Parenting: ‘ఎప్పటికీ తండ్రిని కాకూడదు అనుకుని, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఓ భర్త కథ’

నటాషా బధ్వార్

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

    • రచయిత, నటాషా బధ్వార్
    • హోదా, బీబీసీ కోసం

కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఇప్పటికీ ఆ రోజు నా మనసులో ఒక సినిమా దృశ్యంలా గుర్తుండిపోయింది. కానీ, ఈ దృశ్యంలో ముఖ్యమైన పాత్రధారులు నేను, నా భర్త, పిల్లలు మాత్రమే.

అదొక వేసవి సాయంత్రం. రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంటి పక్కనే ఉన్న పార్కుకి వాకింగ్ కోసం వెళ్లాం. మా ముగ్గురు పిల్లలు మా కంటే ముందు నడిచి వెళ్లిపోయారు. మా ముందే గెంతుతూ, ఆడుకుంటూ వాళ్ళ లోకంలో మునిగిపోయారు.

ఇదంతా ఎలా మొదలయిందో, నాకు గుర్తు రావడం లేదు.

"ఈ మధ్య నేను తల్లి పాత్రను ఎక్కువ పోషిస్తుంటే, నువ్వు తండ్రి పాత్రలో ఎక్కువగా ఉంటున్నావు" అని నా భర్త అఫ్జల్ అన్నారు.

"అది మంచి విషయమే కదా" అని అన్నాను.

"ఇది మంచి విషయమో కాదో కచ్చితంగా చెప్పలేను" అని ఆయన అన్నారు.

"ఒకే పనిని తరచుగా చేయడం వల్ల విఫలమయ్యే అవకాశం ఉంది. రైతులు కూడా భూమి సారాన్ని నిలిపి ఉంచేందుకు పంటలు మారుస్తూ ఉంటారు. మనం ఇతరుల పాత్రను కూడా పోషిస్తూ ఉండాలి" అని అన్నాను.

బరువు బాధ్యతలు మోసేవారిలో కోపం, ద్వేషం పెరిగిపోతూ ఉంటాయి.

"నేను మాట్లాడటం పూర్తవ్వగానే, "మన అమ్మా, నాన్నల మాదిరిగా" అని నా భర్త అఫ్జల్ అన్నారు.

మేమలా మాట్లాడుకుంటూ ఉండగా, మా చిన్న కూతురు నసీం మా దగ్గరకు పరుగు పెట్టుకుంటూ వచ్చింది.

అఫ్జల్

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

తన పాదాలకు మట్టి అంటుకుంది. కాళ్లకు వేసుకున్న చెప్పులను మట్టిలోనే వదిలేసి వచ్చింది. పెద్ద పిల్లలిద్దరూ ఇదంతా చూస్తూ నవ్వుతున్నారు. కానీ, నసీం మాత్రం మట్టిని చూసి భయపడుతోంది.

మా కబుర్లను ఆపి నసీం పై దృష్టి సారించాం.

అఫ్జల్ నసీంను తన చేతుల్లోకి తీసుకుని ఇంటి వైపు నడిచారు. నేను నసీం చెప్పులను తీసుకుని పెద్ద పిల్లల వెంట వెళ్లాను.

నాకు అఫ్జల్‌తో పరిచయం అయిన కొత్తలో ఆయనకు ఒక తండ్రి అవ్వాలని ఉండేది కాదు. ఈ విషయంలో ఆయన ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవి. కానీ, ఆయన ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలకు తండ్రి. ఆయన ముగ్గురు కూతుళ్లు ఆయనను ఏడిపిస్తూ ఉంటారు. ఆయన కూడా వాళ్లతో పిల్లల్లా మారిపోతారు.

వీడియో క్యాప్షన్, గవర్నమెంట్ బడి పిల్లలు, అమెరికన్ ఇంగ్లీష్ గడగడా మాట్లాడేస్తారు
నటాషా బధ్వార్ పిల్లలు

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

నసీం ఆయన భుజాల పైకి ఎక్కి ఆడుకుంటుంది. "నువ్వు కోతివా" అని ఆయన నసీం ను అడుగుతూ ఉంటారు.

నసీం కూడా తిరిగి సమాధానం చెబుతుంది. "నాతో ఆడుకో’’ అని అంటూ ‘‘నువ్వు మొదట మా నాన్నవి" అని అంటుంది.

నా పెద్ద కూతురు సహర్ కు 8 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తండ్రిని కసిరేది. కొన్ని సార్లు చాలా పెద్ద పెద్ద విషయాలు మాకు చెబుతూ అనేది. కొన్ని సార్లు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, మధ్యలో దూరి నా మనసులో మాటను అర్ధం చేసుకుని నా ఉద్దేశ్యాన్ని వాళ్ళ నాన్నకు వివరించేది.

నటాషా బధ్వార్

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

"నన్ను మాట్లాడనివ్వు. నేను నటాషాకి అర్ధమయ్యేలా కొన్ని విషయాలు చెబుతున్నాను" అని అఫ్జల్ అన్నప్పుడు నటాషా వాళ్ళ నాన్న నోటి పై చేయి అడ్డంగా పెట్టి మాట్లాడనివ్వదు.

"నేను ఎక్కువ మాట్లాడుతున్నానా" అని ఆయన నెమ్మదిగా అడుగుతారు.

"చూడు, నాన్న ఎలా మాట్లాడుతున్నారో" అని నటాషా అంటుంది. అలాంటప్పుడు మిగిలిన ఇద్దరూ వాళ్ళ నాన్నను అనుకరిస్తూ మాట్లాడతారు.

అలీజా మా రెండవ కూతురు. తన చిన్నప్పుడు అలీజాను వాళ్ళ నాన్నను కవల పిల్లలని పిలిచేవాళ్ళం. "మేము కవల పిల్లల్లా ఉన్నామా లేదా? చెప్పు" అని అడుగుతూ ఉండేవారు.

అలాంటి క్షణాలను నేను కెమెరాలో బంధిస్తూ ఉండేదానిని. నిజానికి వాళ్ళ నాన్నకి, తనకి ఎటువంటి పోలికలు ఉండేవి కావు. కానీ, ఆయన తండ్రి ప్రేమను అలా వ్యక్తం చేసేవారు.

నాకెప్పుడూ తల్లిని కావాలని ఉండేది. ఈ విషయంలో నాకెటువంటి సందేహాలు లేవు. అఫ్జల్ కు ఎప్పుడూ తండ్రి అవ్వాలని ఉండేది కాదు. నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేనివన్నీ ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది.

పెద్దవాళ్ళు, పిల్లలు ఆరోగ్యకరంగా పెరిగేందుకు అనువైన వాతావరణాన్ని ఇంట్లో సృష్టించాలి.

అఫ్జల్ చిన్నతనంలో పరిస్థితులను చక్కబెట్టుకోలేననే అభిప్రాయంతో ఉండి ఉంటారు. గతంలోకి వెళ్ళిపోయిన అసాధ్యమైన అంచనాలను వెలికి తీసి చూసుకోవడమెందుకు?

నటాషా బధ్వార్ పిల్లలు

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

రెండు విభిన్న దృక్పథాలతో ఉన్న ఇద్దరు మనుషులు ఒకే విధమైన అనుభవాలతో స్ఫూర్తి పొందవచ్చని తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. విరుద్ధమైన భావాలు ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా భవిష్యత్తులో ఒకే విధమైన ఆశయాలు ఉండొచ్చు.

నేను చెబుతున్న మాటలు అయోమయంగా ఉండొచ్చు. మనసులో ఉన్న విషయాన్ని వాస్తవంగా చూసేందుకు ముందుకు కదలాల్సిన అవసరముంది.

అఫ్జల్ కు ఈ వ్యాసం చూపించి "తండ్రి కావాలని అనుకోని వ్యక్తి గురించి చెప్పాను కదా" అని అన్నాను.

ఈ వ్యాసం చదివి "గతం గురించి మాట్లాడొద్దు. ఇప్పటికీ నాకు తండ్రి అవ్వాలంటే భయమే" అని అన్నారు.

"నువ్వు చాలా సామర్ధ్యం ఉన్న తండ్రివి. కాదా?" అని నవ్వుతూ అడిగాను.

"నేను నిజాయితీపరుడిని. తండ్రిగా బాధ్యతలను నిర్వర్తించడం చాలా కష్టమైన పని" అని అన్నారు.

నటాషా బధ్వార్ పిల్లలు

ఫొటో సోర్స్, NATASHA BADHWAR

"నువ్వొక సంపూర్ణ వ్యక్తిగా ఉండాలని అనుకుంటావు. చాలా సాహసాలు చేయాలని అనుకుంటావు. రాక్షసులను వేటాడాలని అనుకుంటావు. రక్షణ చర్యల కోసం పారా గ్లైడ్ చేయాలని అనుకుంటావు. కొండ శిఖరాల అంచుల నుంచి గెంతాలని అనుకుంటావు. ఇక మిగిలిన జీవితంలో సులభంగా ఉండే ఏ పనిని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నావు?" అని ప్రశ్నించాను.

"పాము, కోతి కథ కోసం ఏమైనా ఆలోచన చెప్పగలవా? నసీం నన్ను కథ చెప్పమని అడిగింది. ఇప్పుడు నా ముందున్న పెద్ద సవాలు తనకు కథ చెప్పడమే" అని అన్నారు.

"నీకు కథ ఎందుకు? ఒక్కసారి నువ్వు కథ చెప్పడం మొదలుపెడితే కథ దానంతటదే ముందుకు సాగిపోతుంది" అని అన్నాను.

"ఓహ్! జీవిత కథలు చెప్పమంటావా" అని అన్నారు.

"ఇది అసలైన సామర్ధ్యంతో కూడిన పని" అని అన్నాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)