రేప్ బాధితురాలి పెళ్లి వ్యాఖ్యలపై మాట్లాడిన చీఫ్ జస్టిస్ బోబ్డే

ఫొటో సోర్స్, MOHD ZAKIR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ఒక అత్యాచార కేసు విచారణ సమయంలో నిందితుడు, బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని వచ్చిన ఆరోపణలపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. అది పూర్తిగా తప్పుడు సమాచారమని పేర్కొంది.
సోమవారం చీఫ్ జస్టిస్ శరద్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై వివరణ ఇచ్చింది.
14 ఏళ్ల అత్యాచార బాధితురాలి కేసులో విచారణ చేపట్టిన ఈ బెంచ్‌లో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ. రామసుబ్రమణ్యం కూడా ఉన్నారు. గర్భస్రావానికి అనుమతించాలని బాధితురాలు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఈ కేసు విచారణ సమయంలో, "మేం స్త్రీత్వానికి అత్యున్నత గౌరవం ఇచ్చాం. మీరు పెళ్లి చేసుకుంటున్నారా? అని అడిగాం, మీరు పెళ్లి చేసుకోవాలి అని మేం ఆదేశాలు ఇవ్వలేదు" అని చీఫ్ జస్టిస్ బోబ్డే స్ఫష్టంగా చెప్పారు.
చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించారు. "మీరు వేరే సందర్భంలో ప్రశ్న అడిగారు. మీ మాటలను మరో రకంగా ఉదహరించారు" అన్నారు.
"ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం, అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్టను దెబ్బతీయడమేనని" బాధితురాలి తరఫున కోర్టుకు హాజరైన లాయర్ బిజు అన్నారు.
కోర్టు ప్రతిష్ఠను మంటగలపకుండా అడ్డుకోడానికి ఒక వ్యవస్థ ఉండాలని కూడా ఆయన అన్నారు.
తర్వాత మాట్లాడిన చీఫ్ జస్టిస్ బాబ్డే "మన ప్రతిష్ట ఎప్పుడూ బార్ చేతుల్లో ఉంటుంది" అన్నారు.
న్యాయస్థానం చివరికి బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడ్డానికి ఆసక్తి చూపింది. ఈ కేసును మార్చి 12కు వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు కేసేంటి
గత వారం చీఫ్ జస్టిస్ అన్నారని చెబుతూ కొన్ని వార్తలు ప్రచురితం అయ్యాయి. బాధితురాలని పెళ్లి చేసుకోవాలని సుప్రీంకోర్టు అత్యాచార నిందితుడిని ఆదేశించిందని వాటిలో రాశారు.
నిజానికి, గత వారం సుప్రీంకోర్టులో మరో అత్యాచారం కేసులో విచారణ జరుగుతోంది. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక మైనర్ బాలికపై చాలాసార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని మీరు అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోబోతున్నారా అని చీఫ్ జస్టిస్ అడిగారు.
ఔరంగాబాద్ బెంచ్ పిటిషనరుకు సెషన్ కోర్ట్ ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. చీఫ్ జస్టిస్ బాబ్డే పిటిషనర్ లాయర్‌తో "ఆయన ఆమెను పెళ్లి చేసుకుంటారా" అని అడిగారు. దానికి లాయర్, "నేను ఆయన సూచనలు తీసుకుంటాను" అన్నారు.
దీనిపై చీఫ్ జస్టిస్ బోబ్డే, "యువతిపై అత్యాచారం, లైంగిక వేధింపులకు ముందు మీరది ఆలోచించి ఉండాల్సింది. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అని మీకు తెలుసు" అన్నారు.
తర్వాత న్యాయస్థానం పిటిషనరు అరెస్టుపై స్టే ఇచ్చింది. నాలుగు వారాల ఇంటెరిమ్ రిలీఫ్ ఇచ్చింది. అయితే, పిటిషనరు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు.
ఇవి కూడా చదవండి:
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








