కరోనావైరస్‌ను గెలిచిన 113 ఏళ్ళ బామ్మ

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్ దేశం మొత్తం మీద అతి పెద్ద వయస్కురాలిగా భావిస్తున్న 113 ఏళ్ల మరియా బ్రన్యస్... కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారని అధికారులు వెల్లడించారు.
మార్చిలో ఇక్కడ లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం మరియాకు కరోనావైరస్ సోకింది.
స్వల్ప లక్షణాలున్న మరియా కొన్ని వారాలపాటు ఐసోలేషన్‌లో గడిపారు.
1918-19లో ఫ్లూ మహమ్మారి, 1936-1939 స్పానిష్ అంతర్యుద్ధాలనూ మరియా చూశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా, చాలా బాగున్నారు. ఆమె మాట్లాడాలని అనుకుంటున్నారు. ఏం జరిగిందో వివరించాలని అనుకుంటున్నారు" అని ఆమె కుమార్తె ట్వీట్ చేశారు.
మరియా 1907లో మెక్సికోలో జన్మించారు. రెండేళ్ల వయసులో శాన్‌ఫ్రాన్సిస్కోకు ఆమెను తీసుకెళ్లారు. అనంతరం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్నలిస్టు అయిన తన తండ్రితో కెటలోనియా ప్రావిన్స్ గిరోనాకు వచ్చారు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. వారిలో ఒకరికి ఇటీవల 86ఏళ్లు వచ్చాయి. ఆమెకు 11 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. పెద్ద మనవడి వయసు 60. మరియాకు 13 మంది ముని మనవళ్లు కూడా ఉన్నారు.
ఆమె రెండు దశాబ్దాలుగా ఒలాట్ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.
"నేను ఇప్పుడు జీవించడం తప్ప ఇంతేమీ చేయట్లేదు" అని లా వెన్‌గార్డియా పత్రికతో చెప్పారు మరియా.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన ఐదు ఫుడ్ టిప్స్
- ‘వీడియో కాల్లో చూస్తుండగానే అమ్మ తుదిశ్వాస విడిచింది.. ఏడు వేల కిలోమీటర్ల దూరంలో కోవిడ్-19 మా అమ్మ ప్రాణాలు తీసింది’
- Mother's Day: మాతృ దినోత్సవాన్ని మొదలుపెట్టింది ఈమే.. దీన్ని రద్దు చేయాలని మొదట్లోనే డిమాండ్ చేసిందీ ఈమే
- కరోనావైరస్పై అమెరికాలో పరిశోధన చేస్తున్న చైనా సంతతి ప్రొఫెసర్ బింగ్ ల్యూ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందా?
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- కరోనావైరస్: 1918లో ఐదు కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- విశాఖపట్నం గ్యాస్ లీకేజి: ‘‘నాకు పరిహారం వద్దు.. నాకు నా ఇద్దరు పిల్లల్ని, నా భర్తను ఇవ్వండి’’
- కరోనావైరస్: రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం తినాలి? వేటిని దూరం పెట్టాలి?
- కరోనావైరస్: ‘1940లో మా తాతయ్య ఇచ్చిన సలహాలు ఇప్పుడు కూడా పనికొస్తాయా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








