ వైన్‌స్టీన్ నిరాకరించారు.
సీగల్ ప్రవర్తనపై ఆ సమయంలో తాను చేసిన ఫిర్యాదును ఆయన ఏజెంట్ కొట్టివేశారని నటి దె రోసీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే ఆ ఆడిషన్ ఏ సినిమా కోసం జరిగింది, ఏ సంవత్సరంలో ఆ ఘటన జరిగింది అనేది ఆమె వెల్లడించలేదు.
ఆస్ట్రేలియన్-అమెరికన్ నటి అయిన పోర్షియో.. అమెరికా టెలివిజన్ టాక్ షో హోస్ట్ ఎలెన్ దెజెనెరెస్‌ను తొమ్మిదేళ్ల కిందట వివాహమాడారు.
ఎలెన్ దెజెనెరెస్ కూడా నటి. ఆమె ‘‘నా భార్యను చూసి నాకు ఎంతోగర్వంగా ఉంది’’ అని పేర్కొంటూ దె రోసీ ట్వీట్‌ను గురువారం తన 75 మంది ఫాలోయర్లకు షేర్ చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









