కర్ణాటక హైకోర్టు: హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదు

ఫొటో సోర్స్, UMESH MARPALLY
హిజాబ్ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది.
హిజాబ్ ధరించడం అనేది మతపరంగా తప్పనిసరి కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
అలాగే యూనిఫాం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు విద్యాసంస్థలకు ఉంటుందని తెలిపిన కోర్టు.. హిజాబ్ ధరించే తమ హక్కును కాపాడాలంటూ కోర్టుకు వెళ్లిన అమ్మాయిల పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ కేసులో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రితు రాజ్‌తో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. విద్యాసంస్థలలో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థించింది.
హైకోర్టు తుది తీర్పు నేపథ్యంలో కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇంతకుముందు ఏం జరిగింది
స్కూళ్లు, కాలేజీలలో హిజాబ్ ధరించడంపై కొద్దిరోజులుగా కర్ణాటకలో వివాదం కొనసాగింది. గత నెలలో అక్కడ ఈ వివాదంపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
హిజాబ్ ధరించడం రాజ్యంగం తమకు కల్పించిన హక్కు అంటూ ఉడుపిలోని ఓ ప్రభుత్వ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు దీనిపై ఫిబ్రవరి 10న విచారణ ప్రారంభించింది.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరిస్తామని పట్టుపట్టొద్దని కోర్టు అప్పట్లో సూచించింది.
వాదనలన్నీ విన్న తరువాత ఫిబ్రవరి 25న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

ఫొటో సోర్స్, ANI
గతంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
అంతకంటే ముందు ఈ కేసు విచారించిన కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ అంశాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు రిఫర్ చేసింది.
విద్యార్ధినుల తరఫున ప్రముఖ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదించారు.
వివాదం పెద్దదై విద్యాసంస్థలలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.
ఈ వివాదానికి సంబంధించిన కేసును కర్ణాటక హైకోర్టు ఓ వైపు విచారిస్తుండగానే మరోవైపు పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తొలుత కోస్తా జిల్లాలలో చెలరేగిన హింస అక్కడి నుంచి ఉత్తర కర్ణాటకకూ పాకింది.

ఫొటో సోర్స్, UMESH MARPALLY
బాగల్‌కోట్ జిల్లాలోని శివమొగ్గ, బన్నహట్టిల్లో ఒక ప్రైవేటు కాలేజీలో రాళ్ల దాడుల ఘటనలు జరిగాయి.
ఉడుపిలోని ఒక ప్రైవేటు కాలేజీలో హిజాబ్ ధరించిన ఒక వర్గం విద్యార్థులకు, కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం, నినాదాలు జరగటంతో.. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడే వరకూ ఆ కాలేజీని మూసివేశారు.
అనంతరం కోర్టు ఆదేశాల మేరకు విద్యాసంస్థలు తెరిచారు.
ఇవి కూడా చదవండి:
- రోజువారి కూలీ యూట్యూబ్ స్టార్.. 8 లక్షల సబ్స్క్రైబర్లు, 10 కోట్లకు పైగా వ్యూస్.. ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
- ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్‌ను కాల్చి చంపడానికి ముందు, తర్వాత బ్రిటన్‌లో ఏం జరిగింది?
- ఒక్క రోజే 81 మందికి మరణ శిక్ష అమలు.. ఏడాది పొడవునా అమలు చేసిన వాటికంటే ఇదే ఎక్కువ
- విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ చాంబర్ వైసీపీ కార్యాలయంగా మారిందనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?
- రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు... 99 రూపాయల హంగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












