లతా మంగేష్కర్: షారుఖ్ ఖాన్ ప్రార్థనపై వివాదం, అసలేం జరిగిందంటే..

షారూఖ్ ఖాన్

ఫొటో సోర్స్, Twitter

ముంబయి శివాజీ పార్క్‌లో లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటూ రాజకీయ, సినీ ప్రముఖులు పలువురు ఆమె భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.

వారిలో బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రార్థనల గురించి ట్విటర్లో వివాదం రేగింది.

బీజేపీ హరియాణా ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అరుణ్ యాదవ్ షారూఖ్ గురించి చేసిన ఒక ట్వీట్ ఆ వివాదానికి ఆజ్యం పోసింది.

శ్రద్ధాంజలి ఘటిస్తున్న షారూఖ్ ఖాన్ వీడియోను షేర్ చేసిన ఆయన, 'ఈయన ఉమ్ముతున్నారా? అని కామెంట్ పెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

షారూఖ్ తన సెక్రటరీ పూజా దద్లానీతో కలిసి అంత్యక్రియల దగ్గరకు చేరుకున్నారు. షారూఖ్ చేతులు కలిపి లతాజీ కోసం ప్రార్థిస్తున్నప్పుడు, అక్కడ పూజా దద్లానీ చేతులు జోడించి ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రార్థనల తర్వాత షారూఖ్ మాస్క్ తీసి గాలి ఊదారు.

ఆయన అలా ఊదడాన్ని ఉమ్ముతున్నట్టుగా చెబుతూ షారూఖ్‌ను కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే మరో వర్గం మాత్రం ఆయన, పూజా దద్లానీ కలిసి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ 'ఇదే అసలైన భారతదేశం' అంటూ ప్రశంసిస్తున్నారు.

షారుఖ్

ఫొటో సోర్స్, Ani

చాలా మంది ప్రముఖులు కూడా ఈ వివాదంపై స్పందించారు. షారూఖ్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"కొంతమంది ప్రార్థనలకు, దయకు అర్హులు కారు, వారి మనసులోని విషాన్ని అంతం చేయాలంటే వాళ్లకు మందు మాత్రమే అవసరం" అని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మరోవైపు "ఈ అసహ్యకరమైన ట్వీట్ బీజేపీకి చెందిన ఒక ఆఫీస్ బేరర్ చేశారు. సమాజంలో ఎలాంటివారు మురికిని, విషాన్ని చిమ్ముతున్నారో చెప్పడానికి ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు. అరుణ్ యాదవ్‌కు దువా గురించి తెలియకపోతే, అలా అనే ముందు ఆయన ఎప్పుడూ ఎవరినైనా అడుగుండచ్చు" అని ద వైర్ వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ సిద్దార్థ్ వరదరాజన్ ట్వీట్ చేశారు.

"భారతదేశ ఐక్యతకు సంబంధించిన ఈ అందమైన దృశ్యాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. లతా మంగేష్కర్ సజీవంగా ఉన్నప్పుడు ఐక్యత అనే దారంతో ప్రజలను ఏకం చేశారు. చనిపోయిన తర్వాత కూడా అది కొనసాగిస్తున్నారు. షారూఖ్ ఖాన్ కూడా అందులో ఒకరు" అని జఫర్ సరేష్‌వాలా ట్వీట్ చేశారు.

దర్శకుడు అశోక్ పండిత్ కూడా షారూఖ్‌ను విమర్శిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

రాషా సఫ్వీ "ఈశ్వర్ అల్లా తేరో నామ్, సబ్‌కో సన్మతి దే భగవాన్" అని రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే కూడా షారూఖ్‌కు అనుకూలంగా ట్వీట్ చేసి ఆయనపై ప్రశ్నలు సంధించినవారికి జవాబిచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

"ప్రార్థన తర్వాత ఊదడాన్ని ఉమ్మడం అనుకునేవారి ఆలోచన ఉమ్మేయదగినదే. వీరు విషం, విద్వేషాలను చిమ్మాలని చూస్తారు" అని రేడియో జాకీ సాయ్మా ట్వీట్ చేశారు.

అసలు ఊదడం ఎందుకు

ముస్లింలలో ఇది సాధారణ ఆచారం. ఎవరైనా చనిపోయినపుడు లేదా ఏదైనా సందర్భాల్లో దువా చదివి గాలి ఊదుతారు.

దువా చదివేవారు, ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్ షరీఫ్ పంక్తులను చదువుతారు.

ఎవరైనా చనిపోయినపుడు చదివే దువాలో మృతుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తారు.

అంతే కాకుండా ఒకరి దీర్ఘాయుష్షు, విజయం కోసం, ఇంకా చాలా వాటి కోసం కూడా ముస్లింలు దువా చదువుతారు.

దువా చదివిన తర్వాత అది చేసిన వారు, తాము ఎవరికోసం దువా చదివారో, వారు తమకు దగ్గరగా ఉంటే వారి ముందుకు వెళ్లి గాలి ఊదుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)