జూహీచావ్లాకు దిల్లీ హైకోర్టు రూ.20 లక్షల ఫైన్...5జీ కి వ్యతిరేకంగా వేసిన పిల్ కొట్టివేత

జుహీ చావ్లా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జుహీ చావ్లా
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో 5జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సినీ నటి జూహీ చావ్లా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. పిటిషనర్లు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని, ఇందుకు వారికి రూ. 20 లక్షల జరిమానా విధించామని కోర్టు పేర్కొంది.

ఇది పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్‌గా కనిపిస్తోందని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఎందుకు పిటిషన్?

5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీచావ్లా దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూహీ చావ్లాతోపాటూ వీరేష్ మలిక్, టీనా వాచ్ఛానీ అనే మరో ఇద్దరు కూడా కోర్టులో పిటిషన్ వేశారు.

5జీ ఆరోగ్యానికి ఎంత సురక్షితం అనే విషయంలో పరిశోధనలు చేసేలా ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించాలని కోర్టును కోరారు. ప్రభుత్వ ఏజెన్సీల పరిశోధనలపై ఏ ప్రైవేటు కంపెనీ, వ్యక్తుల ప్రభావం లేకుండా చూడాలని కూడా పిటిషనర్లు కోరారు.

జూహీచావ్లా తదితరులు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు కొట్టి వేసింది.

ఫొటో సోర్స్, TWITTER/@IAM_JUHI

ఫొటో క్యాప్షన్, జూహీ చావ్లా

దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి చాలా ప్రభుత్వ ఏజెన్సీలను కొన్ని విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు.

"ఇలాంటి టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. దీనివల్ల పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని మేం కోరుతున్నాం" అని జూహీ చావ్లా, వీరేష్ మలిక్, టీనా వాచ్ఛానీ వకీలు దీపక్ ఖోస్లా చెప్పారు.

ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ మొదలైంది. ఈ పిటిషన్ గురించి జూహ్లీ చావ్లాతో మాట్లాడ్డం కుదరలేదు. ఆమె ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్నారు. శుక్రవారం నాడు ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

5జీపై ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

పదేళ్ల క్రితమే రేడియేషన్ గురించి ఆందోళన

మొబైల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ గురించి జూహీ చావ్లా పదేళ్ల క్రితమే ఆందోళన వ్యక్తం చేశారు.

2011లో ప్రచురించిన ఒక రిపోర్ట్ ప్రకారం మలబార్ హిల్‌లో ఉంటున్న జూహీ చావ్లా తన ఇంటికి 40 మీటర్ల దూరంలో ఉన్న మొబైల్ ఫోన్ టవర్ల వల్ల ఆరోగ్యంపై పాడవుతుందని ఆందోళన వ్యక్త చేశారు. సహ్యాద్రి గెస్ట్ హౌస్ మీదున్న 16 మొబైల్ టవర్ల వల్ల వెలువడే రేడియేషన్‌పై పరిశోధనలు చేసిన ముంబయికి చెందిన ఒక ఐఐటీ ప్రొఫెసర్, జూహీ ఇంట్లో ఒక పెద్ద భాగం సురక్షితంగా లేదని చెప్పినట్లు అందులో తెలిపారు.

యూట్యూబ్‌లో ఉన్న ఒక వీడియోలో ఇంటి పక్కనే అన్ని మొబైల్ ఫోన్ టవర్లు చూసి తనలో ఆందోళన పెరిగిందని, ఇంటి చుట్టుపక్కల రేడియేషన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలని అనుకున్నానని జూహీ చావ్లా చెబుతూ కనిపిస్తారు.

దానిపై రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె ఆందోళన మరింత పెరిగింది.

5జీ సెల్యులర్ నెట్‌వర్క్ ప్రపంచంలోని అమెరికా, చైనా, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాల్లో ఇప్పటికే ఉంది. భారత్‌లో కూడా 5జీ ట్రయల్స్ జరుగుతున్నాయి.

5జీ వల్ల ఇంటర్నెట్ స్పీడ్ చాలా పెరుగుతుంది. దీనిని విప్లవాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ద్వారా టెలీసర్జరీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రైవర్ లేకుండా నడిచే కార్లు లాంటి టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయడానికి సహకారం లభిస్తుందని భావిస్తున్నారు.

కానీ, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 5జీ కోసం ఏర్పాటుచేస్తున్న మౌలిక సదుపాయాల వల్ల రేడియేషన్ ఎక్స్‌పోజర్ పెరుగుతుందని కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

కరోనా వేగంగా వ్యాపించడానికి 5జీ టవర్లే కారణం అని గత ఏడాది వదంతులు వ్యాపించడంతో బ్రిటన్‌లో 5జీ టవర్లకు నిప్పుపెట్టడం మీకు గుర్తుండే ఉంటుంది.

5జీ టెక్నాలజీ

ఫొటో సోర్స్, STRATOSPHERIC PLATFORMS

పిటిషన్‌లో ఏం చెప్పారు

పిటిషనర్లు 5జీ వల్ల ఎదురవుతాయని భావిస్తున్న ప్రమాదాల గురించి తమ పిటిషన్‌లో ప్రస్తావించారు.

5జీని వ్యతిరేకిస్తున్న బెల్జియం గురించి కూడా వారు ప్రస్తావించారు.

ఒకవైపు మొబైల్ కనెక్టివిటీ మరింత మెరుగు పరచడానికి సెల్యులర్ కంపెనీలు ప్రమాదకర స్థాయిలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తుంటే, మరోవైపు నెట్‌వర్క్ ప్రొవైడర్స్ మధ్య ఈ యుద్ధం ప్రజలు ప్రాణాలమీదకు తెచ్చిందని 5 వేలకు పైగా శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.

టెలీకమ్యూనికేషన్ పరిశ్రమ 5జీ ప్లాన్ విజయవంతం అయితే, ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఉత్పత్తి అయ్యే రేడియేషన్ నుంచి మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లతోపాటూ ఒక్కరు కూడా తప్పించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 5జీ వల్ల వచ్చే రేడియేషన్ ఇప్పటితో పోలిస్తే పది నుంచి వంద రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు.

5జీ టెక్నాలజీ

5జీ అంత భిన్నం ఎందుకు

మిగతా సెల్యులర్ టెక్నాలజీల్లా 5జీ నెట్‌వర్క్ కూడా యాంటెన్నా, ఫోన్ మధ్య ప్రసారమయ్యే రేడియో వేవ్స్ సిగ్నళ్ల మీద ఆధారపడతుంది.

టీవీ సిగ్నల్ అయినా, రేడియో సిగ్నల్ అయినా మన చుట్టూ ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ ఉంటుంది.

5జీ టెక్నాలజీ పాత మొబైల్ నెట్‌వర్క్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ ఉపయోగిస్తుంది.

దీని ద్వారా ఎక్కువ మొబైళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం అందించవచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా ఉంటుంది.

5జీ నెట్‌వర్క్ కోసం పాత టెక్నాలజీతో పోలిస్తే ఎక్కువ ట్రాన్స్‌మీటర్లు అవసరమవుతాయి. అవి నేలకు దగ్గరగా ఉంటాయి.

5జీ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

5జీ ముప్పుపై అంతర్జాతీయ నివేదికలు

మొబైల్ ఫోన్ వినియోగం వల్ల ఆరోగ్యంపై ఏదైనా ప్రతికూల ప్రభావం పడినట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లభించలేదని 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

కానీ, మొబైల్ ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రో మాగ్నటిక్ ఫీల్డ్స్ వల్ల మనుషులకు కాన్సర్ ముప్పు ఉండచ్చొని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇచ్చిన ఒక నివేదిక చెప్పింది. కానీ, అలా అనడానికి పక్కా ఆధారాలు ఏవీ లేవని డబ్ల్యుహెచ్ఓ మరో నివేదికలో చెప్పింది.

రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌కు ఎక్కువ ఎక్స్‌పోజ్ కావడం వల్ల ఒక ఎలుక గుండెలో కాన్సర్ లాంటి ట్యూమర్ ఏర్పడినట్లు 2018లో ఒక అమెరికా ప్రభుత్వ రిపోర్టులో గుర్తించారు.

ఈ పరిశోధనలో ఎలుక మొత్తం శరీరాన్ని రెండేళ్ల పాటు మొబైల్ ఫోన్ రేడియేషన్‌ ఎక్స్‌పోజర్‌లో ఉంచారు. ప్రతి రోజూ ఆ ఎలుకలను 9 గంటలపాటు దానికి ఎక్స్‌పోజ్ చేశారు.

"ఎలుకలు భరించిన ఆ మొబైల్ ఫోన్ రేడియేషన్, ఒక మనిషి అనుభవానికి చాలా దూరంగా ఉంది. కాబట్టి ఈ పరిశోధన మీ జీవితాన్ని ప్రభావితం చేయకూడదు" అని ఆ పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్త అన్నారు

మొబైల్ ఫోన్ వల్ల ఆరోగ్యానికి ముప్పుందా, దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఒక నివేదిక ఇచ్చింది. మొబైల్ ఫోన్ వల్ల మనుషులకు కాన్సర్ ముప్పు ఉందని ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది.

5జీ సహా అన్ని రేడియో ఫ్రీక్వెన్సీలకు ఎక్స్‌పోజర్ కావడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి అది 2022లో ఒక రిపోర్ట్ ప్రచురిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020లో ఒక నివేదికలో తెలిపింది.

2019లో చాలా మంది భారత శాస్త్రవేత్తలు 5జీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి లేఖలు రాశారు.

5జీ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

5జీ ట్రాన్స్‌మీటర్ వల్ల నిజంగా ఆందోళన అవసరమా

5జీ టెక్నాలజీకి చాలా కొత్త బేస్ స్టేషన్లు అవసరం అవుతాయని 2019లో బీబీసీ రియాలిటీ చెక్ టీమ్ గుర్తించింది.

కానీ ఎక్కువ ట్రాన్స్‌మీటర్లు పెట్టడం అంటే 4జీ టెక్నాలజీతో పోలిస్తే తక్కువ విద్యుత్‌తో వాటిని నడిపించడం. అంటే 5జీ యాంటెన్నా నుంచి వెలువడే రేడియేషన్ స్థాయి కూడా తక్కువగా ఉంటుంది.

ఇక రేడియేషన్ వల్ల ఏర్పడే వేడి విషయానికి వస్తే, 5జీ స్థాయిలో విడుదలయ్యే వేడి నష్టం కలిగించని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ ఐయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ ప్రొఫెసర్ రాడ్నీ క్రాఫ్ట్ బీబీసీ టీమ్‌కు చెప్పారు.

"5జీ వల్ల సమాజంలోని ఒక వ్యక్తి అత్యధిక రేడియో ఫ్రీక్వెన్సీకి ఎక్స్‌పోజ్ కావడం జరిగితే, అది ఎంత తక్కువగా ఉంటుందంటే, దానివల్ల ఉష్ణోగ్రత పెరిగినట్లు ఈరోజు వరకూ గుర్తించలేదు అన్నారు.

వర్చువల్ విచారణలో జూహీ సినిమా పాటలు

5జీకి వ్యతిరేకంగా జూహీచావ్లా, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జూన్ 2న వర్చువల్ విధానంలో సాగింది. అయితే, విచారణ జరుగుతుండగా ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. విచారణ మధ్యలో పాట పాడి ఓ వక్తి జడ్జి ఆగ్రహానికి గురయ్యారు.

జూహీచావ్లా తరఫు న్యాయవాది దీపక్ ఖోస్లా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా తన వాదన వినిపిస్తున్న సమయంలో హఠాత్తుగా మధ్యలో పాట వినిపించింది. జూహీచావ్లా నటించిన సినిమాలోని ''లాల్ లాల్ హోటోం పర్ గోరీ కిస్కా నామ్ హై'' అని ఓ వ్యక్తి పాట పాటడం ప్రారంభించారు.

ఈ పాట ప్రారంభమైన 8 సెకండ్ల తర్వాత, పాడుతున్న వ్యక్తిని కోర్టు నుంచి బైటికి పంపించాలంటూ న్యాయమూర్తి సిబ్బందిని ఆదేశించారు. కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత విచారణ కొనసాగింది. మళ్లీ ఆరు నిమిషాల తర్వాత మరోసారి పాట వినిపించింది.

ఈసారి ‘‘మేరీ బన్నో కి ఆయేగీ బారాత్‘‘ అంటూ జూహీచావ్లా మరో చిత్రంలోని పాట వినిపించింది. విచారణకు అంతరాయం కలగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ మిధా, అంతరాయానికి కారణమైన వ్యక్తికి కోర్టు ధిక్కారం నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

విచారణ ప్రారంభం నుంచి సదరు ఆ వ్యక్తి హడావుడి చేశారని, ‘‘జుహీ మేడమ్ ఎక్కడ, ఆమె నాకు కనిపించడం లేదు‘‘ అంటూ ఆయన ప్రశ్నించడం వర్చువల్ విచారణ సందర్భంగా వినిపించినట్లు బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అంతకు ముందు ఈ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రజలను ఆహ్వానిస్తూ వర్చువల్ విచారణ లింక్ జత చేస్తూ జూహీచావ్లా ఓ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

జూహీచావ్లా పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో ఆమెతో పాటు పిటిషన్ వేసిన పిటిషనర్ల తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)