కమలం: డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చిన గుజరాత్

ఫొటో సోర్స్, Getty Images
డ్రాగన్ అంటే "చైనా గుర్తుకొస్తోందంటూ" ఆ పండు పేరును ‘కమలం’గా మార్చాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు, కార్టూన్లు వెల్లువెత్తుతున్నాయి.
డ్రాగన్ చిహ్నానికి చైనా జానపద సాహిత్యంలోనూ, పురాణాల్లోనూ ప్రముఖ పాత్ర ఉందన్న సంగతి తెలిసిందే!
డ్రాగన్ ఫ్రూట్‌ను ఇకపై ‘కమలం’ అని పిలవనున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు.
కమలానికి హిందూ మతంలో పవిత్రమైన స్థానం ఉంది. అంతే కాకుండా, కమలం భారత జాతీయ పుష్పం కూడా.
హిమాలయా సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఇటీవల రేగిన ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి.
డ్రాగన్ ఫ్రూట్ మధ్య అమెరికానుంచి వచ్చిన పండు అయినా, డ్రాగన్ అనే పేరువలన దీన్ని చైనాకు సంబంధించిన పండుగా అనేకమంది భారతీయులు భావిస్తుంటారు.
భారత్, చైనాలను తరచుగా ఏనుగు, డ్రాగన్‌లతో పోల్చి చెబుతుంటారు.
నిజానికి ఈ పండును దక్షిణ అమెరికానుంచీ అధికంగా దిగుమతి చేసుకుంటారు.
అయితే, గత కొద్ది సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్‌ను ఇండియాలో కూడా పండించడం ప్రారంభించారు. అనేక రాష్ట్రాలతో సహా గుజరాత్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటలున్నాయి.
ఇది ముళ్లజెముడు (కాక్టస్) కుటుంబానికి చెందిన చెట్టు. ఈ పండు పైన ఉన్న తొక్క పొరలు పొరలుగా ఉంటూ ముళ్లల్లా బయటకి పొడుచుకొచ్చి..డ్రాగన్ ఆకారాన్ని తలపిస్తున్నట్లు ఉంటుంది కాబట్టి దీనికి డ్రాగన్ ఫ్రూట్ అనే పేరు వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
గత ఏడాది వేసవిలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఇండియా, చైనాల మధ్య జరిగిన ఘర్షణల తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు సన్నగిల్లాయి.
2020 జూన్‌లో ఇండియా, చైనాల మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణల తరువాత కూడా చైనా సరిహద్దు నిబంధనలను ఉల్లంఘింస్తోందని, సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు చేపడుతోందని ఇండియా ఆరోపించింది.
ఈ నేపథ్యంలో, డ్రాగన్ ఫ్రూట్ పేరును కమలంగా మారుస్తున్నట్లు రుపానీ మంగళవారం ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ గుర్తు కూడా కమలమే.
"డ్రాగన్ ఫ్రూట్ అనే పేరు సరైనది కాదు. ఆ పేరు వినగానే చైనా గుర్తొస్తుంది. అందుకే దాని పేరును కమలంగా మార్చాం" అని రూపానీ మీడియాకు తెలిపారు.
రూపానీ ప్రకటనతో సోషల్ మీడియాలో మీమ్స్, కార్టూన్లు వరదలా పొంగుకొచ్చాయి. ఇది ఒక అర్థం పర్థం లేని చర్య అని, ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చదని పేర్కొంటూ అనేకమంది సరదాగా కామెంట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కొంతమంది ‘పాపం డ్రాగన్ ఫ్రూట్’ అంటూ సానుభూతి తెలిపారు.
బీజేపీ నగరాల, ప్రాంతాల పేర్లను మారుస్తూ ఇప్పుడు పండ్ల పేర్లను కూడా మార్చేస్తోందంటూ జోకులు వేసారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారతదేశంలో ముస్లిం పరిపాలన గుర్తులను చెరిపి వేసే దిశలో పాలక బీజేపీ పార్టీ నగరాల పేర్లను మారుస్తున్న విషయం తెలిసిందే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘పేరు మార్చడంతో సరిపెట్టారు..పండు తినడం నిషేధించలేదు, అంది కొంత ఊరట అంటూ’ ఒక ట్విట్టర్ యూజర్ సంతోషం వ్యక్తం చేశారు. భద్రత, గోప్యత సమస్యలు వస్తున్నాయంటూ గత జూన్‌నుంచీ భారత ప్రభుత్వం అనేక చైనా యాప్‌లను నిషేధించింది.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరీస్‌లో ఖలీసి, తన డ్రాగన్‌ను గుర్తు చేసుకుంటూ..."కమలంతో ఖలీసి" అంటూ జోకులు వేసారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీలో వారసురాళ్లొస్తున్నారు: రాజకీయ కుటుంబాల్లో కూతుళ్లు, కోడళ్లకు పెరుగుతున్న ప్రోత్సాహం...
- ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలోని మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?
- శివానీ కటారియా: సమ్మర్ క్యాంపు నుంచి సమ్మర్ ఒలింపిక్స్ దాకా...
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: భారత క్రికెట్‌ను మార్చిన ఒక మ్యాచ్ కథ
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- చైనాలో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన బీబీసీ బృందాన్ని ఎలా వెంటాడారంటే..
- కరోనా వ్యాక్సీన్ కోసం చైనాను నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది?
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








