కాన్పూర్: కరెన్సీ నోట్ల గుట్టలు దాచిన వ్యాపారి పీయూష్ జైన్ అరెస్ట్

ఫొటో సోర్స్, Ani
కాన్పూర్ పెర్‌ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ పన్ను ఎగవేత ఆరోపణలపై అరెస్ట్ చేశారు.
ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఇటీవల కేంద్ర ఏజెన్సీలు జరిపిన తనిఖీల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి.
తదుపరి విచారణ కోసం ఆయన్ను అహ్మదాబాద్ తీసుకెళ్లవచ్చని జీఎస్టీ విభాగం కాన్పూర్ పరిధి అసిస్టెంట్ కమిషనర్ సురేంద్ర కుమార్ పీటీఐకి చెప్పారు.
పీయూష్ జైన్ కార్యాలయాలపై వరుసగా కొనసాగిన దాడుల్లో రూ. 275 కోట్ల విలువైన కరెన్సీ, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో అధికారి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇది జీఎస్టీ ఆదా చేయడం కోసం నకిలీ బిల్లులు పెట్టిన ఒక ట్రాన్స్‌పోర్టర్‌కు సంబంధించిన నగదుగా అధికారులు చెబుతున్నారు.
ఈ దాడుల్లో రూ.187 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం ఏఎన్ఐ చెప్పింది.
దాడుల తర్వాత అహ్మదాబాద్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేసినట్లు ఏఎన్ఐ తెలిపింది.
పీయూష్ జైన్ ఎవరు?
పీయూష్ జైన్ కన్నోజ్‌కు చెందినవారు. ఆయనకు కన్నోజ్‌లో ఒక ఇల్లు, పెర్‌ఫ్యూమ్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజ్, పెట్రోల్ పంప్ ఉన్నాయి.
దీనితోపాటూ ముంబయిలో కూడా ఆయనకు ఒక ఇల్లు, ఒక షోరూం కూడా ఉన్నాయి. ఆయన కంపెనీలు ముంబయిలో రిజిస్టర్ అయి ఉన్నాయి.
అధికారుల వివరాల ప్రకారం పీయూష్ జైన్ దాదాపు 40 కంపెనీలకు యజమాని. వాటిలో రెండు మధ్యప్రాచ్యంలో కూడా ఉన్నాయి. అయితే ఆయన ప్రధానంగా పెర్‌ఫ్యూమ్ వ్యాపారిగా పేరు సంపాదించారు.
ఇవి కూడా చదవండి:
- జేమ్స్ వెబ్: అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయిన అతి పెద్ద టెలిస్కోప్
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








