కరోనావైరస్ హైదరాబాద్: ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి కరోనా... గర్భిణులు, జూడాల అవస్థలు

ఫొటో సోర్స్, Sharad badhe/bbc
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిలో ఎక్కువమంది కరోనాకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రసూతి ఆస్పత్రి కావడంతో, నిత్యం వందల మంది వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. నగరంలో ఉన్న 5 ప్రసూతి ఆస్పత్రుల్లో పేట్లబురుజు చాలా ముఖ్యమైనది. ఇక్కడ రోజుకి సుమారు 70 ప్రసవాలు జరుగుతుంటాయి.
రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు ఆరు లక్షల కాన్పులు అవుతుంటాయని అధికారులు తెలిపారు.
అయితే, ఈ ఆస్పత్రిలోని ఎంత మంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది అనేదానిపై అధికారులు, సూపరింటెండెంట్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
కానీ మే చివరి వారంలో ఒక గర్భిణికి సి-సెక్షన్ చేసే క్రమంలో ఆమె నుంచి ఆస్పత్రిలో వారికి వైరస్ వ్యాపించిందని డాక్టర్లు చెబుతున్నారు. అప్పటి నుంచి ఆస్పత్రికి సిబ్బందికి చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని కూడా తెలిపారు.

ఫొటో సోర్స్, Sharad badhe/bbc
మాపై ఒత్తిడి పెరుగుతోంది: జూడాలు
పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలోనే కాదు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్లకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది.
"ఇంతకు ముందు కంటే ఎక్కువ సమయం డ్యూటీ చేయాల్సి వస్తోంది. మాకే కాదు, మా కుటుంబ సభ్యులకు కూడా వైరస్ ప్రమాదం ఉంది. ఇళ్ళకి వెళ్లాలంటే భయం వేస్తోంది. వెళ్ళినా ఒకే గదికే పరిమతం అవుతున్నాము” అని ఒక జూనియర్ డాక్టర్ చెప్పారు.
ఆస్పత్రిలోని కొంత మంది వైద్య సిబ్బందికి కరోనా సోకటంతో, మిగతావారిపై బాధ్యత పెరిగిందని జూనియర్ వైద్యులు చెబుతున్నారు. కొన్నిరోజుల్లో పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"మా పై గత మూడు నెలలుగా పని ఒత్తిడి పెరిగింది, మాలో కొంత మందికి కొరోనా సోకడం, ఇలా ఎన్నో ఒత్తిళ్లలో పరీక్షలు సరిగా రాయలేమేమో అనిపిస్తోంది. ఒక వేళ సరిగా రాయలేక పోతే, మా భవిష్యత్తు మరింత దారుణంగా మారుతుంది. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నాము" అని మరో జూనియర్ డాక్టర్ బాధపడ్డారు.
ఒక వైపు పెరుగుతున్న ఒత్తిడి, మరో వైపు ఆస్పత్రులలో సిబ్బంది అంతంత మాత్రంగానే ఉండడంతో, ఆ ప్రభావం ఆరోగ్య సేవలపై పడింది.
ఉదాహరణకు ప్రసూతి ఆస్పత్రులలో పేట్లబురుజు, అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి అత్యంత ముఖ్యమైనవి. వీటితో పాటు, గాంధీలో కూడా గర్భిణులు పరీక్షలు చేయించుకుంటారు. కానీ, ఇప్పుడు దానిని కరోనా రోగుల కోసమే కేటాయించటంతో గర్భిణుల కేసులను అఫ్జల్‌గంజ్ ఆస్పత్రిలో ప్రత్యేక బ్లాక్‌కు తరలించారు. దీంతో వైద్య సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.

ఫొటో సోర్స్, TSMSIDC
50 శాతం సిబ్బందితో సేవలు
గాంధీ ఆస్పత్రిలో 12 మంది డాక్టర్లు, ఆరుగురు వైద్య సిబ్బందికి కరోనా సోకినట్టు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారాం రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు.
"గాంధీలో సుమారు 1100 మంది డాక్టర్లు, 550 మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు. కరోనా వ్యాపించిన కొత్తల్లో మూడో వంతు సిబ్బందితోనే వైద్య సేవలు అందించాం.. కానీ కేసులు పెరుగుతుండడంతో ఇప్పుడు 50 శాతం సిబ్బందితో పని చేస్తున్నాము. ఈ సిబ్బంది మూడు షిఫ్టులలో పని చేస్తారు. వారం తర్వాత వారు క్వారంటైన్‌లో ఉంటారు. అప్పుడు మరో 50 శాతం సిబ్బంది డ్యూటీలోకి వస్తారు” అని ఆయన కోర్టుకు వివరించారు.
మిగతా ఆస్పత్రుల్లో కూడా అదే పద్ధతి అనుసరిస్తున్నామని ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొంత మందికి కరోనా సోకటం వల్ల, ఎదురవుతున్న సిబ్బంది కొరతను భర్తీ చేసేంమదుకు జిల్లాల నుంచి పిలిపించిన డాక్టర్లను తాత్కాలికంగా నియమిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 54 ప్రభుత్వ ఆస్పత్రులను ప్రత్యేకంగా కరోనా చికిత్స కోసమే కేటాయించామని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- ఎల్ చాపో గజ్మన్: ప్రపంచంలోనే అత్యంత పేరుమోసిన నేరస్తుడు
- గ్యాంగ్‌స్టర్ జాన్ డిలింగర్ బాడీని 85 ఏళ్ళ తరువాత సమాధి నుంచి ఎందుకు తవ్వి తీస్తున్నారు?
- ఇది హెలికాప్టర్లలో పరారైన దొంగల కథ - నమ్మలేరు కానీ నిజం
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- వెయ్యి మంది ప్రాణాలు తీసిన హంతకుడు.. కెమెరాల ముందు తన పాత్రలో తనే నటించాడు..
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
- ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








