పిడుగులు పడి బిహార్‌లో 83 మంది, ఉత్తరప్రదేశ్‌లో 24 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు పరిహారం ప్రకటించిన నితీశ్ కుమార్

బిహార్

ఫొటో సోర్స్, ABHIJEET

బిహార్‌లో పిడుగులు పడడంతో అధికారిక సమాచారం ప్రకారం 83 మంది మృతిచెందారు. రాష్ట్రంలో పిడుగుపాటుకు మృతి చెందిన 83మందిలో ఒక్కొక్కరికి రూ.4 లక్షల రూపాయల పరిహారంగా ఇవ్వనున్నామని రాత్రి తొమ్మిదిన్నరకు బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.

ఇటు ఉత్తరప్రదేశ్‌లోనూ పిడుగుపాట్లకు 24 మంది చనిపోయారు.

బిహార్‌లోని వివిధ జిల్లాల నుంచి అందిన మృతుల సమాచారాన్ని విపత్తు నిర్వహణ విభాగం విడుదల చేసింది.

బీహార్

విపత్తు నిర్వహణ విభాగం వివరాల ప్రకారం రాష్ట్రంలో పిడుగుపాటుకు అత్యధికంగా గోపాల్‌గంజ్‌లో 13మంది చనిపోయారు. బిహార్‌లో సుమారు 23 జిల్లాల్లో పిడుగుల వర్షం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించింది.

గోపాల్‌గంజ్ తర్వాత మధువనిలో 8 మంది, నవాదాలో 8 మంది, సివాన్‌లో ఆరుగురు, భాగల్పూర్‌లో ఆరుగురు, దర్భంగాలో ఐదుగురు, బాంకాలో ఐదుగురు, పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఇద్దరు చనిపోయినట్లు విపత్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"మిగతా అన్ని జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం గురించి సమాచారం సేకరిస్తున్నాం. చాలా జిల్లాల్లో పిడుగుల ప్రభావం ఉంది, కాబట్టి నష్టం ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు'' అని బీహార్ విపత్తు నిర్వహణ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రత్యయ అమృత్ బీబీసీతో అన్నారు. "రాబోయే కొద్ది రోజులు వాతావరణం అలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాబట్టి ప్రజలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షం, పిడుగులు పడే సమయంలో బయట ఉండకూడదనే జాగ్రత్తలను పాటించాలి'' అని ప్రత్యయ అమృత్‌ అన్నారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రాష్ట్రంలో పిడుగుల వర్షానికి ప్రజలు మృతిపై విచారం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఉత్తరప్రదేశ్‌లోనూ పిడుగుపాటు.. 24 మంది మృతి

బిహార్‌తోపాటూ ఉత్తరప్రదేశ్‌లో కూడా పిడుగులు పడడంతో 24 మంది మరణించారని బీబీసీ ప్రతినిధి సమీరాత్మజ్‌ మిశ్రా తెలిపారు. అనేకమంది గాయపడ్డారు.

బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో పిడుగుపాటుకు జరిగిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా విచారం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ ఘటనలపట్ల తీవ్ర సంతాపం తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో పశువులు కూడా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. యూపీ రిలీఫ్ కమిషనర్ సంజయ్ గోయల్ బీబీసీతో మాట్లాడారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

"పిడుగుల వల్ల ఈ ఒక్కరోజే 24 మంది చనిపోయారు. దేవరియా జిల్లాలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ ఆరుగురు చనిపోయారు" అని సంజయ్ గోయల్ వెల్లడించారు.

మరోవైపు రాబోయే మూడు రోజుల్లో బీహార్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పాట్నా హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక ప్రకారం, అనేక జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)