ప్రతి నిమిషానికి 4 చెట్ల నరికివేత...గత అయిదేళ్లుగా భారత్‌లో జరిగిన పర్యావరణ ఘోరమిది.

గత అయిదు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా సగటున ప్రతీ నిమిషానికి 4 చెట్లను నరికారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అడవుల సంరక్షణ కోసం ప్రచారం
    • రచయిత, అర్జున్ పర్‌మర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్ రెండో ‌వేవ్‌లో భారతదేశంలో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు.

కొన్ని వేల రూపాయిలు ఖర్చు పెట్టి ఆప్తులను బ్రతికించుకుందామని అనుకున్నా కూడా, ఆక్సిజన్ దొరకకపోవడంతో తమ వారి ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు.

చెట్లను పెంచడం, వాటి నరికివేతను ఆపడం, అడవుల కొట్టివేతను అరికట్టడం వల్ల గాలిలో సహజంగా ఆక్సిజన్ లభిస్తుందని చెబుతూ కోవిడ్ రెండో వేవ్ లో కనిపించిన ఆక్సిజన్ కొరతను పర్యావరణవేత్తలు ఉదాహరణగా చూపిస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలు ఇప్పటికైనా గ్రహించకపోతే, ఆక్సిజన్ కొరత, వాయు కాలుష్యం భవిష్యత్తులో ఒక సాధారణ సమస్యగా మారిపోయే ప్రమాదంగా ఉందని హెచ్చరిస్తున్నారు.

చెట్లను ఇష్టానుసారం నాశనం చేస్తున్న తీరును చూస్తుంటే భవిష్యత్తులో ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ కొనుక్కోవల్సిన పరిసితి ఏర్పడవచ్చని పర్యావరణవేత్తలు అంటున్నారు.

మార్పు మొదలైందా ?

ఆక్సిజన్ కొరత సృష్టించిన ఈ నిస్సహాయ స్థితి ప్రజలను మేల్కొనేలా చేసిందని చాలా మంది పర్యావరణవేత్తలు అంటున్నారు. వారి మనసులు మారి, పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరాన్ని గుర్తించారని చెబుతున్నారు.

కానీ, ఈ సంక్షోభం చెట్లను, అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఈ అంశం పై పునరాలోచించే ప్రయత్నం చేసినట్లు కనిపించడం లేదు. పెరుగుతున్న సంక్షోభాన్ని చూసేందుకు ఇంకా వారి కళ్ళు తెరుచుకున్నట్లుగా లేదని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

ప్రకృతి విషయంలో ప్రభుత్వ సంస్థలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని భారత ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా భారత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి పేరుతో 1,09,75,844 చెట్లను నరికేందుకు అనుమతి ఇచ్చినట్లు బీబీసీ గుజరాతీ సంపాదించిన నివేదిక చెబుతోంది. ఆర్టీఐ ద్వారా బీబీసీ చేసిన దరఖాస్తుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. అంటే, గత అయిదు సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా సగటున ప్రతీ నిమిషానికి 4 చెట్లను నరికేశారు.

భారత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి పేరుతో దేశవ్యాప్తంగా 1,09,75,844 చెట్లను నరికేందుకు అనుమతి ఇచ్చింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరికివేతకు గురైన చెట్లు

ఈ పరుగు వినాశనానికే కానీ, అభివృద్ధికి కాదు

చెట్ల నరికివేత గణనీయంగా పెరగడం పట్ల పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ హితంగా ఉంటామని చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అసాధారణ వేగంతో చెట్లను నరికేందుకు అనుమతి ఇచ్చిందని వారు అంటున్నారు.

అయితే, ఈ మొత్తం పరిస్థితిని వివరించేందుకు, చెట్లు, అటవీ భూముల వినాశనం పెరగడానికి గల కారణాల గురించి బీబీసీ గుజరాతీ కొంత మంది నిపుణులతో మాట్లాడింది.

" తెగి పడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే అది అభివృద్ధి పేరిట వినాశనానికి పరుగు తీస్తున్నట్లుగా ఉంది" అని పర్యావరణ వేత్త రోహిత్ ప్రజాపతి అన్నారు. "ఈ సంఖ్య చాలా ఎక్కువ, ఇది పర్యావరణం పట్ల ప్రభుత్వ వైఖరిని అద్దం పడుతోంది" అని అన్నారు.

వడోదరకు చెందిన కమ్యూనిటీ సైన్స్ సెంటర్ డైరెక్టర్ జితేంద్ర గావ్లీ ఈ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ నరికివేతకు గురవుతున్న చెట్ల సంఖ్య దిగ్భ్రాంతిని కలిగిస్తోందని అన్నారు. ఇదంతా చూస్తుంటే పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్లుగా కనిపిస్తోందని అన్నారు.

"చెట్లను తీసేయకుండా ప్రభుత్వానికి అనేక ప్రత్యామ్న్యాయాలు ఉంటాయి. కానీ, వాటిని నరకడం సులభం, చవకైన పరిష్కారం. అందుకు కొట్టేస్తున్నారు. " అని ఆయన అన్నారు. వృక్షాలను అభివృద్ధికి ఆటంకంగా చూస్తున్నారని రోహిత్ ప్రజాపతి అన్నారు.

ఒక్క చెట్టును కూడా నరకకుండా సామాన్య మానవుడు ఇంటిని కట్టుకోవడానికి చూడగలిగినప్పుడు, ప్రభుత్వం అదే పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. .

ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే కూడా చెట్లను కొట్టిన సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉండవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే కూడా చెట్లను కొట్టిన సంఖ్య 10 రెట్లు ఎక్కువ ఉండవచ్చు

ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుందా?

నిజానికి ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే కూడా చెట్లను కొట్టిన సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని రోహిత్ అభిప్రాయపడుతున్నారు.

"చాలా చెట్లను ప్రభుత్వ ఆమోదం లేకుండానే నరికేశారని, వాటి సంఖ్య ఈ లెక్కల్లో చేరదని అన్నారు. ‘‘ ప్రభుత్వానికి చెట్లు అంటే ఫర్నీచర్ తయారీకి వాడే చెక్క మాత్రమే" అని అన్నారు.

ప్రభుత్వ లెక్కల్లో చెప్పినదాని కంటే ఎక్కువ చెట్లనే నరికేసి ఉంటారని అహ్మదాబాద్ లో ని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్తికేయ సారాభాయ్ అన్నారు.

అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన ప్రతి సారీ నిర్మూలించిన చెట్లకు పది రేట్లు ఎక్కువగా మొక్కలను నాటినట్లు ప్రభుత్వం చెబుతోంది.

గత మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం 76,72,337 చెట్లను నిర్మూలించగా, అడవులను తిరిగి పెంచేందుకు 7,87,00,000 చెట్లను నాటినట్లు పర్యావరణ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో ఫిబ్రవరి 2020లో లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

అయితే, చెట్లను నరికేసి వాటికి బదులుగా కొన్ని మొక్కలను నాటడం సముచితం అనిపించుకోదని రోహిత్ అన్నారు. "స్థానిక మొక్కల రకాలను నాటకపోవడం ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు" అని అన్నారు.

"ప్రాజెక్టులకు వెసులుబాటు కల్పించేందుకు అడవుల నాశనానికి ముందు, తర్వాత చేసే మొక్కలు నాటే ప్రక్రియ అశాస్త్రీయమైనదని, మొక్కలు తిరిగి నాటే క్రమంలో ఆ ప్రదేశంలో ఉండే సహజ జీవావరణానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదని, దాంతో కొత్తగా నాటిన మొక్కల వల్ల పర్యావరణానికి పెద్దగా మేలు జరగడం లేదని పర్యావరణ వేత్తలు అంటున్నారు.

"అడవులను కొత్తగా పెంచలేం. ఉన్నవాటిని పరిరక్షించాలి" అని రోహిత్ అన్నారు.

స్థానికంగా పెరిగే చెట్లనే పెంచాలని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అధికారి కార్తికేయ సారాభాయ్ కూడా అన్నారు.

"చెట్లను నరికిన స్థానాల్లో నాటిన మొక్కల్లో ఎన్ని బ్రతికాయో కూడా విచారణ చేయాలి. అలాంటి ఆడిట్లను మేము శాటిలైట్ చిత్రాల ద్వారా చేస్తాం. కానీ, ఇదే విధానాన్ని అన్ని సార్లూ అవలంబించరు" అని చెప్పారు.

భారతదేశంలో రోడ్లను వెడల్పు చేయడానికే ఎక్కువ చెట్లను నరికేశారని పర్యావరణ వేత్త గావ్లీ అన్నారు.

"ప్రభుత్వం అభివృద్ధి పనులను అస్తవ్యస్తంగా చేపడుతుందనే విషయాన్ని అర్ధం చేసుకోవడం ముఖ్యం. అవసరం లేనప్పుడు కూడా రోడ్లను వెడల్పు చేయడం లాంటి పనులను చేస్తూ ఉంటారు" అని అన్నారు.

"నిపుణులను సంప్రదించిన తర్వాతే ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టడం వల్ల చాలా చెట్లను రక్షించగలం" అని అన్నారు.

"ఏదైనా ప్రాజెక్టును అతి తక్కువ చెట్లను మాత్రమే తొలగించి పూర్తి చేసారేమోననే విషయాన్ని కూడా పరిశీలించాలికానీ, ఒక్క చెట్టును కూడా కొట్టకుండా ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయడం సాధ్యం కాదు" అని కార్తికేయ అన్నారు.

స్థానికంగా లభించే మొక్కలను నాటడం వల్ల పర్యావరణానికి మేలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొక్కతో బాలుడు

ఒక చెట్టు విలువ ఎంత?

ఒక చెట్టు వయసును బట్టి ఒక సంవత్సరానికి దాని విలువ 74,500 అని సుప్రీం కోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల ప్యానెల్ తమ నివేదికలో తెలిపినట్లు హిందూస్తాన్ టైమ్స్ కథనం తెలుపుతోంది. అంటే, ఒక వంద సంవత్సరాల చెట్టు విలువ ఒక కోటి రూపాయిల కంటే ఎక్కువే ఉంటుంది.

ఆ చెట్టు ఇచ్చే ఆక్సిజన్, ఎరువు విలువను కూడా ఈ నివేదిక అంచనా వేసింది. ‘‘ మానవ శరీరం లాగే, చెట్టు కూడా అత్యంత విలువైనది. చెట్టును నరకడమంటే, దానిని చంపేయడమే" అని రోహిత్ అన్నారు.

గత రెండు సంవత్సరాల్లో భారతదేశంలో హరిత ప్రదేశాలు పెరిగాయని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2019 నివేదిక చెబుతోంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం చెట్ల నరికివేత కొనసాగుతోంది.

భారతదేశంలో అడవులు, హరిత వనాలు నిజంగానే పెరిగాయా?

గత రెండు సంవత్సరాల్లో భారతదేశంలో హరిత ప్రదేశాలు పెరిగాయని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2019 నివేదిక చెబుతోంది. దీని గురించి ఎన్‌డిటీవీ లో ప్రస్తావించారు.

దిల్లీ, గోవాలో హరిత ప్రదేశాలు పెరిగినట్లు పర్యావరణ శాఖ అధికారి ఆ నివేదికలో పేర్కొన్నారు.

దేశంలో అటవీ, హరిత ప్రాంతాల విస్తీర్ణం 80.73 మిలియన్ హెక్టర్లకు విస్తరించాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చెప్పారు. ఇది దేశ భూభాగంలో24. 56 శాతం. 2014 -2019 మధ్యలో భారతదేశపు అటవీ విస్తీర్ణం 13,000 చదరపు కిలోమీటర్లకు పైగా పెరిగిందని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

భారతదేశంలో గత రెండేళ్లలో హరిత ప్రదేశాలు 5188 చదరపు అడుగులు విస్తీర్ణం మేర పెరిగాయని నివేదిక చెబుతోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇందులో అటవీ విస్తీర్ణం 3976 చదరపు కిలోమీటర్లు ఉండగా, చెట్ల విస్తీర్ణం 1212 చదరపు అడుగులు పెరిగింది.

కానీ, 2030 నాటికి 33 శాతం భూభాగాన్ని హరిత ప్రదేశంగా మార్చాలంటే ఈ పెరుగుదల సరిపోదని, ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు.

అయితే, లైవ్ మింట్‌లో గ్రీన్ కవర్ అంటే ఏమిటో నిర్వచించారు. ఒక హెక్టారు భూభాగంలో 10 శాతం చెట్లు ఉంటే, దానిని అటవీ ప్రాంతంగా పరిగణించవచ్చు.

ఇలా లెక్కించడం తప్పు అని చాలా మంది నిపుణులు అంటారు. అటవీ ప్రాంతాలను లెక్కించడానికి శాటిలైట్ మ్యాపింగ్ విధానాన్ని అవలంభిస్తారు. అందులో, భూమిని వాడిన విధానం, యాజమాన్యం, చెట్ల రకాలను పరిగణించరు.

లైవ్ మింట్ లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం పూల తోటలు, కాఫీ, కొబ్బరి తోటలు, పార్కులను కూడా అటవీ ప్రాంతాల కింద లెక్కిస్తారు. అందువల్ల ఇలాంటి విధానం అటవీ ప్రాంతాల గురించి సరైన అంచనాలను ఇవ్వదు. దాంతో, ఈ సమాచారం ఆధారంగా అటవీ ప్రాంతాల గురించి సరైన అంచనాలకు రాలేమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ అభిప్రాయంతో రోహిత్ అంగీకరించారు. "ఇలాంటి లెక్కలతో, నిజమైన లెక్కలు బయటకి రాకుండా ప్రభుత్వం చూస్తోంది. వీటిని పూర్తిగా నమ్మలేం" అని ఆయన అన్నారు.

కానీ, గత కొన్ని సంవత్సరాల్లో హరిత ప్రదేశాలను పెంచడానికి ప్రభుత్వం చాలా చేసిందని కార్తికేయ అన్నారు. కానీ, లక్ష్యాన్ని చేరేందుకు ఇంకా చాలా చేయవలసి ఉందని అన్నారు.

"శాటిలైట్ మ్యాపింగ్ విధానం నమ్మశక్యమైనది. ప్రభుత్వం ఇచ్చే లెక్కలను నమ్మడం వల్ల ఉపయోగం లేదు" అని అన్నారు.

అటవీ పరిరక్షణ చట్టం 1980ను అనుసరించి అటవీ ప్రాంతాల్లో చెట్లను నరకాలంటే అనుమతి తీసుకోవడం తప్పని సరి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అటవీ ప్రాంతం

చెట్ల నరికివేత ఆపేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు

అటవీ పరిరక్షణ చట్టం 1980ను అనుసరించి అటవీ ప్రాంతాల్లో చెట్లను నరకాలంటే అనుమతి తీసుకోవడం తప్పని సరి. అలాంటి ప్రదేశాల్లో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే చెట్లను నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఎక్కడ వీలయితే అక్కడ చెట్లను తిరిగి నాటాల్సి ఉంటుంది.

అడవులను తొలగించిన స్థానంలో అందుకు రెట్టింపు సంఖ్యలో చెట్లను నాటాలి. ఆ ఖర్చును సదరు సంస్థ భరించేటట్లు, అటవీ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి.

గత అయిదు సంవత్సరాల్లో 11 మిలియన్ చెట్లను నరికారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గత అయిదు సంవత్సరాల్లో 11 మిలియన్ చెట్లను నరికారు

గత అయిదు సంవత్సరాల్లో 11 మిలియన్ చెట్లను నరికేయగా, 126 మిలియన్ చెట్లను నాటినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సంరక్షక విభాగం అధికారి సందీప్ శర్మ బీబీసీ గుజరాతీకి ఈ మెయిల్ ద్వారా సమాధానమిచ్చారు.

‘‘అభివృద్ధి పనుల కోసం అటవీ ప్రదేశాలను అతి తక్కువగా వాడేలా చూస్తాం. అలాంటి ప్రతీ ప్రతిపాదనను పూర్తిగా పరిశీలిస్తాం. అంతే కాకుండా, అలాంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం కూడా అవసరం. ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల వల్ల అభివృద్ధి పనుల కోసం చాలా కొన్ని చెట్లను మాత్రమే తొలగించారు.’’ అని తన మెయిల్ సందీప్ శర్మ పేర్కొన్నారు.

గత అయిదు సంవత్సరాల్లో 11 మిలియన్ చెట్లను నరికారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరికిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం శాస్త్రీయం కాదని నిపుణులు అంటున్నారు

ప్రకృతి కోసం ఆలోచిస్తున్నప్పుడు ప్రాజెక్టు సమయం, ఖర్చు కూడా పెరుగుతాయి. కానీ, ఎటువంటి రాజీ లేకుండా ఇదే విధానాన్ని కచ్చితంగా అనుసరిస్తున్నట్లు తెలిపారు.

"గత అయిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన 1. 41 హెక్టార్ల అడవుల మల్లింపు కార్యక్రమానికి ప్రతిగా 2.11 హెక్టార్ల భూభాగంలో చెట్లను నాటాం. పర్యావరణం కోసం ఆరోగ్యకరమైన అటవీ ప్రాంతాలను సృష్టించేందుకు జాగ్రత్త తీసుకున్నాం. ఒక్క 2020-2021లోనే, 2. 4 హెక్టార్ల అటవీ ప్రాంతాల పునరుద్ధరణ కూడా జరిగింది" అని ఆయన చెప్పారు.

చెట్లను నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కూడా చాలా పధకాలను ప్రారంభించినట్లు చెప్పారు. గత ఆరు సంవత్సారాల్లోనే, ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 740 కోట్ల కొత్త చెట్లను నాటింది.

కానీ, ఈ చర్యలతో నిపుణులు సంతృప్తికరంగా లేరు. "చెట్లను కొట్టినందుకు బదులుగా చెట్లను నాటడం పరిష్కారం కాదు. మనం వ్యూహాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ప్రోజెక్టుల రూపకల్పనలను మార్చడానికి ప్రభుత్వ సంస్థలు అలవాటు పడితే, చెట్లు విరగకుండా ప్రాజెక్టును వాటి నడుమే నిర్మించవచ్చు".

ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెట్లను చూడాలి. అప్పుడే, మనం చెట్లను రక్షించుకోగలం. అవి కూడా పర్యావరణాన్ని పరిరక్షించి విలువను ఆపాదించగలవు" అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)