ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటన్స్... ఫైనల్లో రాజస్థాన్‌పై ఘన విజయం

ఫొటో సోర్స్, BCCI/IPL
కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రతిభతో గుజరాత్ టైటన్స్ జట్టు తుదిపోరులో రాజస్థాన్ మీద 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 'ఐపీఎల్ 2022' చాంపియన్‌గా అవతరించింది. కొత్తగా ఏర్పడిన ఈ జట్టు తాను పాల్గొన్న తొలి ఐపీఎల్ టోర్నమెంట్‌లోనే ట్రోఫీని సొంతం చేసుకుంది.
హార్దిక్ పాండ్యా తన నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకుని రాజస్థాన్ స్కోరును 130కి పరిమితం చేయగలిగాడు.
ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చి 34 పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో గుజరాత్ టైటన్స్ మొదటిసారిగా ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది, విజయ లక్ష్యం స్వల్పంగానే ఉన్నప్పటికీ, గుజరాత్ బ్యాట్స్‌మన్ కూడా మొదట కొంత తడబడ్డారు. ట్రెంట్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి శుభ్‌మాన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ను స్క్వేర్ లెగ్ వద్ద నిలబడిన యుజ్వేంద్ర చాహల్ వదిలేశాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లో ప్రసిద్ధ కృష్ణ వేసిన రెండో బంతికి ఫోర్ కొట్టిన వృద్ధిమాన్ సాహా నాలుగో బంతికి బౌల్డ్ అయ్యాడు. కృష్ణ వేసిన బంతి నేరుగా మిడిల్ స్టంప్‌ను పడగొట్టింది. దాంతో, ఏడు బంతుల్లో ఐదు పరుగులు చేసిన సాహా పెవిలియన్ బాట పట్టాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
ఆ తరువాత మాథ్యూ వేడ్ బ్యాటింగుకు వచ్చాడు. ట్రెంట్ బోల్ట్ వేసిన మూడో ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. ఆ తరువాత మ్యాచ్ ఐదో ఓవర్లో మూడో బంతికి మాథ్యూ వేడ్‌ను ట్రెంట్ పెవిలియన్‌కు పంపించాడు. రెండు వికెట్లు పతనమైన తర్వాత క్రీజు వద్దకు వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా కుదురుగా నిలబడడంతో మ్యాచ్‌పై గుజరాత్ పట్టు సాధించింది. ఎనిమిదో ఓవర్లో రాజస్థాన్‌కు శుభ్‌మన్ గిల్ వికెట్ దక్కే అవకాశం లభించింది. కానీ, ఆ కఠినమైన క్యాచ్‌ను హెట్‌మయర్ పట్టలేకపోయాడు.

ఫొటో సోర్స్, BCCI/IPL
పాండ్యా, గిల్‌లు 9వ ఓవర్లో 10 పరుగులు సాధించారు. అక్కడి నుంచి వారిద్దరూ స్థిరంగా పరుగులు తీస్తూ వచ్చారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 53 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
30 బంతుల్లో 34 పరుగులు చేసిన పాండ్యా యజువేంద్ర చహల్ బౌలింగులో ఔటయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన డేవిడ్ మిల్లర్, గిల్‌తో కలిసి చివరి వరకూ ఆడి జట్టును చాంపియన్‌షిప్ దిశగా నడిపించాడు.
డేవిడ్ మిల్లర్ 19 బంతుల్లో 32 పరుగులు చేయగా, శుభమాన్ గిల్ 43 బంతుల్లో 45 పరుగులు చేశారు. దాంతో, గుజరాత్ టైటన్స్ ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ మీద విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

ఫొటో సోర్స్, BCCI/IPL
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ
గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన కెప్టెన్సీతో ప్రత్యర్థి జట్టును 130 పరుగులకు పరిమితం చేయగలిగాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టులో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్‌లు మొదట్లోనే మహమ్మద్ షమీ, యశ్ దయాళ్‌లో బౌలింగును ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు.
పరుగుల వేగం పెంచడానికి ప్రయత్నించిన జైస్వాల్ 16 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తరువాత బ్యాటింగుకు వచ్చిన కెప్టెన్ సంజూ శ్యామ్సన్ 11 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్‌ను గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీశాడు. బౌలర్లను వ్యూహాత్మకంగా మారుస్తూ వచ్చిన పాండ్యా ప్రత్యర్థి జట్టుకు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగలిగాడు.
దేవదత్ పడికల్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు పాండ్యా బంతిని రషీద్ ఖాన్ చేతికిచ్చారు. రషీద్ బౌలింగులోనే దేవదత్ ఔటయ్యాడు. ఆ తరువాత బ్యాటింగుకు వచ్చిన రాజస్థాన్ ఆటగాళ్ళెవరూ ఎక్కువసేపు ఆడలేకపోయారు.
12వ ఓవర్లో 79 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్ జట్టు, ఆ తరువాత మిగిలిన 8 ఓవర్లలో కేవలం 51 పరుగులే చేయగలిగింది. మొత్తంగా 20 ఓవర్లలో ఈ జట్టు 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.
గుజరాత్ టైటన్స్ జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీని సాధించి పెట్టిన కెప్టెన్ హార్డిక్ పాండ్యా ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. జట్టు కలిసికట్టుగా పోరాడితే విజయం తథ్యం అనడానికి ఈ మ్యాచే ఒక ఉదాహరణ అని పాండ్యా వ్యాఖ్యానించారు.
జాస్ బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారం లభించింది.
ఇవి కూడా చదవండి:
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- 33 మంది ఖైదీల కళ్లలో యాసిడ్ పోసిన పోలీసులు, 40 ఏళ్ల కిందటి ఘటన బాధితులు ఇప్పుడెలా ఉన్నారు
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
- భారత్-నేపాల్ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది
- దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










