నటి పాయల్ ఘోష్: ‘‘అనురాగ్ కశ్యప్ నాపై లైంగిక దాడి చేశారు’’

ఫొటో సోర్స్, @iampayalghosh
చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి పాయల్ ఘోష్ ఆరోపించారు.
"అనురాగ్ కశ్యప్ నాపై బలాత్కారం చేశారు. నరేంద్ర మోదీజీ, మీరు ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఒక సృజనశీలి వెనక ఉన్న అసలు నిజాలేంటో దేశానికి తెలియజేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ విషయం చెప్పడం వల్ల ఆయన నుంచి నాకు ప్రమాదం ఉంటుంది. దయచేసి సహాయం చెయ్యండి'' అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పాయల్ ట్వీట్‌ను నటి కంగనా రనౌత్ రీట్వీట్ చేశారు, #MeToo అనే హ్యాష్‌ట్యాగ్ తో “ప్రతి గొంతు ముఖ్యమైనదే. అనురాగ్ కశ్యప్‌ను అరెస్ట్ చేయండి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పాయల్ ఘోష్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ దీనిపై సమాచారం ఇవ్వాల్సిందిగా పాయల్‌ను కోరారు. "మీరు మీ ఫిర్యాదును [email protected], @NCWIndia ద్వారా నాకు పంపవచ్చు’’ అని రేఖాశర్మ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
తన ట్వీట్‌ను సుమోటో ఫిర్యాదుగా స్వీకరించడంపై పాయల్ ఘోష్ రేఖాశర్మకు ధన్యవాదాలు తెలిపారు. వివరాలు పంపిస్తానని చెప్పారు.

అనురాగ్ కశ్యప్ స్పందన ఏంటి?
ఈ వ్యవహారంపై అనురాగ్ కశ్యప్ రాత్రి 12.38 నిమిషాలకు హిందీలో నాలుగు ట్వీట్ల ద్వారా స్పందించారు. “భలే చెప్పారు. నా నోరు మూయించడానికి చాలా సమయం పట్టినట్టుంది’’ అని రాశారు.
“నా నోరు మూయించడానికి ఒక మహిళ మరో మహిళతో అబద్ధం చెప్పించారు. ఆమె ఇతర మహిళలను కూడా వివాదాల్లోకి లాగారు. కొంచె మర్యాద కాపాడుకోండి మేడం. మీ ఆరోపణలన్నీ అబద్ధాలు’’ అని కశ్యప్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
“నాపై ఆరోపణలు చేసేటప్పడు నాతో పని చేసే యాక్టర్లను, అమితాబ్ కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం సరి కాదు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారు. అది మా ఇష్ట ప్రకారమే జరిగింది. మా మధ్య ప్రేమ ఉంది, అందుకే పెళ్లి చేసుకున్నాం’’ అని కశ్యప్ అన్నారు.
"నాకు ఒక భార్య ఉందా, ఇద్దరు భార్యలు ఉన్నారా, గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నది అప్రస్తుతం. నేను చాలామంది మహిళలతో కలిసి పని చేస్తుంటాను. చాలామంది మహిళా నటులు తెలుసు. వాళ్లతో కలిసి పదిమందిలో పని చేసినా, ఒంటరిగా పని చేసినా నేనెప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. ఎవరైనా అలా చేసినా నేను సహించను’’ అని తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు కశ్యప్.
"ఏం జరుగుతుందో చూద్దాం. ఆ వీడియోలో ఆమె చెప్పింది ఎంత నిజమో త్వరలోనే తేలుతుంది. ఈ ఆరోపణల నుంచి నేను బైటికి వస్తాను’’ అని కశ్యప్ పేర్కొన్నారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్‌లో ఆరోపణలు పెరిగాయి. వర్గాలుగా మారి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
నటి రియా చక్రవర్తిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం కేసు పెట్టింది. అప్పటి నుండి ఒక వర్గానికి రియా చక్రవర్తి టార్గెట్ అయ్యారు. మీడియా కోర్టులా వ్యవహరిస్తోందని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.
వివాదాలతో బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. అనురాగ్ కశ్యప్ ఈ వివాదంలో కేంద్ర బిందువుగా మారారు. నటి కంగనా రనౌత్ ఆయనపై విమర్శలు చేస్తున్నారు. అనురాగ్, కంగనల మధ్య తరచూ సోషల్ మీడియాలో వాదోపవాదాలు జరుగుతున్నాయి.
ఎవరీ పాయల్ ఘోష్?
2017లో 'పటేల్ పంజాబీ షాదీ' చిత్రంలో నటుడు పరేష్ రావల్ కుమార్తెగా తొలిసారి కనిపించారు పాయల్. ఆమె బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించలేదు. దక్షిణాదిలో కొన్ని సినిమాలలో, ఎక్కువగా తెలుగులో.. ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్, ప్రయాణం సినిమాల్లో నటించారు. సాథ్ నిభానా సాథియా2 అనే టెలీవిజన్ షోలో ఆమె కనిపించారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా చిన్నప్పుడు తాలిబన్లు మా అమ్మను కొరడాతో కొట్టారు.. ఇప్పుడు బీబీసీ రిపోర్టర్‌గా ప్రశ్నించా’
- ఇమ్రాన్ ఖాన్ వ్యతిరేక యాత్ర 'ఆజాదీ మార్చ్'లో మహిళలు ఎందుకు లేరు
- కంగనా రనౌత్ వెనుక ఎవరున్నారు? ఎవరి అండతో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ‘డిక్లరేషన్’ నిబంధన ఎప్పుడు, ఎలా మారింది? మార్చే అధికారం ఎవరిది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)