దిల్లీలో వైరల్ వీడియో: "నా భర్తను నేను ముద్దు కూడా పెట్టుకుంటా, మీరు అడ్డుకోగలరా"

ఫొటో సోర్స్, Ani/youtube
కోవిడ్ వీకెండ్ లాక్‌డౌన్ ఉల్లంఘించడంతోపాటూ, మాస్క్ ధరించకుండా పోలీసులతో గొడవకు దిగిన దంపతులను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ దంపతులు పోలీసులతో గొడవపడే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కారులో మాస్కులు ధరించలేదని ఆపిన పోలీసులపై ఆ మహిళ, ఆమె భర్త దురుసుగా ప్రవర్తించడం కనిపిస్తోంది.
కర్ఫ్యూ పాస్ కూడా లేకపోవడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఫైన్ కట్టాలని కోరారు. కానీ దానికి నిరాకరించిన మహిళ ఏం చేసుకుంటారో చేసుకోండని అనడం వీడియోలో కనిపిస్తోంది.
పోలీసులతో గొడవ పడే సమయంలో "నా భర్తను నేను ముద్దు కూడా పెట్టుకుంటా. మీరు నన్ను అడ్డుకోగలరా" అని ఆ మహిళ అనడం కూడా వినిపిస్తోంది.
ఈ దంపతుల పేర్లు పంకజ్ దత్తా, ఆభా గుప్తా.
ఈ ఘటన దిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగింది.

ఫొటో సోర్స్, Ani/youtube
"మీరు నా కారెందుకు ఆపుతారు, నేను నా భార్యతోపాటూ నా కార్లో ఉన్నా" అని వీడియోలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పోలీసులపై గట్టిగా అరుస్తున్నాడు. ఆయన మాస్క్ కూడా వేసుకోకపోవడం కనిపిస్తోంది.
కార్లో ఒక్క వ్యక్తి ఉన్నప్పటికీ మాస్క్ ధరించాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి పోలీసులు వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా, దంపతులు వారితో కోపంగా గొడవకు దిగడం ఈ వీడియోలో కనిపించింది.
"మాపై యాక్షన్ తీసుకోండి చూద్దాం" అంటూ దంపతులు ఇద్దరూ పోలీసులను సవాల్ చేయడం కూడా కనిపిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తర్వాత, అక్కడికి ఒక మహిళా పోలీసును పిలిపించిన పోలీసులు గొడవకు దిగిన మహిళను సమీప పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇద్దరినీ సోమవారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు. స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించడంతో వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తన రిపోర్టులో చెప్పింది.
"తన భార్య మాస్కు వేసుకోదని, తననూ వేసుకోనివ్వదని" ఇంటరాగేషన్ సమయంలో భర్త చెప్పారని ఒక సీనియర్ పోలీసు అధికారి సమాచారం ఇచ్చారని పత్రిక చెప్పింది. కానీ, ఆయన భార్య మాత్రం తనకు శ్వాస సమస్య ఉందని అందుకే మాస్క్ వేసుకోనని పోలీసులకు చెప్పారని తెలుస్తోంది.
(కథనంలో వీడియోలో ఘటనను మాత్రమే వివరించాం. దీనిని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు)
ఇవి కూడా చదవండి:
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








