టీవీ9 vs విశ్వక్‌సేన్: సహనం కోల్పోయింది ఎవరు

ఫొటో సోర్స్, TV9Telugu/YouTube
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
విశ్వక్‌సేన్, టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి... ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేర్లు. టీవీ9 స్టూడియోలో వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పటికే చాలా మంది చూసేసి ఉంటారు. ఆ మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది.
ఇప్పుడు టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి తీరుపైన, విశ్వక్‌సేన్ వాడిన 'F**k' పదం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఒక మహిళను అలా అనడం ఏంటని కొందరు విశ్వక్ సేన్‌ను తప్పు పడుతుంటే స్టూడియోలో అతిథిగా ఉన్న వ్యక్తిని 'గెట్ అవుట్' అనడమూ సరికాదని మరికొందరు అంటున్నారు.
ఈ వివాదం నేపథ్యంలో టీవీ చానళ్ల డిబేట్లు, అందులో యాంకర్ల తీరు విషయంలో పాత సంగతులన్నీ చర్చలోకొస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టీవీ స్టూడియోలో గెస్ట్‌గా కూర్చొని ఉన్న వ్యక్తిని, యాంకర్ బయటకు వెళ్లిపోమనడం సరైనదేనా? మీడియా వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? యాంకర్ సహనం కోల్పోయినప్పటికీ గెస్ట్ కూడా అలా F**k పదం వాడాలా? ఇవి టీవీ9 దేవీ నాగవల్లి, విష్వక్‌సేన్‌ల వివాదం కేంద్రంగా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు.

ఫొటో సోర్స్, facebook/devinagavalli/VishwakSen
యాంకర్ సహనం కోల్పోయి 'గెట్ అవుట్' అనడం కరెక్టేనా?
ఈ వివాదం జర్నలిజం ప్రమాణాలు, విలువలను కూడా చర్చలోకి తీసుకొచ్చింది.
'గెట్ అవుట్ ఫ్రం మై స్టూడియో' అంటూ విశ్వక్‌సేన్ మీద టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి అరవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ తీరును కొందరు తప్పు పడుతున్నారు. ఇది జర్నలిజం విలువలకు విరుద్ధమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీడియా వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా? ప్రజల వ్యక్తిగత జీవితాలను నలుగురిలో ఎలా పెడతారంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇలాంటివి చూసినప్పుడు టీఆర్‌పీ రేటింగ్స్ కోసమే ఇదంతా చేస్తున్నారని ప్రజలు అనుకునే ప్రమాదం ఉందని సీనియర్ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు అన్నారు.
'ఇది జరగకూడని ఘటన. యాంకర్ కాస్త తెలివిగా వ్యవహరించి ఉండాల్సింది. పరిస్థితి చేయి దాటుతోందని అనుకున్నప్పుడు చిన్న బ్రేక్ ఇచ్చి ఆ యాక్టర్‌తో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేయడమో లేక ఆయన్ను బయటకు పంపించడమో చేసి ఉంటే బాగుండేది. అలా యాంకర్ అసహనానికి లోను కాకూడదు. ఇలాంటి ఘటనలు జరుగుతూ పోతే మీడియా మీద ప్రేక్షకులు మరింత నమ్మకం కోల్పోతారు. ఒకరి బాధ్యతను గుర్తు చేసే మీడియా ఇలా వ్యవహరించడం సరికాదు. విశ్వక్‌సేన్ అన్నది కూడా తప్పే. అతను లైవ్‌లోనే క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది.' అని బీబీసీతో మాట్లాడుతూ శ్రీనివాసరావు అన్నారు.

ఫొటో సోర్స్, Instagram/Vishwaksens
విశ్వక్‌సేన్ 'F**k' పదాన్ని వాడొచ్చా?
టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి సహనం కోల్పోయి మాట్లాడినప్పటికీ విశ్వక్ సేన్ 'F**k' పదాన్ని వాడి ఉండకూడదని కొందరు అంటున్నారు. 'ఎంత కోపం వచ్చినప్పటికీ అలాంటి పదాలను మహిళల మీద వాడకూడదు. అలాంటి వాటిని సహించకూడదు. విశ్వక్‌సేన్ అంత నీచంగా మాట్లాడి ఉండకూడదు.' అంటూ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ట్వీట్ చేశారు.
అలా బూతు భాష వాడటం వల్ల విశ్వక్‌సేన్‌కు ఆడపిల్లల పట్ల చులకన భావం కనిపిస్తోందని విమెన్ యాక్టివిస్ట్ సంధ్య అన్నారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ స్త్రీల గౌరవాన్ని కించపరచకూడదని, అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Twitter/Vijalaxmi Gadwal, GHMC Mayor
ఒక వ్యక్తి మానసిక స్థితి మీద పబ్లిక్‌గా విమర్శించడం సరైనదేనా?
'మీకో విషయం తెలుసో లేదో విశ్వక్‌సేన్‌ను అందరూ పాగల్ సేన్ అంటారంట.' అంటూ టీవీ షోలో దేవి నాగవల్లి అన్నారు.
ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం గురించి లక్షల మంది చూస్తున్న టీవీ షోలో ఎలా మాట్లాడతారు అంటూ హేతువాది బాబు గోగినేని ప్రశ్నించారు.
'విశ్వక్‌సేన్ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అనుమతి లేకుండా ప్రేక్షకులకు దేవి వెల్లడించడం సరికాదు. అది నిజం కావొచ్చు. అబద్ధమైనా కావొచ్చు. ఆయన్ని దేవి మళ్లీ మళ్లీ పాగల్ సేన్ అంటూ పిలిచారు. ఇది ఇండియన్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ కింద నేరం.' అని బాబు గోగినేని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో రాశారు.
మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారి హక్కుల గురించి ఇండియన్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్-2017లోని చాప్టర్-5 చెబుతోంది. ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కును సెక్షన్-20 కల్పిస్తోంది. మానసిక రోగులను భౌతికంగా, నోటి మాటల ద్వారా, లైంగికంగా, ఎమోషనల్‌గా వేధింపులకు గురి చేయకూడదని కూడా చెబుతోంది. ఇదే చట్టంలోని సెక్షన్-23 ప్రకారం వ్యక్తుల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అనుమతిలేనిదే బయటకు వెళ్లడించకూడదు.
ఈ వివాదం తరువాత అభ్యంతకరమైన భాష వాడినందుకు విశ్వక్‌సేన్ క్షమాపణలు చెప్పారు. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.
టీవీ9 యాంకర్ దేవి నాగవల్లిని బీబీసీ సంప్రదించగా ఈ విషయం మీద స్పందించడానికి తాను ఇప్పుడు సిద్ధంగా లేనని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో 'మినీ పాకిస్తాన్' ఏంటి... ఈ మాట ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది?
- సర్కారు వారి పాట: ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ - మహేశ్ బాబు నోట వైఎస్ జగన్ డైలాగ్పై సోషల్ మీడియాలో చర్చ
- ఇరాక్ దుమ్ము తుపాను: బాగ్దాద్‌లో ఆకాశం ఆరెంజ్ కలర్లోకి మారిపోయింది.. ఎందుకంటే..
- ఎలాన్ మస్క్: ట్విటర్ కొత్త యజమానిని ఇబ్బందుల పాలు చేసిన ఆరు సొంత ట్వీట్లు
- హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












