దిల్లీ హింస: అల్లరిమూకలను శర్మ, సైఫీ కలిసి ఎలా అడ్డుకున్నారంటే - గ్రౌండ్ రిపోర్ట్

మనోజ్ శర్మ, జమాలుద్దీన్
ఫొటో క్యాప్షన్, మనోజ్ శర్మ, జమాలుద్దీన్
    • రచయిత, ఫైసల్ మహమ్మద్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలోని విజయ్‌పార్క్‌కు వెళ్లే ప్రధాన రహదారి‌లో ఆదివారం మధ్యాహ్నం అల్లరిమూక ఒక్కసారిగా రాళ్లు రువ్వడం మొదలుపెట్టింది. అక్కడున్న దుకాణాలపై దాడులకు తెగబడింది.

అప్పుడు మనోజ్‌శర్మ, జమాలుద్దీన్ సైఫీ ఇద్దరూ కలిసి అక్కడే ఓ చోట కూర్చొని ఉన్నారు.

అప్పటి పరిస్థితుల్లో వారిద్దరి ముందు అక్కడి నుంచి పారిపోవడం తప్ప మరో మార్గం లేదు.

అడ్డగీత
News image
అడ్డగీత

కానీ, కొద్ది సేపట్లోనే వాళ్లిద్దరూ తమ చుట్టుపక్కల ఉన్న జనాన్ని పోగేసుకుని అక్కడికి తిరిగివచ్చారు. అక్కడి అల్లరి మూకను వెనక్కి పారిపోయేలా చేశారు.

ఇంతలోనే అక్కడికి కొన్ని పోలీసు వాహనాలు కూడా చేరుకున్నాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

అల్లరి మూక విధ్వంసానికి పాల్పడిన ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. పగిలిన కిటికీలు, కాలిన మోటార్ సైకిళ్లు, తోపుడు బళ్లు కనిపించాయి.

మేం అక్కడికి వెళ్లేటప్పటికి, పారిశుద్ధ్య సిబ్బంది శిథిలాలు, శకలాలను తొలగిస్తున్నారు.

కర్రలు పట్టుకుని, నినాదాలు చేస్తూ దుండగులు వచ్చారని, పోలీసులు వాళ్లను ప్రేరేపించారని స్థానికుడు అబ్దుల్ హమీద్ ఆరోపించారు.

కాల్పులు కూడా జరిగినట్లు స్థానికులు కొందరు చెప్పారు. వీటిలో ముబారక్ అనే వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఆయన బిహార్‌కు చెందినవారు.

సురేంద్ర రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

విజయ్ పార్క్

అల్లరిమూక ఆదివారం తమ ప్రాంతం లోపలికి రాలేకపోయిందని, మరుసటి రోజు మరోసారి అందుకోసం ప్రయత్నించిందని జమాలుద్దీన్ సైఫీ చెప్పారు.

‘‘స్థానికులతో కలసి మేం ముందుగానే సిద్ధమై ఉన్నాం. ప్రధాన రహదారిని మూసేశాం. అందరం కలిసి ఒక్క చోట కూర్చున్నాం’’ అని వివరించారు.

జమాలుద్దీన్ సైఫీ ఇంటిపై అల్లరిమూక దాడి చేసింది.

మౌజ్‌పుర్ ప్రాంతంలో విజయ్ పార్క్ ఉంది. దిల్లీలో హింస తీవ్రంగా చెలరేగిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.

ఈ చోటుకు మౌజ్‌పుర్-బాబర్‌పుర్ మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంటుంది. దానితో పాటు చుట్టుపక్కల మరో నాలుగు మెట్రో స్టేషన్‌లను భద్రత కారణాల రీత్యా మూసేశారు. మిగతా ప్రాంతాల్లో మెట్రో రైళ్లు సాధారణంగానే నడుస్తున్నాయి.

ఈశాన్య దిల్లో‌లోని మెట్రో స్టేషన్లన్నీ బుధవారం నుంచి మళ్లీ నడుస్తున్నాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

విజయ్ పార్క్‌లో హిందువులు, ముస్లింల ఇళ్లు కలిసే ఉంటాయి.

దేశంలోని చాలా చోట్ల ఉన్నట్లుగానే ఇక్కడ కూడా గుళ్లు, మసీదులు దగ్గరదగ్గరగానే ఉన్నాయి. ఇక్కడి గుడికి, మసీదుకు మధ్య రెండు వీధుల అంతరం ఉంది. ఇలాంటి చోట అల్లర్లు రేగితే, పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

తమ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు కలిసి ఓ శాంతి సంఘం ఏర్పాటు చేసుకున్నామని పవన్ కుమార్ మిశ్రా చెప్పారు. పవన్ కుమార్ ఇక్కడి ఆలయ కమిటీ ట్రస్టీ. గతంలో పోలీసు అధికారిగానూ పనిచేశారు.

‘‘సంఘంలో ఉన్న వాళ్లంతా ఇంటింటికీ వెళ్లారు. వదంతులను నమ్మొద్దని, పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపించొద్దని వాళ్లకు చెప్తూ ఉన్నారు’’ అని పవన్ కుమార్ వివరించారు.

సోమవారం అల్లరిమూక మరోసారి ఈ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన తర్వాత, ఆ మరుసటి రోజు ఇక్కడ ఓ శాంతి ర్యాలీ జరిగింది. వివిధ మతాలకు చెందినవారు ఇందులో పాల్గొన్నారు.

విజయ్ పార్క్

‘రాత్రిళ్లు గస్తీ ఉన్నాం’

ఇక్కడి శాంతి సంఘంలో జుల్ఫికర్ అహ్మద్ కూడా సభ్యుడు.

‘‘స్థానికులమంతా రాత్రంతా వీధుల్లోనే ఉన్నాం. హిందువులు ఎక్కువ ఉండే చోట హిందువులను, ముస్లింలు ఎక్కువ ఉండే చోట ముస్లింలను గస్తీ కాయమని చెప్పాం’’ అని ఆయన అన్నారు.

‘‘అలాంటప్పుడు ఇక్కడికి పోలీసులు రాకపోయినా, ఏమీ కాదు’’ అంటూ స్థానికుడు ధరమ్ పాల్.. జుల్ఫికర్‌తో గొంతు కలుపుతూ చెప్పారు.

అల్లర్లు జరిగిన కొన్ని రోజులకు ఇప్పుడు ఈ ప్రాంతంలో జనజీవనం కుదుటపడుతున్నట్లే కనిపిస్తోంది.

కూరగాయలు అమ్మే ఓ హిందువు రెండు రోజుల విరామం తర్వాత వీధుల్లోకి వచ్చారు. ఆయన నివసించే చోట అలర్లు జరిగాయి.

ఇక్కడి బిర్యానీ దుకాణం కూడా ఎప్పటిలాగే తెరుచుకుంది. కాలుతున్న తందూరీ రొట్టెల ఘుమఘుమలు కూడా బయటిదాకా వస్తున్నాయి.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)