అనకాపల్లి: తుపాకీతో బెదిరించి బ్యాంకులో రూ. 3.31 లక్షలు దోచుకున్నాడు

వీడియో క్యాప్షన్, అనకాపల్లి: తుపాకీతో బెదిరించి బ్యాంకులో రూ.3.31 లక్షలు దోచుకున్నాడు

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఓ బ్యాంకు దోపిడీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఏప్రిల్ 30 మధ్యాహ్నం కశింకోట మండలం నర్సింగిబిల్లి గ్రామంలోని ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బందిని తుపాకీతో బెదిరించి ఒక వ్యక్తి రూ.3.31 లక్షలు దోచుకున్నాడు.

హెల్మెట్ ధరించిన వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించడం, క్యాషియర్ వి. ప్రతాప్ రెడ్డిని బెదిరించి డబ్బులు దోచుకెళ్లడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

దోపిడీ జరిగిన టైంలో బ్యాంకులో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. దోపిడీ చేసిన వ్యక్తి ‘సేఫ్ ఖోలో, చాబీ కిదర్’ అంటూ హిందీలో మాట్లాడినట్లు సిబ్బంది తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)