బడ్జెట్ 2020: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఏమన్నాయి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌పై ఇటు ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అటు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడంలేదని బుగ్గన అనగా కేంద్రపన్నుల్లో తమకు రావాల్సిన వాటాకు కోతలు వేశారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

ఫొటో సోర్స్, FB/@KTRTRS
ఇది కోతల బడ్జెట్
తాజా బడ్జెట్ ఎంతగానో నిరాశపరిచిందన్నారు కేటీఆర్. తెలంగాణ పనితీరు బాగుందని, ప్రగతి పథంలో పయనిస్తోందని ఆర్థికసర్వే చెబుతున్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులను సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన ట్విటర్ వేదికగా విమర్శించారు. ఈ బడ్జెట్ ఎంతో నిరాశపర్చిందని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వలేదన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కేంద్రపన్నుల పంపకాల్లో తెలంగాణ వాటా తగ్గడాన్ని ఆయన తప్పు పట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలో 18.9శాతం తగ్గిందని, దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం ఎంత బాగా నడుపుతుందో ఈ గణాంకాలను చూస్తే తెలుస్తోందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాల అమలుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
'ఒక్క రూపాయి ఇవ్వలేదు'
తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ.24,000 కోట్లు ఆర్థికసాయం అందించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా తాజా బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేంద్రం కేటాయించలేదన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
2019-20 బడ్జెట్‌లో పట్టణాభివృద్ధికి తెలంగాణకు రూ.1,037 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో దాన్ని రూ.889 కోట్లకు తగ్గించారని కేటీఆర్ తెలిపారు. కొత్త పట్టణాలు, నగరాల అభివృద్ధికి ఇది అవరోధంగా మారుతుందన్నారు.


నీటిపారుదల, సంక్షేమ పథకాల కోసం ఆర్థికసాయం పొడిగించాలని మేం కోరితే దానికి బదులుగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి రంగాలకు సంబంధించి నిధుల కేటాయింపుల్లో కేంద్రం భారీగా కోతలు వేసిందని కేటీఆర్ ట్వీట్లు చేశారు.

ఫొటో సోర్స్, Facebook/BugganaRajendranath
ఏపీకి ఒరిగేది ఏమీలేదు
ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం లేదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
"రాష్ట్రానికి వచ్చేసరికి చాలా నిరాశగా ఉంది. 2014లో రాష్ట్రంలో మెజారిటీ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారు. ఆ సమయంలో చాలా విభజన హామీలు ఇచ్చారు. కానీ ఈ హామీలు ఆలస్యం కావడం లేదా వాయిదా పడటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతోంది" అని బుగ్గన అన్నారు.
బుగ్గన ఇంకా ఏమన్నారంటే...
'ప్రత్యేకహోదా ప్రస్తావన ఏది'
ప్రత్యేకహోదా చాలా కాలంగా నలుగుతున్న అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి హామీ రావడం లేదు.
విభజన నాటి ఆదాయలోటును ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. సుమారు రూ.19 వేల కోట్లు రావాలి.
'ప్యాకేజీ ఎక్కడ'
వెనుకబడిన ఏడు జిల్లాలకు బుందేల్ ఖండ్ మాదిరిగా ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు రూ.1000 కోట్లు ఇచ్చారు తప్ప అంతకు మించి ఏమీ ఇవ్వలేదు.
పోలవరానికి సంబంధించిన రీయింబర్స్‌మెంట్లు కూడా ఆలస్యం అవుతున్నాయి.
దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులపై స్పష్టమైన హామీ లేదు.
'హైదరాబాద్‌లో సంస్థలను వదులుకొన్నాం'
హైదరాబాద్‌లో ఎన్నో సంస్థలను వదులుకోవాల్సి వచ్చింది. వాటికి బదులుగా కడప స్టీల్, ఆయిల్ రిఫైనరీ వంటి సంస్థలు రావాల్సి ఉంది. కొన్ని విద్యాసంస్థలు అయితే వచ్చాయి కానీ వాటికి సంబంధించి ఎంతో గ్రాంట్ రావాల్సి ఉంది.
వ్యవసాయం మీద ఆధారపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రావాలి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కావాలి.

ఇవి కూడా చదవండి.
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- బడ్జెట్ 2020: కొత్త పన్ను శ్లాబులు కావాలంటే వీటిని వదులుకోవాల్సిందే
- కరోనా వైరస్: 'నిశ్శబ్ద నగరంలో ఒంటరి జీవితం' - వుహాన్ డైరీ
- ఈయూ నుంచి నిష్క్రమించిన బ్రిటన్... స్వతంత్ర దేశంగా ఈయూకు తిరిగి వస్తామన్న స్కాట్లాండ్
- ఈ రెజ్లింగ్ శిక్షణ కేంద్రం అమ్మాయిలకు మాత్రమే..
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- గీతా చౌహాన్: 'పడితే లేపడానికి ఎవరూ రారు... మనకు మనమే లేవాలి'
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019 పురస్కారం: భారత మహిళా క్రీడాకారులు సాధించిన విజయాలకు గౌరవం
- అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు?
- ఆశిమా ఛిబ్బర్ :మగాడి తోడు లేకుండానే తల్లి అయిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









