Khel Ratna Award: నీరజ్ చోప్రా, మిథాలి రాజ్, సునీల్ ఛత్రి సహా 11 మంది పేర్లు సిఫారసు, అర్జున అవార్డుకు 35 పేర్లు - Newsreel

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

నీరజ్ చోప్రా, మిథాలి రాజ్ సహా 11 మంది పేర్లను ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డుల కోసం జాతీయ క్రీడా పురస్కారాల కమిటీ సిఫారసు చేసింది.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన నీరజ్ చోప్రా సహా 11 మంది పేర్లను కమిటీ ఈ అవార్డుల కోసం సిఫారసు చేసినట్లు వార్తా ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది.

రెజ్లర్ రవి దహియా, బాక్సర్ లవ్లీనా, ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి, మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, హాకీ ఆటగాడు పి.శ్రీజేశ్‌ ఈ జాబితాలో ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

షూటర్ అవని లక్రా సహా అయిదుగురు పారా అథ్లెట్ల పేర్లనూ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేశారు.

క్రికెటర్ శిఖర్ ధావన్ సహా 35 మందిని అర్జున అవార్డుకు కమిటీ నామినేట్ చేసిందని పీటీఐ వెల్లడించింది.

కాగా టోక్యో ఒలింపిక్స్ అనంతరం భారత అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్‌ రత్న’ పేరును ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’గా మార్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారానికి నామినేట్ అయింది వీరే

1) నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)

2) రవి దహియా (రెజ్లింగ్)

3) పీఆర్ శ్రీజేశ్ (హాకీ)

4) లవ్లీనా బోర్గోహి (బాక్సింగ్)

5) సునీల్ ఛత్రి (ఫుట్‌బాల్)

6) మిథాలి రాజ్ (క్రికెట్)

7) ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్)

8) సుమిత్ అంటిల్ (జావెలిన్)

9) అవని లేఖరా (షూటింగ్)

10) కృష్ణ నగర్(బ్యాడ్మింటన్)

11) ఎం.నర్వాల్(షూటింగ్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)