ఇరాక్ దుమ్ము తుపాను: బాగ్దాద్‌లో ఆకాశం కాషాయ రంగులోకి మారిపోయింది.. ఎందుకంటే..

గత నెలలో కూడా ఇరాక్‌లో ఇలాంటి దుమ్ము తుపానుల వల్ల పలు విమాన ప్రయాణాలు రద్దయ్యాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత నెలలో కూడా ఇరాక్‌లో ఇలాంటి దుమ్ము తుపానుల వల్ల పలు విమాన ప్రయాణాలు రద్దయ్యాయి

ఇరాక్ దేశాన్ని నారింజ రంగు దుమ్ము మేఘాలు కమ్మేశాయి. దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం కాషాయ రంగులోకి మారిపోయింది.

ఈ దుమ్ము తుపాను కారణంగా బాగ్దాద్, నజాఫ్ విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు ప్రకటించారు.

మధ్య ప్రాచ్య దేశాల్లో ఇలాంటి దుమ్ము తుపానులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల, భూమి-నీరు అధికంగా వినియోగించడం వల్ల ఇలాంటి తుపానులు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, ‘50 డిగ్రీల ఎండలో నేను ట్రాఫిక్ మళ్లిస్తుంటా’

శనివారం ఇరాక్‌లోని పలు ప్రాంతాల్లో 500 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది.

గత నెలలో వరుసగా దుమ్ము తుపానులు ఇరాక్‌ను చుట్టుముట్టాయి. డజన్లకొద్దీ పౌరులు శ్వాస ఇబ్బందులతో ఆస్పత్రుల పాలయ్యారు.

దేశంలో కరువు, భూముల ఎడారీకరణ, వర్షపాతం తగ్గిపోవడం వల్ల మరిన్ని దుమ్ము తుపానులు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు. నగరాల్లోను, చుట్టుపక్కలా పచ్చగా ఉండే ప్రాంతాలు తగ్గిపోవడం వల్ల కూడా ఇలాంటి దుమ్ము తుపానులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

2026 నాటికి ఏటా 300 దుమ్ము తుపానులను ఇరాక్ ఎదుర్కోవాల్సి రావొచ్చునని 2016లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) అంచనా వేసింది.

బాగ్దాద్ నగరంలో వాహనాల రద్దీని నియంత్రిస్తున్న ఇరాకీ పోలీసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాగ్దాద్ నగరంలో వాహనాల రద్దీని నియంత్రిస్తున్న ఇరాకీ పోలీసు
గత కొద్ది సంవత్సరాలుగా ఇరాక్‌లో వర్షపాతం తగ్గిపోయింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత కొద్ది సంవత్సరాలుగా ఇరాక్‌లో వర్షపాతం తగ్గిపోయింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి
2050 నాటికి ఇరాక్‌ నీటి వనరులు 20 శాతం తగ్గిపోతాయని, దేశం ఇబ్బంది పడుతుందని గత నవంబర్‌ నెలలో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2050 నాటికి ఇరాక్‌ నీటి వనరులు 20 శాతం తగ్గిపోతాయని, దేశం ఇబ్బంది పడుతుందని గత నవంబర్‌ నెలలో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది
దుమ్ము తుపానుల వల్ల శ్వాస, హృదయ సంబంధిత రోగాలు రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దుమ్ము తుపానుల వల్ల శ్వాస, హృదయ సంబంధిత రోగాలు రావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది
నజాఫ్ నగర ఏరియల్ వ్యూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నజాఫ్ నగర ఏరియల్ వ్యూ
వీడియో క్యాప్షన్, సహారా ఎడారిలో 50 డిగ్రీల మండుటెండలో జీవితం ఎలా ఉంటుందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)