నాగపూర్ కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నలుగురు రోగుల మృతి

నాగపూర్ ఆస్పత్రి ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVIN MUDHOLKAR/BBC

ఫొటో క్యాప్షన్, అగ్ని ప్రమాదం జరిగిన ఆస్పత్రి

నాగపూర్‌-అమరావతి రహదారిలోని వాడీ ప్రాంతంలో ఉన్న కోవిడ్ ఆసుపత్రి ‘వెల్-ట్రీట్’ మంటలు చెలరేగడంతో నలుగురు చనిపోయారు.

ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగింది.

వెల్-ట్రీట్ ఒక మినీ కోవిడ్ ఆస్పత్రి. అధికారిక సమాచారం ప్రకారం మంటలు ఆస్పత్రిలోని ఐసీయూలో వ్యాపించాయి.

నాగపూర్ ఆస్పత్ర ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVIN MUDHOLKAR/BBC

ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఒక మహిళ చనిపోయారని నాగపూర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ కుమార్ ధ్రువీకరించారు.

అగ్ని ప్రమాదం జరిగిందని తమకు శుక్రవారం సాయంత్రం 8.10కి సమాచారం అందినట్లు నాగపూర్ ఫైర్ బ్రిగేడ్ చీఫ్ రాజేంద్ర ఉచ్కే చెప్పారు.

నాగపూర్ ఆస్పత్రి ప్రమాదం

ఫొటో సోర్స్, PRAVIN MUDHOLKAR/BBC

ఈ ఆస్పత్రిలో మంటలు అంటుకున్న సమయంలో అక్కడ 32 మంది రోగులు ఉన్నారు.

అగ్నిమాపక సిబ్బంది మూడో అంతస్తు నుంచి 21 మంది రోగులను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు.

కాలిన గాయాలతో ఉన్న రోగులను నాగపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్‌లో చేర్పించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను నగరంలోని మిగతా ఆస్పత్రుల్లో చేర్పించామని మహారాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ చెప్పారు.

ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ హఠాత్తుగా పేలిందని, ఆ సమయంలో అక్కడ ఐదుగురు రోగులు ఉన్నారని వెల్-స్ట్రీట్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రాహుల్ ఠవ్రే సమాచారం ఇచ్చారు.

మరోవైపు, మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో భద్రతా చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన గురించి ట్వీట్ చేశారు.

మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మృతుల్లో ముగ్గురిని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)