ముంబయి: డోంబివలిలో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, 23 మంది అరెస్ట్-Newsreel

ఫొటో సోర్స్, Getty Images
ముంబయికి సమీపంలోని డోంబివలీలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలతో 29 మందిపై కేసు నమోదైంది. డోంబివలీ ముంబయికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మొత్తం 29 మంది నిందితుల్లో 23 మందిని అరెస్ట్ చేశారు. మిగతా ఆరుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిపై ఐపీసీ 376 కింద కేసు కేసు నమోదు చేశారు.
డోంబివలీలో ఏం జరిగింది?
బాలికపై జనవరి నుంచి సెప్టెంబర్ వరకు గత 8 నెలల పాటు అత్యాచారం జరిగిందని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.
"అత్యాచారం చేసినవారు తెలిసివారు, స్నేహితులేనని బాధితురాలు చెప్పింది. డోంబివలీ, బదలాపూర్, రబాలే, మురబాడ్ లాంటి ప్రాంతాల్లో నాలుగైదుసార్లు తనపై అత్యాచారం జరిగిందని బాలిక ఫిర్యాదులో పేర్కొంది" అని ఠాణె అదనపు పోలీస్ కమిషనర్ దత్తాత్రేయ కరాలే బీబీసీకి చెప్పారు.
మొత్తం 29 మంది అబ్బాయిలపై అమ్మాయి రేప్ కేసు పెట్టిందని అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వీడియో క్లిప్‌తో బ్లాక్ మెయిల్
గత జనవరిలో తన బాయ్‌ఫ్రెండ్ తనపై అత్యాచారం చేశాడని, దాన్ని వీడియో తీశాడని, ఆ వీడియోతో అతను తనను బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.
"బాలిక ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించాం. ఆమె చెప్పినవి ధ్రువీకరించే పనిలో ఉన్నాం" అని కమిషనర్ దత్తాత్రేయ కరాలే చెప్పారు.
పోలీసులు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తును ఒక మహిళా అధికారి చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- Pak Vs NZ: పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకోవాలంటూ న్యూజీలాండ్‌కు నిఘా సమాచారం ఇచ్చిందెవరు
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఇక సాధారణమైపోతాయా - బీబీసీ విశ్లేషణలో ఏం తేలింది
- వికీపీడియాలో చొరబాటు: చైనా లక్ష్యాలను ప్రమోట్ చేసేలా కంటెంట్ నియంత్రణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








