తెలంగాణ, ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, Telangana/AP CMO
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, హైదరాబాద్‌లోని గోల్కొండలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వీరిద్దరూ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి వారు మాట్లాడారు.

ఫొటో సోర్స్, fb/andhra pradesh cm
ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, "రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అందాల్సిన హక్కుల అమలుకు, ఆ వాతావరణాన్ని కల్పించేందుకు తమ ప్రభుత్వం గత 26 నెలలుగా ఎన్నో అడుగులు వేసింది" అని అన్నారు.
వివిధ వర్గాలు ఏం కోరుకుంటున్నారు అనేది తన 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానన్న జగన్.. ఆ సమయంలో వివిధ వర్గాల ప్రజలు ఏం కోరుకున్నారో వివరించారు.
ఈరోజు బడులకు, కాలేజీలకు వెళ్తున్న పిల్లలు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి ఉండాలని కోరుకున్నారని, రైట్ టు ఎడ్యుకేషన్ మాత్రమ కాదు రైట్ టూ ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకున్నారని జగన్ తెలిపారు.
రాష్ట్రంలో పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎలాంటి వ్యాధికైనా వైద్యాన్ని హక్కుగా పొందాలని కోరుకున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, ugc
పరిపాలన అంటే ఒక నగరం కేంద్రంగా ఉంటుందనే భావన పోయి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అందరికీ తమకు సమీపంలోనే పరిపాలన ఉందని తెలియజేయాలని కోరుకున్నారని రాష్ట్ర ప్రజలు భావించారని, తమకంటూ ఒక స్వంత ఇల్లు హక్కుగా లభించాలని ప్రతి కుటుంబం కోరుకుందని చెప్పారు.
కులం మతం ప్రాంతం వర్గం రాజకీయం చివరికి పార్టీలు కూడా చూడకుండా మనిషిని మనిషిగా చూసే ప్రభుత్వం కావలని కోరుకున్నారని, అందరికీ సమన్యాయంతోపాటూ లంచాలు లేని పారదర్శకత వ్యవస్థ నెలకొనాలని రాష్ట్ర ప్రజలు ఆశపడ్డారని ముఖ్య మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రజలు కోరుకున్న అన్నింటినీ అందించడమే ఈరోజు పరిపాలనకు, ప్రజాస్వామ్యానికి, స్వాతంత్ర్యానికి అర్థం అని తమ ప్రభుత్వం గట్టిగా నమ్మిందని, కాబట్టే గత 26 నెలలుగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గతిని మారుస్తూ నిర్ణయాలు తీసుకుందని జగన్ చెప్పారు.
ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏయే పథకాలు అమలు చేసిందో ఒక్కొక్కటిగా వివరించారు.

ఫొటో సోర్స్, fb/telangana cmo
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భం జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో ఉజ్వల ఘట్టాలను, మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగ్వరంగా స్మరించుకుంటోందని చెప్పారు.
స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన ఎంతో మంది మహనీయులకు సీఎం నివాళి అర్పించారు
75 ఏళ్ల భారత దేశ ప్రస్థానంలో మనందరం ఏం సాధించాం, ఇంకా సాధించాల్సింది ఏంటనేది మదింపు చేసుకోవాలి. ఒక వైపు దేశం అనేక రంగాల్లో కొంత పురోగతి సాధించినా, అదే సమయంల చాలా రాష్ట్రాల్లో ప్రజలు కనీస అవసరాలు కూడా లేక కొట్టుమిట్టాడుతున్న దుస్థితి ఉందన్నారు.

ఫొటో సోర్స్, TelangnaCMO
స్వాతంత్రం రాగానే సభలే చేసి సంబరపడగానే సరిపోదోయ్ అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటను ఇప్పటికీ మనం అన్వయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మరింత నిబద్ధత, నిజాయితీ, సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారత ప్రజలు పునరంకితం కావాలని కోరుతున్నానన్నారు.
మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసా మార్గంలో సాగిన జాతీయోద్యమమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం కోసం కోసం పోరాడి మనం విజయం సాధించామన్నారు.
స్వరాష్ట్రం సాధించినప్పటి నుంచి ప్రజ సమస్యలు పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికా బద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ముదుకు సాగుతోందని, అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందని చెప్పారు.
ఎన్నో అవరోధాలు, సమస్యలు, ప్రతికూల పరిస్థితులుఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించాం అని సీఎం అన్నారు.
విద్యుత్, సాగునీరు, తాగునీరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచామని, దీర్ఘ దృష్టితో రూపొందించి ప్రణాళికలతో ఏడేళ్ల స్వల్ప వ్యవధిలోనే స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా ఆవిర్భవించామని కేసీఆర్ తెలిపారు.
మన విధానాలు అనుసరించి ఆచరించడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు పథకాలు, కార్యక్రమాలు అధ్యయనం చేస్తున్నారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారిన అద్భుతాన్ని టీఆర్ఎస్ ఆవిష్కరించింది అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








