‘‘ఉద్యోగానికి ఆఫర్ లెటర్ ఇచ్చాక, చివరి నిమిషంలో చేరలేనని చెప్పడం న్యాయమా’’- ఈ అంశంపై ఎందుకు చర్చ జరుగుతోంది?

ప్రశాంత్ పిట్టి చేసిన ట్వీట్‌కు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి

ఫొటో సోర్స్, EASEMYTRIP WEBSITE

ఫొటో క్యాప్షన్, ప్రశాంత్ పిట్టి చేసిన ట్వీట్‌కు సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి

భారత్‌కు చెందిన ఒక స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు చేసిన ఒక ట్వీట్, సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

ఆయన చేసిన ఈ ట్వీట్ కారణంగా ఉద్యోగులు, యజమానులు ఒకరిపట్ల ఒకరు ఎలాంటి గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తున్నారు.

ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ 'ఈజ్ మై ట్రిప్' సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి చేసిన ట్వీట్‌తో ఈ చర్చ మొదలైంది.

ప్రశాంత్ పిట్టి, తనకు ఒక ఉద్యోగార్ధి పంపిన మెసేజ్‌ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు.

'నాకు మరో జాబ్ ఆఫర్ రావడం వల్ల మీ సంస్థలో చేరకూడదని నిర్ణయించుకున్నా' అని పేర్కొంటూ సదరు అభ్యర్థి ప్రశాంత్ పిట్టికి మెసేజ్ పంపారు. ఈజ్ మై ట్రిప్ కంపెనీలో జాయిన్ కావాల్సిన రోజునే ఆ వ్యక్తి, తాను చేరలేనంటూ సందేశాన్ని పంపించారు.

ఆ స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో పంచుకుంటూ... ''తీరా సమయానికి ఇలా చెప్పడం వ్యవస్థలో ప్రబలిపోయింది. ఇదో పెద్ద సమస్య'' అంటూ ప్రశాంత్ పిట్టి వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వర్క్ కల్చర్ గురించి సోషల్ మీడియాలో చర్చలు భారత్‌లో సాధారణం అయ్యాయి.

ఇటీవలే బాంబే షేవింగ్ కంపెనీ సీఈవో చేసిన ఒక సూచన ఆయనపై విమర్శలకు దారి తీసింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు రోజుకు 18 గంటలు పనిచేయాలని ఆయన సూచించారు.

అభ్యర్థులు చివరి నిమిషంలో ఇలా నిర్ణయాలు మార్చుకుంటే కంపెనీలకు సమయంతో పాటు వనరులు వృథా అవుతాయని ప్రశాంత్ అన్నారు.

అయితే, ప్రశాంత్ పిట్టి చేసిన ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

కొందరు ఆయనకు మద్దతుగా స్పందిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, కొత్త కార్మిక చట్టాలు ఫ్యాక్టరీల్లో భద్రతా నిబంధనలను మరింత బలహీన పరిచాయా?

ప్రస్తుతం కంపెనీలు ఉద్యోగులను తొలగించడాన్ని, జాబ్ ఆఫర్లను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ కొందరు ట్విటర్ యూజర్లు సదరు అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. ఉద్యోగులను తొలిగించడాన్ని కంపెనీలు సమర్థించుకుంటే, దీన్ని కూడా అంగీకరించాల్సిందే అని అంటున్నారు.

''ఉద్యోగుల్ని తొలిగించడం 'తప్పు' అవుతుంది. ఒకవేళ ఆఫర్ లెటర్ పంపిన తర్వాత చివరి క్షణంలో అభ్యర్థుల్ని కంపెనీలు తిరస్కరిస్తే అది సరైనదేనా, ఇది ఆమోదయోగ్యమేనా, కాదు కదా?'' అని ప్రశాంత్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలి ? అనే అంశంపై కూడా చర్చలు జరిగాయి.

అధిక జీతాలు ఇవ్వడం లేదా ఆఫర్ లెటర్‌పై సంతకం చేసిన రెండు వారాల్లో అభ్యర్థులు, కంపెనీలో చేరేలా చేయాలంటూ కొంతమంది సూచించారు.

ప్రశాంత్ పిట్టికి, వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ మద్దతు పలికారు.

వీడియో క్యాప్షన్, ఇంట్లో కుట్టుపని చేసుకునే సురభి.. టెక్స్‌టైల్ పరిశ్రమ యజమాని ఎలా అయ్యారంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)