గీతా చౌహాన్: ‘పడితే లేపడానికి ఎవరూ రారు... మనకు మనమే లేవాలి’

వీడియో క్యాప్షన్, భారత వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ జట్టులో గీతా సభ్యురాలు. పారాలింపిక్స్‌లో ఆడాలన్నది ఆమె కల.

చిన్నతనంలోనే గీతా చౌహాన్ పోలియో బారినపడ్డారు. దివ్యాంగులపై సమాజంలో ఉన్న వివక్ష, చిన్నచూపును అనుభవించారు.

అయినా, జీవితంలో ఎదిగేందుకు అవేమీ ఆమెకు అడ్డు కాలేదు.

సొంత సంపాదనతో ఉన్నత చదువులను పూర్తి చేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే, క్రీడలవైపు మళ్లారు.

వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఆడటం మొదలుపెట్టి, అందులో భారత జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో టెన్నిస్ కూడా ఆడుతున్నారు.

ఎప్పటికైనా పారాలింపిక్స్‌లో ఆడాలన్నది గీతా కల.

స్ఫూర్తినిచ్చే ఆమె కథను పైవీడియోలో చూడొచ్చు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)