కరోనావైరస్: 'దిల్లీలో లాక్‌డౌన్ మినహాయింపులు... సిటీ బస్సులో 20 మంది, క్యాబ్‌లో ఇద్దరు, ఆటోలో ఒక్కరు ప్రయాణించాలి' -కేజ్రీవాల్

ఫొటో సోర్స్, ANI
“దిల్లీలో సోమవారం నాటికి మొత్తం 10,054 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 4,485 మంది తిరిగి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇది మొత్తం నమోదైన కేసుల్లో సుమారు 45శాతం” అని సోమవారం నిర్వహించిన డిజిటల్ ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.
"ఇప్పటి వరకు 160 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రోగులు ప్రాణాలను కాపాడేందుకు మేం అన్ని విధాల ప్రయత్నిస్తున్నాం. మిగిలిన చాలా రాష్ట్రాలతో పోల్చితే దిల్లీలో మరణాల సంఖ్య తక్కువే అని చెప్పవచ్చు" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చేంత వరకు కరోనావైరస్‌తో సహజీవనం చెయ్యడం తప్పదని చెప్పిన ఆయన వైరస్‌తో కలిసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలన్నారు. ఇక మనం మన ఆర్థిక వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఆదేశాలను పాటించాలన్నారు.
దిల్లీలో క్యాబ్ సర్వీసులు కేవలం ఇద్దరు ప్రయాణీకులతో తమ సేవల్ని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపారు. క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, పార్కులు, ఆడిటోరియంలు,సెలూన్లు, స్పాలు మాత్రం ప్రస్తుతానికి తెరిచే అవకాశం లేదని అన్నారు. మార్కెట్లను తెరవచ్చని తెలిపిన కేజ్రీవాల్ షాపులు మాత్రం సరి, బేసి విధానాన్ని అనుసరించాలని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అలాగే. ప్రైవేటు కార్యాలయాలు పూర్తి స్థాయిలో పని చేయవచ్చని, మెజారిటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా (వర్క్ ఫ్రమ్ హోం) ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
భవన నిర్మాణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చని అయితే ప్రస్తుతానికి దిల్లీలో ఉన్న కార్మికులను మాత్రమే వినియోగించుకోవాలని తెలిపారు. బస్సు ప్రయాణాలకు అనుమతించిన సీఎం ఒక బస్సులో కేవలం 20 మంది ప్రయాణీకులు మాత్రమే ఉండాలని అన్నారు. అలాగే, బస్సు ఎక్కే ముందు ప్రయాణీకులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లను రవాణా శాఖ చేసుకోవాలన్నారు.
కార్ పూలింగ్‌కు అనుమతి లేదని తెలిపిన సీఎం ఆటో రిక్షాలు, ఈ ఆటోలలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు
- పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- ఇండియా లాక్‌డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల కార్మికుల వేదన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








