సెంట్రల్ విస్టా: ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం దూకుడు.. సుప్రీంకోర్టు అసంతృప్తి

కొత్త పార్లమెంటు భవనం

ఫొటో సోర్స్, @LOKSABHASPEAKER

ఫొటో క్యాప్షన్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే కొత్త పార్లమెంటు భవనం నమూనా

దేశ రాజధాని దిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం దూకుడు చూపించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

కేంద్రం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయవచ్చని, కానీ దీని నిర్మాణ పనులపై ముందుకు వెళ్లకూడదని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం నిర్దేశించింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 10వ తేదీన శంకుస్థాపన చేయబోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ దేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దిల్లీలోని లుట్యెన్స్ జోన్‌లో కేంద్రం నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సవాలు చేస్తూ కొన్ని వేల పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రాజెక్టు పలు నిబంధనలను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు.

ఈ అంశంపై విచారించిన సుప్రీంకోర్టు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలో ఉన్న చెట్లను కూల్చడం లేదా నరికివేయడం, భవనాల నిర్మాణం ఏవీ చేపట్టరాదని నిర్దేశించింది.

దీనిపై వచ్చిన వేలాది పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్మాణంపై ముందుకు వెళ్తున్న కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిందని ఏఎన్ఐ కూడా తెలిపింది.

ఇటీవలి కొన్ని పరిణామాలతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా విచారణకు స్వీకరించింది.

న్యాయస్థానం సూచనల మేరకు అక్కడ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలూ ఉండవని సొలిసిటర్ జనరల్‌ చెప్పారు. ఈ కేసులన్నింటిలో తీర్పు వచ్చేవరకూ.. అక్కడ ఉన్న చెట్లను వేరే ప్రాంతాలకు తరలించడం, ఆ ప్రాంతాల్లోని ఏవైనా నిర్మాణాలనూ కూల్చివేయడం, వాటి స్వభావం మార్చడం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

ఈ స్టేట్‌మెంటును నమోదు చేసినట్లు సుప్రీంకోర్టు చెప్పింది.

ఈ అంశాలను గమనంలో ఉంచుకుని.. ఆ ప్రాంతాల్లో స్థితిని ఏమాత్రం మార్చకుండా 2020 డిసెంబర్ 10న నిర్దేశించిన భూమిపూజ కార్యక్రమంతో పాటు, విధానపరమైన ప్రక్రియలను అధికారులు కొనసాగించవచ్చని ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు

ఫొటో సోర్స్, hcp design

ఏమిటీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు?

దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం తలపెట్టిన ప్రాజెక్ట్ పేరే 'సెంట్రల్ విస్టా'. దీని వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా చెప్తున్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది.

ఈ ప్లాన్‌లో ఒక కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరించడం ఉంది.

కొత్త పార్లమెంట్ భవనంలో భారత ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రదర్శించేలా ఒక భారీ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, ఒక లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్లేసులు ఉంటాయి.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసం, కార్యాలయాన్ని కూడా సౌత బ్లాక్‌కు దగ్గరకు, ఉపరాష్ట్రపతి కొత్త నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలోకి తరలించే అవకాశం ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

డిసెంబర్ 10న కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన

కొన్ని నెలల అనుమతుల ప్రక్రియలు, కోర్టు ప్రక్రియల తర్వాత, చివరికి మోదీ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమైంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం కొత్త పార్లమెంటు భవనం శంకుస్థాపన తేదీ గురించి ప్రకటించారు.

మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే కొత్త పార్లమెంటు భవనం భారతదేశపు భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా ఆత్మనిర్భర్ భారత్ దేవాలయంలా ఉంటుందని ఆయన అభివర్ణించారు.

అందులో లోక్‌సభ సభ్యుల కోసం సుమారు 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326 కన్నా ఎక్కువ సీట్లు ఉంటాయని వివరించారు. లోక్‌సభలో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుందని తెలిపారు.

భారత స్వాతంత్ర్యానికి 75వ వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో ఉభయసభల సమావేశాలను ప్రారంభిస్తామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.

శనివారం ఈ ప్రాజెక్ట్ గురించి ట్వీట్ చేసిన ఓం బిర్లా ప్రధాని కొత్త పార్లమెంట్ భవనానికి డిసెంబర్ 10న భూమిపూజ చేస్తారని ప్రకటించారని ఏఎన్ఐ తెలిపింది. ఇదే ఏడాది దీని నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.

ఈ భవనం నిర్మాణం కాంట్రాక్టును ఇదే ఏడాది సెప్టెంబర్‌లో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు

ఫొటో సోర్స్, HCL Design

ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది ఎప్పుడు?

2020 అక్టోబర్‌లో లోక్‌సభ సెక్రటేరియట్ వివరాల ప్రకారం కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలై, 2022 అక్టోబర్ నాటికి పూర్తి కావచ్చు.

కొత్త భవనం ఎందుకన్న తృణమూల్ ఎంపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి హర్దీప్ పురి, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో ఉన్న వసతులు, సౌకర్యాలు 93 ఏళ్ల పురాతనమైనవని, పార్లమెంట్ ప్రస్తుత డిమాండుకు అవి తగినట్లు లేవని చెప్పారు.

"లోపల తగినంత ఆఫీస్ స్పేస్ లేదు. ఎంపీలకు వ్యక్తిగత చాంబర్లు కూడా లేవు. ఈ భవనం ఉభయ సభల పార్లమెంటుకు ఉద్దేశించినది కాదు. ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున మరమ్మతులు జరగడం వల్ల దానిపై చాలా ఒత్తిడి ఉంది. కొత్త భవనంలో మెరుగైన సీటింగ్ సామర్థ్యం ఉంటుంది" అని కూడా పురి చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అందిస్తుందని, రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకూ విస్తరించిన ప్రాంతాన్ని సందర్శించే పర్యటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు.

పార్లమెంటు

పాత భవనం చరిత్ర ఏమిటి?

ప్రస్తుతం ఉన్న బ్రిటిష్ కాలం నాటి పార్లమెంటు భవనానికి న్యూదిల్లీ రూపకర్తలు ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్ డిజైన్ చేశారు.

ప్రస్తుత పార్లమెంట్ భవనానికి 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.

అప్పట్లో దీనికి 83 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. దీనిని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు.

ప్రస్తుత పార్లమెంట్ భవనం వృత్తాకారంలో 560 అడుగుల వ్యాసార్థంతో ఉంటుంది.

పార్లమెంటు హౌస్ ఎస్టేట్‌ను ఎర్రటి శాండ్‌స్టోన్‌తో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసివేసేలా ఇనుప గ్రిల్స్, ఇనుప తలుపులతో నిర్మించారు. దీనికి మొత్తం 12 గేట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)