హెచ్1బి వీసాల నిలిపివేత: భారతీయుల 'డాలర్‌ డ్రీమ్స్' చెదిరిపోతాయా?

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, వాషింగ్టన్ డీసీ నుంచి బీబీసీ ప్రతినిధి

హెచ్‌1-బి, ఇతర వర్క్‌ వీసాలపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది భారతీయ టెక్కీలు, ఉద్యోగుల భవితవ్యం డైలమాలో పడింది.

ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లిన వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం కేవలం ఒక హెచ్‌1బి వీసాలపైనే కాకుండా పలు వీసాదారుల భవితవ్యాన్ని కూడా అయోమయంలో పడేసింది.

టెక్సాస్‌లోని డల్లాస్‌లో నివసిస్తున్న వినోద్‌కుమార్ తాను ఏ క్షణంలోనైనా దేశం విడిచి వెళ్లాల్సి రావచ్చని భయపడుతున్నారు.'' అమెరికాలో స్థిరపడాలని నేను కలలుగన్నాను. కానీ ఇప్పుడు భయభయంగా బతుకుతున్నాను'' అని వినోద్‌ అన్నారు.

ఏడాదిన్నర కిందట వినోద్‌ యూరప్‌ నుంచి అమెరికా వచ్చారు. ఆయన ఇక్కడున్న సమయంలోనే కొడుకు పుట్టాడు. హెచ్‌1-బి వీసాపై ఆయన ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ''మెరుగైన జీవితం కోసం నేను ఇక్కడకు వచ్చాను'' అని వినోద్‌ చెప్పారు.

వినోద్ కుమార్

ఫొటో సోర్స్, Vinod kumar

ఫొటో క్యాప్షన్, వినోద్ కుమార్

తాజాగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వినోద్‌లాంటి ఎందరో భారతీయ ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టింది. స్వదేశం వెళ్లిపోవాలా, ఇక్కడే ఉండిపోవాలా అన్న సందేహం వాళ్లను పీడిస్తోంది. మరి వీళ్లను వెళ్లకుండా ఆపగలిగేది ఏంటి? ''మా ఆఫీసు లాయర్లు ఇప్పుడు అమెరికాను దాటి వెళ్లడం మంచిది కాదని సూచించారు '' అని శివ అనే ఐటీ నిపుణుడు చెప్పారు. ఆయన తన ఇంటిపేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

ట్రంప్‌ ఇచ్చిన ఆర్డర్‌ ఇప్పుడు అనేకమంది భారతీయులకు సమాధానం దొరకని ప్రశ్నలను మిగిల్చాయి. అందుకే గ్రెగ్‌ సిస్‌కిండ్‌ లాంటి లాయర్లు తమ క్లయింట్ల నుంచి వచ్చే అనేక సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తోంది.

''ఒకవేళ ప్రధాన వీసా దరఖాస్తుదారు అమెరికాలో ఉండి, వారి భాగస్వామి లేదా పిల్లలు అమెరికా వెలుపల ఉంటే వారికి ఏం జరుగుతుంది? అమెరికాకు తిరిగి రావాలంటే భాగస్వామి, వారి సంతానం ఈ ఏడాది చివరకు వరకు వేచి చూడాల్సిందేనా? లాంటి ప్రశ్నలు వీటిలో ఉన్నాయని సిస్‌కిండ్‌ వెల్లడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

''నా భర్త హెచ్‌1బి వీసా మీద అమెరికాలో ఉన్నారు. నేను నా కూతురు నాలుగు నెలలుగా ఇక్కడ చిక్కుకు పోయాం. ఏప్రిల్‌లో హెచ్‌4 వీసా స్టాంపింగ్‌ అప్పాయింట్‌మెంట్‌ ఉంది. ఎంబసీ తెరుచుకుంటుందని ఎదురు చూస్తున్నాం. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల కారణంగా నేను అమెరికా వెళ్లగలనా?'' అని రూపాన్షి అనే మహిళ ట్విటర్‌లో ప్రశ్నించారు.

ఇమ్మిగ్రేషన్‌ మీద అయోమయంతో వినోద్‌ స్నేహితులు కొందరు స్వదేశానికి తిరిగి వచ్చారు. ''అమెరికా ఎంతో బాగుంటుందని నా స్నేహితులు కొందరు కెనడా నుంచి ఇక్కడికి వచ్చారు. అమెరికాలో ఉండాలన్నది వాళ్ల కల. కానీ తిరిగి వెళ్లిపోయారు'' అని వినోద్‌ వెల్లడించారు.

''అక్కడ పన్నులు ఎక్కువైనా, వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ (కెనడాలో) మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కాని ఇక్కడ(అమెరికాలో) ఆ పరిస్థితి లేదు. నేనిక్కడ పరదేశీలాగే మిగిలిపోయాను. ఇక్కడ దేనితోనూ నాకు అనుబంధం లేదు'' అని వినోద్‌ అన్నారు. ''గూగుల్ లోని సీనియర్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ నుంచి నాకు ఇప్పుడే ఒక ఈ-మెయిల్‌ వచ్చింది. ఆయన స్వదేశానికి వెళ్లిపోతున్నారట'' అని ఓ వక్తి తనకు మెసేజ్‌ చేసినట్లు వినోద్‌ వెల్లడించారు.

గ్రెగ్‌ సిస్‌కిండ్‌

ఫొటో సోర్స్, Greg Siskind

ఫొటో క్యాప్షన్, గ్రెగ్‌ సిస్‌కిండ్‌

వీసాల సస్పెన్షన్‌ నిర్ణయం వల్ల అమెరికాకు ఎంతో మేలు జరుగుతుందని ట్రంప్‌ ప్రభుత్వం చెబుతుండగా ఇది వాస్తవంకాదని గ్రెగ్‌ సిస్‌కిండ్‌లాంటి వారు వాదిస్తున్నారు.'' ఇది అమెరికా ఆర్ధిక ప్రగతిని దెబ్బతీస్తుంది. దీనివల్ల అమెరికన్లకు అవకాశాలు ఇంకా తగ్గుతాయి'' అని సిస్‌కిండ్‌ అన్నారు. ''దేశ ఆర్దిక ప్రగతి కోసం ఇలాంటి నిర్ణయం ఈ సమయంలో తీసుకోవడం మంచిది కాదు '' అని ఇమ్మిగ్రేషన్‌ నిపుణుడు డేవిడ్‌ బైయర్‌ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

గూగుల్‌తో పాటు యాపిల్‌ సంస్థ కూడా ట్రంప్‌ ఆర్డర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం వల్ల హెచ్‌1-బితోపాటు, హెచ్‌2-బి, జే-1, ఎల్‌ వీసాలపై కూడా ప్రభావం పడనుంది. హెచ్‌1-బి వీసాలు టెక్‌ కంపెనీలలో ఉద్యోగులకు, హెచ్‌2-బి వీసాలు సీజనల్‌ వర్కర్స్‌ కు, జే-1 వీసాలు పరిశోధకులు, స్కాలర్లకు, ఎల్‌ వీసాలు కంపెనీలు తమ మేనేజర్లను అమెరికా పంపించడానికి ఉపయోగిస్తుంటాయి. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం వీరందరికీ శరాఘాతం కానుంది.

2019లో అమెరికా 388,403 హెచ్‌1-బి వీసాలివ్వగా, అందులో 278,491 భారతీయులవే. దరఖాస్తు చేసుకున్న వాటిలో దాదాపు 71.7 శాతం వీసాలు ఆమోదం పొందాయి.

అదే 2019లో అమెరికా 77,000 ఎల్‌-1 వీసాలను ఇవ్వగా అందులో 18,350 వీసాలు ఇండియన్లవి. '' మేం ఇక్కడ టాక్సులు కడుతుంటే , ఇండియన్లు, చైనీయులు తమ కుటుంబాలతో వచ్చి అక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటూ మా డబ్బును వాళ్ల దేశాలకు తరలించి ఆస్తులు కొనుక్కుంటున్నారు'' అని ట్రంప్‌ మద్దతుదారు ఒకరు ట్వీట్ చేశారు.

అమెరికాలో ప్రవాసులు

ఫొటో సోర్స్, AFP

అయితే స్థానిక అమెరికన్లను ఆకట్టుకుని వారి మద్దతుతో అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.

అంతేకాదు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

అమెరికాలో ప్రవాసులు

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయం కోర్టుల్లో పరీక్షకు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. ''చట్టాలను తిరగరాస్తూ ప్రభుత్వం తీసుకునే ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయాలను కోర్టులు అడ్డుకోగలవని నేను భావిస్తున్నాను'' అని అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌కు చెందిన జెస్సీ బ్లెస్‌ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు తాను ఇండియాలో జాబ్‌ సెర్చ్‌ చేస్తున్నట్లు చెప్పారు వినోద్‌. ''గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్ల కోసం కంపెనీలు వెతుకుతున్నాయి. దాదాపు పది కంపెనీలు నన్ను సంప్రదించాయి. కానీ తర్వాత వద్దన్నాయి. కారణం నేను హెచ్‌1-బి వీసా హోల్డర్ కావడమే'' అన్నారు వినోద్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)