Punjab: నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సంఘీభావంగా మహిళా మంత్రి రాజీనామా

సిద్దూ

ఫొటో సోర్స్, EPA

నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే ఉంటానని, పార్టీకి తన సేవలను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని సంభోదిస్తూ రాజీనామా లేఖ రాసిన ఆయన... "రాజీ పడడం వల్ల వ్యక్తి మనస్సాక్షి పతనమవుతుంది. నేను పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ ప్రజల సంక్షేమం అనే అజండా విషయంలో ఎన్నడూ రాజీ పడలేను. అలా రాజీపడలేకే ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అంతకు ముందు పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హరీష్ రావత్ "వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ నాయకత్వంలో పోరాడుతాం" అని అన్నారు.

సిద్ధూ రాజీనామాపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"నేను ముందే చెప్పాను. సిద్ధూకు స్థిరత్వం లేదు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు ఇలాంటి నాయకుడు తగడు" అని ఆయన ట్వీట్ చేశారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ జులై 18న పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. అంతకు ముందు సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.

కెప్టెన్ అమరీందర్ సింగ్ సెప్టెంబర్ 18న తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

సిద్ధూ

ఫొటో సోర్స్, Getty Images

ఆ తర్వాత పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రి ప్రకటనపై చాలా డ్రామా నడిచింది.

కాబోయే సీఎం అంటూ ఒకసారి సునీల్ జాఖడ్ పేరు, మరోసారి సుఖ్‌జిందర్ రంధావా పేరు మీడియాలో వినిపించింది. చివరికి చరణ్‌జీత్ సింగ్ చన్నీని పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

నాకేమీ తెలియదు: సీఎం చరణ్‌జీత్

మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హఠాత్తుగా రాజీనామా చేయడం గురించి తనకు ఏమీ తెలీదని ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ అన్నారు.

చండీగఢ్‌లో ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో మాట్లాడిన ఆయన "నాకు దీని గురించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు. నేను సిద్ధూతో కూర్చుని మాట్లాడుతాను" అన్నారాయన.

ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంది

తాజా పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అమన్ అరోరా మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా కెప్టెన్‌ను కాంగ్రెస్ పార్టీ తొలగించి గత 15 రోజుల్లో కెప్టెన్‌ను రోజులే అయిందని, ఈలోగా సిద్ధూ రాజీనామా చేశారని అన్నారు.

‘‘కెప్టెన్‌ను తొలగించిన తరువాత అప్పుడు ప్రతి రెండు గంటలకూ ముఖ్యమంత్రి అంటూ ఒక కొత్త పేరు బయటికొచ్చింది. అప్పుడే కాంగ్రెస్‌లో పతనం కనిపించింది. ఇప్పుడు జరుగుతున్న దానికి, ఆ పార్టీ పేరు ఇండియన్ నేషనల్ సర్కస్ అని పెట్టాలి’’ అన్నారు అమన్.

రజియా సుల్తానా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రజియా సుల్తానా

సిద్ధూ బాటలో మహిళా మంత్రి

పంజాబ్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గొడవ సద్దుమణిగేలా కనిపించడం లేదు.

సిద్ధూ తర్వాత చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందిన రజియా సుల్తానా తన పదవికి రాజీనామా చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సిద్ధూ రాజీనామా చేసిన కొన్ని గంటలకే మహిళా మంత్రి రజియా సుల్తానా తన పదవికి రాజీనామా చేశారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సంఘీభావం తెలపడానికే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారు.

"నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. సిద్ధూ గారు విలువలు ఉన్న వ్యక్తి. ఆయనకు ఎలాంటి అత్యాశా లేదు. ఆయన పంజాబియత్ కోసం పోరాడుతున్నారు" అని రాజీనామా తర్వాత రజియా సుల్తానా చెప్పారు.

రజియా సుల్తానాను ఈరోజే నీటి సరఫరా, మహిళా-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు.

పంజాబ్‌లో ఈరోజు మంత్రివర్గ విస్తరణ జరిగింది.

మరోవైపు పంజాబ్ కాంగ్రెస్‌లో సిద్ధూ సన్నిహితులు ఆయన ఇంటి దగ్గర గుమిగూడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)