కమల్ హాసన్ 'భారతీయుడు-2' సినిమా సెట్లో ప్రమాదం, ముగ్గురు మృతి

ఫొటో సోర్స్, Twitter
కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు టెక్నీషియన్లు మృతి చెందారు.
సినిమా కోసం ఓ భారీ సెట్ ఏర్పాటుచేస్తున్న సమయంలో పెద్ద క్రేన్ ఒకటి పక్కకు ఒరిగి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు మరణించగా, 9మంది గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పటల్‌కు తరలించారు.


పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దీనిపై కమల్ హాసన్ ట్విటర్ వేదికగా తన సంతాపం వ్యక్తం చేశారు.
"నేను నా జీవితంలో ఎన్నో ప్రమాదాలు చూశాను. కానీ ఇది చాలా విషాదం మిగిల్చింది. వారి కుటుంబ సభ్యులకు నాకన్నా ఎక్కు బాధ ఉంటుంది. వారికి నా సానుభూతి తెలుపుతున్నా" అని అన్నారు.
గాయపడినవారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో కూడా తాను మాట్లాడానని, వారంతా త్వరగా కోలుకుని, మళ్లీ మాతో భాగస్వాములు కావాలని కోరకుంటున్నానని మరో ట్వీట్‌లో తెలిపారు.

ఈ ప్రమాదంపై లైకా ప్రొడక్షన్స్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
"మేం అనుభవిస్తున్న బాధను వర్ణించడానికి మాటలు చాలవు. భారతీయుడు-2 షూటింగ్ సెట్లలో నిన్న జరిగిన ఈ ప్రమాదం మాకు చాలా బాధను కలిగించింది. ఎంతో కష్టపడి పనిచేసే ముగ్గురు టెక్నీషియన్లను మేం కోల్పోయాం. వారి కుటుంబ సభ్యులకు మా సంతాపాన్ని తెలియచేస్తున్నాం" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Twitter
శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు-2 సినిమా షూటింగ్ చెన్నై పరిసరాల్లో జరుగుతోంది. దీనిలో కమల్ హాసన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి.
- "పౌరసత్వం మా పరిధి కాదు, అలాంటి పదాలు వాడి ఉంటే సరిచేస్తాం..."
- హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు
- చనిపోయిన కూతుర్ని వర్చువల్ రియాలిటీతో 'కలుసుకున్న' అమ్మ
- వివాదాస్పద మత బోధకుడు జాకిర్ నాయక్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు: Ground Report
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









