కన్నడ: "భారతదేశంలో వికారమైన భాష" అనే సెర్చ్ రిజల్ట్స్ పట్ల క్షమాపణ చెప్పిన గూగుల్

ఫొటో సోర్స్, Getty Images
"భారతదేశంలో వికారమైన భాష" అని గూగుల్‌లో టైపు చేయగానే, కన్నడ అనే ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువారం నాడు గూగుల్‌లో కనిపించిన ఈ రిజల్ట్స్ పట్ల కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్‌కు లీగల్ నోటీసు పంపించాలని భావిస్తోంది.
అయితే, ఈ విషయంలో చోటు చేసుకున్న అపార్ధాలకు, మనోభావాలు గాయపడినందుకు క్షమాపణలు చెబుతూ గూగుల్ ప్రకటన విడుదల చేసింది.
ఈ అంశం పట్ల తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తడంతో గూగుల్ తన సెర్చ్ రిజల్ట్స్‌ను సరిచేసింది. గూగుల్ సెర్చ్‌లో ఇలాంటి ఫలితం రావడం పట్ల చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కన్నడ ప్రజల ప్రతిష్టను భంగపరిచేందుకు ఇది గూగుల్ చేసిన ప్రయత్నం. ఈ విషయంలో గూగుల్ క్షమాపణ చెప్పాలి" అని కర్ణాటక మంత్రి అరవింద్ లింబావలి అన్నారు.
"2500 సంవత్సరాల పురాతనమైన కన్నడ భాషకు ఒక సొంత చరిత్ర ఉంది. రెండున్నర శతాబ్దాలుగా ఈ భాష కన్నడ ప్రజలకు ప్రతిష్టకు ప్రతీకగా నిలిచింది" అని లింబావలి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

గూగుల్‌లో సెర్చ్ ఫీచర్ ఎప్పుడూ సమగ్రంగా ఉండదని, కొన్ని సార్లు, ఇంటర్ నెట్ లో ఉన్న సమాచారం తీరును బట్టి ఒక్కొక్కసారి కొన్ని ప్రశ్నలకు ఊహించని ఫలితాలు వస్తూ ఉంటాయని, ట్విటర్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో గూగుల్ పేర్కొంది.
"ఇది సరైంది కాదని మాకు తెలుసు. కానీ, ఈ విషయం తెలియచేయగానే, మేము సత్వర చర్యలు తీసుకుంటాం. మా అల్గారిథమ్స్‌ను మెరుగు పరచడానికి మేం నిరంతరం పని చేస్తూనే ఉంటాం" అని అన్నారు.
"అయితే, ఇవన్నీ గూగుల్ అభిప్రాయాలు కావని, ఈ సెర్చ్ సృష్టించిన అపార్ధాలకు, ఎవరి మనోభావాలనైనా గాయ పరిచినట్లయితే గూగుల్ క్షమాపణ చెబుతోంది" అని ప్రకటనలో పేర్కొన్నారు.
"కన్నడ మాత్రమే కాదు. ఏ భాషా చెడు భాష కాదు. భాషలను నిందించడం చాలా బాధాకరమైన విషయం" అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ట్వీట్ చేశారు.
"భాష పై ద్వేషాన్ని పెంచే సందేశాలను అరికట్టడం గూగుల్‌కు అసాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు.
భారతదేశంలో గూగుల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సంస్థ. ఈ సంస్థ దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో, భాషల్లో తన ఉనికిని విస్తరించుకుంది.
దేశంలో మొబైల్ ఇంటర్నెట్ మరిన్ని మారుమూల ప్రాంతాలకు చేరుతున్న నేపథ్యంలో గూగుల్ భారతదేశంలో మరింత విస్తరించే ప్రణాళికల్లో ఉంది.
ఇవి కూడా చదవండి:
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








