పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం': సీపీఐ నేత కె.నారాయణ

ఫొటో సోర్స్, Facebook
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించినట్లు 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. పవన్‌తో పొత్తు పెట్టుకున్నందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని నారాయణ విచారం వ్యక్తంచేశారు.
రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేసిందంటూ విశాఖలో మంగళవారం వామపక్షాలు ఆందోళన చేశాయి.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఆనాడు తమతో పొత్తు పెట్టుకున్న పవన్.. నేడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నాడని విమర్శించారు.
అతనికి వ్యక్తిత్వమే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

నేటి నుంచి పట్టభద్రుల ఓటు నమోదు..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రులు ఓటుహక్కు కోసం గురువారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అర్హత ఉన్న పట్టభద్రులు ఫామ్-18 ప్రకారం తమ పేర్లను నమోదుచేసుకోవాలి. అన్ని వివరాలతో నింపిన దరఖాస్తులను అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్, డిజిగ్నేటెడ్ అఫీసర్లకు అందజేయాలి. రెండు నియోజకవర్గాల పరిధిలోని జిల్లాల్లో ఉన్న ఆర్డీవోలు, తాసిల్దార్లు, డిప్యూటీ కమిషనర్లను సహాయ ఓటరు నమోదు అధికారులుగా.. డిప్యూటీ తాసిల్దార్లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లను డిజిగ్నేటెడ్ ఆఫీసర్లుగా నియమించారు.
ఓటరు నమోదుకు అర్హతలు
- దరఖాస్తుదారు సంబంధిత పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో నివసిస్తూ ఉండాలి.
- 2020 నవంబర్ 1 నాటికి కనీసం మూడేండ్ల ముందు విద్యార్హత సాధించి ఉండాలి.
- దరఖాస్తుకు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అతికించాలి. విద్యార్హతకు సంబంధించిన డిగ్రీ/ డిప్లొమా సర్టిఫికెట్/ మార్కుల జాబితా, లేక ఇతర ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. వాటిపై డిజిగ్నేటెడ్ ఆఫీసర్/ గెజిటెడ్ ఆఫీసర్/ నోటరీ పబ్లిక్ అటెస్టెడ్ చేయించి జతచేయాలి.
- రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.ceotelangana.nic.in ద్వారా కూడా ఓటరుగా నమోదు కావచ్చు.
- గతంలో పట్టభద్రుల ఓటరుగా ఉన్నవారు సైతం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఓటర్ల జాబితా ఇప్పుడు పనికిరాదు.
దరఖాస్తుల షెడ్యూల్ వివరాలు:
- పెద్దమొత్తంలో వచ్చే దరఖాస్తులు, పోస్టు ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.
- ఫామ్-18 ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు 2020 నవంబర్ 6 చివరి తేదీ.
- ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్ 1వ తేదీన ప్రచురిస్తారు.
- క్లెమ్‌లు, అభ్యంతరాల స్వీకరణను డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు చేపడతారు.
- కైమ్‌లు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే జనవరి 12లోగా పరిష్కరిస్తారు.
- ఓటర్ల తుది జాబితాను జనవరి 18న ప్రచురిస్తారు.

ఫొటో సోర్స్, EPA
రిలయన్స్ రిటైల్‌లో జనరల్ అట్లాంటిక్ పెట్టుబడులు
అంతర్జాతీయ పీఈ దిగ్గజం జనరల్ అట్లాంటిక్.. రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో 0.84 శాతం వాటాను రూ. 3,675 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) వెల్లడించినట్లు 'ఆంధ్రజ్యోత' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రిలయన్స్ రిటైల్‌లోకి వచ్చిన మూడో పీఈ పెట్టుబడి ఇది. తొలుత అమెరికన్ పీఈ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ రూ. 7,500 కోట్లకు 1.75 శాతం వాటా కొనుగోలు చేసింది. మరో అంతర్జాతీయ పీఈ సంస్థ కేకేఆర్ అండ్ కో 1.28 శాతం వాటా కోసం రూ. 5,500 కోట్ల పెట్టుబడులు పెడుతోంది.
తాజా ఒప్పందం సందర్భంగా రిలయన్స్ రిటైల్ మార్కెట్ విలువను రూ. 4.285 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. జనరల్ అట్లాంటిక్‌కు రిలయన్స్ సంస్థల్లో ఇది రెండో పెట్టుబడి. ఆర్‌ఐఎల్‌కు చెందిన డిజిటల్ సేవల కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లోనూ రూ. 6,598.38 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మొత్తం 13 మంది ఇన్వెస్టర్లకు 30 శాతం పైగా వాటా విక్రయం ద్వారా జియో ప్లాట్‌ఫామ్ రూ.1.52 లక్షల కోట్లు సేకరించింది.
సిల్వర్ లేక్ సహ ఇన్వెస్టర్లు కూడా రూ. 1,875 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. దాంతో సిల్వర్ లేక్ మొత్తం పెట్టుబడులు రూ.9,375 కోట్లకు చేరుకున్నాయి.

ఫొటో సోర్స్, Ttd
టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ బదిలీ
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారని ఈనాడు ఒక కథనంలో చెప్పింది.
ఆ కథనం ప్రకారం.. సింఘాల్‌ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఇన్‌చార్జి ఈవోగా నియమించింది.
అనిల్‌కుమార్ సింఘాల్‌ను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనిల్‌కుమార్ సింఘాల్ ఈవోగా రాకముందు దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు. 2017 మేలో ఆయన టీటీడీ ఈవోగా వచ్చారు.
2019లో రెండేళ్ల కాలపరిమితి పూర్తయిన తర్వాత ప్రభుత్వం మరో ఏడాది పాటు ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించింది. గత కొంత కాలంగా ఆయన బదిలీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం ఉద్యమంతో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది
- అయోధ్య రామమందిరం: మోదీ ముఖ్య అతిథిగా శంకుస్థాపన...ఇది భారత్ స్వరూపాన్నే మార్చేస్తుందా?
- అయోధ్య రామ మందిరం: స్థలం చదును చేస్తున్నప్పుడు దొరికిన అవశేషాలతో కొత్త వివాదం
- అయోధ్య: బాబ్రీ మసీదు తాళాలను రాజీవ్‌గాంధీ తెరిపించారా? ఏం జరిగింది?
- రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్
- కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- అయోధ్య తీర్పు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








