కరోనావైరస్ లాక్‌డౌన్: కర్ఫ్యూ పాస్ చూపించమన్నందుకు కత్తులతో దాడి... తెగిపడిన ఒక పోలీసు అధికారి చేయి

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్ పటియాలా సనోర్ రోడ్ కూరగాయల మార్కెట్‌లో ఆదివారం కొంతమంది నిహాంగ్ సిక్కులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఒక పోలీసు అధికారి చేయి తెగిపోయింది.
ఘటనలో ఒక స్టేషన్ ఇన్‌చార్జ్, కొంతమంది కానిస్టేబుళ్లతోపాటు మండీ బోర్డుకు చెందిన కొందమంది సిబ్బంది కూడా గాయపడ్డారు.
ఈ ఘర్షణ తర్వాత జరిగిన పోలీసుల సోదాల్లో ఏడుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
“పదనైన ఆయుధాలతో దాడి చేయడం వల్ల ఒక పోలీస్ అధికారి చేయి తెగిపోయిందని, ఆయన్ను చికిత్స కోసం చండీగఢ్‌లో ఉన్న పీజీఐ ఆస్పత్రికి పంపించాం” అని డీజీపీ దినకర్ గుప్తా ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆదివారం ఉదయం చిక్ రోడ్‌లో ఉన్న బాల్‌బేడా గ్రామం గురుద్వారా ఖిచ్‌డీ సాహెబ్‌లోని ఐదుగురు నిహాంగ్ సిక్కులు ఒక కారులో కూరగాయల మార్కెట్‌కు వచ్చారని బీబీసీ సహోద్యోగి జర్నలిస్ట్ ఆర్జే సింగ్ చెప్పారు.
కరోనావైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్ ఉండడంతో కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న పోలీసులు వారిని కర్ఫ్యూ పాస్ అడిగారు. దాంతో కారు డ్రైవర్ బారికేడ్లు విరగ్గొట్టి వాహనంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.
దాంతో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో వాహనం నుంచి దిగిన నిహాంగ్ సిక్కులు పదునైన ఆయుధాలతో పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి చేయి తెగిపోయింది.
“పీజీఐ సీనియర్ సర్జన్ ఇప్పుడు తెగిపోయిన పోలీస్ అధికారి చేతిని అతికించే ప్రయత్నం చేస్తున్నారు” అని పంజాబ్ పోలీస్ డీజీపీ దినకర్ గుప్తా చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సాహసంతో వారిని అడ్డుకోడానికి వెళ్లిన మా పోలీసు అధికారి చేయి మళ్లీ అతికించగలరనే ఆశిస్తున్నాం అని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ మందీప్ సింద్ సిద్ధూ చెప్పారు.
పోలీసులు పటియాలాలోని చిక్ రోడ్‌లో ఉన్న బాల్‌బేడా గ్రామంలో గురుద్వారాను చుట్టుముట్టి సోదాలు చేశారు.
ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని, కానీ వారు ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు అని పోలీసులు చెబుతున్నారు. పటియాలా జోన్ ఐజీ జితేంద్ర సింగ్ ఓలఖ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించినపుడు కాల్పులు కూడా జరిగాయనే వార్తలు వస్తున్నాయి.
ఆపరేషన్ తర్వాత నిహాంగ్ దుస్తులు ధరించిన తొమ్మిది మందిని గురుద్వారా నుంచి అరెస్ట్ చేశాం. పోలీసుల కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. అతడికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేబీఎస్ సిద్ధూ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
పోలీసులు సోదాల్లో కొన్ని ఆయుధాలు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నామని ఐజీ జితేంద్ర సింగ్ ఓలఖ్, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ మందీప్ సింగ్ సిద్ధూ ఒక మీడియా సమావేశంలో చెప్పారు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఘటనపై వైరల్ వీడియో
ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక కారు బ్యారికేడ్‌ను విరగ్గొట్టి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే, దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు పరుగులు తీయడం కనిపిస్తోంది.
తర్వాత పదునైన ఆయుధాలతో ఉన్న కొంతమంది నిహంగ్‌లు, పోలీసులతో గొడవ పడుతున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది
- కరోనావైరస్: లాక్‌డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








