JNU: క్యాంపస్ హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి మొదలైన నిరసన ప్రదర్శనలు

ఫొటో సోర్స్, AFP

దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో ఆదివారం రాత్రి కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులపై హింసాత్మక దాడి జరిగింది. ఈ దాడికి నిరసనలగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు జేఎన్‌యూలో జరిపిన దాడిలో నలభై మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకలు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ దాడికి పాల్పడిన దుండగులు కొందరిని గుర్తించినట్లు తెలిపారు.

ఈ దాడులకు నిరసనగా ముంబయ్, హైదరాబాద్ వంటి నగరాల్లో విద్యార్థులు ఇప్పటికే ఆందోళనలు ప్రారంభించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మరోవైపు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా పరిణామాల నేపథ్యంలో జేఎన్‌యూ రిజిస్ట్రార్, ఇతర అధికారులతో సమావేశమవుతున్నారు.

హైదరాబాద్‌లో నిరసన
ఫొటో క్యాప్షన్, హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థుల నిరసన ప్రదర్శనలు

హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జేఎన్‌యూ విద్యార్థులపై దాడిని నిరసిస్తూ ఆదివారం రాత్రి విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. జేఎన్‌యూ విద్యార్థులకు అండగా ఉంటామని వారు నినాదాలు చేశారు.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) వారే ఈ దాడులకు పాల్పడ్డారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. కాగా, ఏబీవీపీ మాత్రం వామపక్ష సంస్థలకు చెందిన వారే తమపై దాడి చేశారని, తమ సభ్యులు కొందరు గాయపడ్డారని ప్రత్యారోపణలు చేసింది.

తమ విద్యార్థులపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జేఎన్‌యూ పాలక విభాగం ఒక ప్రకటన చేసింది. గాయపడిన విద్యార్థుల గురించి తాము ఆందోళన చెందుతున్నామని, ఇది అత్యంత విచారకరమైన ఘటన అని యూనివర్సిటీ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దాడికి పాల్పడిన వారిలో కొందరిని గుర్తించామని పోలీసులు చెబుతున్నప్పటికీ, వారు ఎవరన్నది వారు తెలపలేదు. కాగా, పోలీసులు చేయాల్సిన పనిని తాము చేసి చూపించామని, ఆదివారం నాటి దాడి వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఏడుగురిని తాము స్పష్టంగా గుర్తించామని సామాజిక కార్యకర్త సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

వారి పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని అవసరమైతే ఆ వివరాలను న్యాయమూర్తికి అందజేస్తామని సాకేత్ అన్నారు. నిజమేమిటో బయటకు రావాల్సిందేనని కూడా ఆయన చెప్పారు.

ఆదివారం రాత్రి యూనివర్సిటీలో ఏం జరిగింది?

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక వీడియోలో ఈ దాడి జేఎన్‌యూ క్యాంపస్ లోపల జరిగిందని చెబుతున్నారు. టీవీ రిపోర్ట్స్ ప్రకారం ముసుగులు వేసుకున్న దుండగులు చాలా హాస్టళ్లలోకి కూడా వెళ్లి, అక్కడ ఉన్నవారిపై దాడులు చేశారు.

"జేఎన్‌యూ క్యాంపస్‌లోకి 50 మందికి పైగా చొరబడ్డారు. వారంతా కర్రలు, లాఠీలు పట్టుకుని ఉన్నారు. వారిలో చాలామంది తమ ముఖాలకు గుడ్డ కట్టుకుని ఉన్నారు. క్యాంపస్‌లోకి వచ్చీరాగానే, వారు విద్యార్థులపై దాడులు మొదలుపెట్టారు" అని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

జేఎన్‌యూ లో దాడి

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE

ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. దిల్లీ ప్రభుత్వం జేఎన్‌యూ క్యాంపస్‌లో గాయపడ్డ విద్యార్థుల కోసం 7 అంబులెన్సులను ఘటనాస్థలానికి పంపినట్లు చెప్పింది. మరో 10 అంబులెన్సులను సిద్ధంగా ఉంచామని తెలిపింది.

జేఎన్‌యూలో గాయపడిన 18 మందిని ఇక్కడకు తీసుకొచ్చారని, వారికి తలపైన, ఇతర భాగాల్లోను గాయాలై రక్తం కారుతోందని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎయిమ్స్ ట్రామా విభాగం అధికారులు వెల్లడించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీ పోలీస్ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌తో మాట్లాడినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. యూనివర్సిటీలోని పరిస్థితులపై అమిత్ షా ఆరా తీశారని, జాయింట్ సీపీ స్థాయి అధికారితో విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారని తెలిపాయి.

అయితే ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారని డీసీపీ దేవేందర్ ఆర్య తెలిపారు. అన్ని హాస్టళ్ల దగ్గర భద్రత ఏర్పాటుచేశామని, వ్యూహాత్మక ప్రదేశాల్లో పోలీసులను మోహరించామని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఈ దాడిని బీజేపీ ఖండించింది. "విద్యార్థులను బలిపశువులను చేసి, అరాచకాన్ని సృష్టించాలనుకున్న వారు చేసిన చర్య ఇది. అశాంతిని రాజేసి, క్షీణిస్తున్న తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు ఒడిగట్టారు. యూనివర్సిటీలు విద్యకు, అభ్యసనానికి నెలవుగా ఉండాలి" అని వ్యాఖ్యానించింది.

జేఎన్‌యూ లో దాడి

దిల్లీ పోలీస్ విభాగం జేఎన్‌యూ మెయిన్ గేటు దగ్గర పోలీసులను భారీగా మోహరించింది.

గేటు దగ్గర భారీగా గుమిగూడిన జనం రెండు వైపుల నుంచీ నినాదాలు చేస్తున్నారు.

పోలీసులు ఎవరినీ క్యాంపస్ లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు.

జేఎన్‌యూ లో దాడి

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE

జేఎన్‌యూలో విధ్వంసం

సోషల్ మీడియాలో జేఎన్‌యూ విద్యార్థులు షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే, హాస్టళ్లలో ఎంత విధ్వంసం జరిగిందో అంచనా వేయవచ్చు.

జేఎన్‌యూ లో దాడి

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE

దాడులు చేసిన వారు క్యాంపస్‌లో ఉన్న కార్లను కూడా ధ్వంసం చేశారని విద్యార్థులు చెప్పారు.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్ వీడియోలో... "నా పైన చాలా క్రూరంగా దాడి జరిగింది. దాడి చేసినవారు ముసుగులతో ఉన్నారు. చూడండి, ఎలా రక్తం కారుతోందో, నన్ను దారుణంగా కొట్టారు" అని ఆమె చెప్పడం వినిపిస్తోంది.

జేఎన్‌యూ లో దాడి

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE

జేఎన్‌యూ దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది.

"ముసుగులు వేసుకున్న కొందరు క్యాంపస్‌లో తిరుగుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. కొందరిపై దాడికి కూడా పాల్పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాం. అందరూ సంయమనంతో, అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే 100కు కాల్ చేయాలి. అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం" అని చెప్పింది.

జేఎన్‌యూ లో దాడి

ఫొటో సోర్స్, SM VIRAL IMAGE

పరస్పర ఆరోపణలు

అయితే రెండు రోజులుగా రెండు విద్యార్థి వర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం విజ్ఞప్తి మేరకు పోలీసులు యూనివర్సిటీలోకి ప్రవేశించారు.

ఏబీవీపీ సభ్యులే ఈ దాడికి సూత్రధారులని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది.

ఈ దాడికి భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తే కారణమని జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు మోహిత్ కుమార్ పాండే తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో ఆరోపించారు.

అయితే, ఏబీవీపీ దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ దాడి వెనుక వామపక్ష భావజాలం ఉన్న సంస్థల (SFI, AISA, DSF) హస్తం ఉందని చెప్పింది. తమ సంస్థకు సంబంధించిన 25 మంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారని, మరో 11 మంది విద్యార్థులకు సాధారణ గాయాలు అయ్యాయని ఏబీవీపీ చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఎవరు ఏం చెప్పారు?

దాడిచేసినవారి ఒక వీడియోను వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ పోస్ట్ చేసింది. ఏజెన్సీ చెబుతున్న దాని ప్రకారం ఈ గుంపు ఒక హాస్టల్లోకి చొరబడినప్పుడు విద్యార్థులు... "ఏం చేస్తున్నారు, మీరెవరు, హాస్టల్ నుంచి బయటికి వెళ్లండి, ఏంటి మీరు మమ్మల్ని బెదిరించడానికి వచ్చారా" అనడం వినిపిస్తోంది. ఈ వీడియోలో "ఏబీవీపీ గో బ్యాక్" అని విద్యార్థుల నినాదాలు కూడా వినిపిస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ దాడిని ఖండించారు. "జేఎన్‌యూలో హింస వార్తలు విని షాక్ అయ్యాను. విద్యార్థులపై క్రూర దాడి జరిగింది. పోలీసులు ఈ హింసను వెంటనే అడ్డుకుని, శాంతి నెలకొనేలా చూడాలి. విద్యార్థులను వారి యూనివర్సిటీ క్యాంపస్‌లో కూడా భద్రంగా ఉంచలేకపోతే, ఈ దేశం ఎలా ముందుకెళ్తుంది?" అని ట్వీట్ చేశారు.

ఈ దాడిని ముక్తకంఠంతో ఖండించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్లలో పేర్కొన్నారు.

విద్యార్థులందరికీ యూనివర్శిటీలు సురక్షిత ప్రదేశాలుగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని నిర్మల వ్యాఖ్యానించారు.

దాడి దృశ్యాలను చూశానని, ఇది యూనివర్సిటీ సంస్కృతికి విరుద్ధమని జైశంకర్ అభిప్రాయపడ్డారు.

యూనివర్సీటీలో దాడి దురదృష్టకరం, ఆందోళన కలిగించే అంశమని మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్నారు. యూనివర్సిటీ హుందాతనాన్ని కాపాడుతూ, కేంపస్‌లో శాంతియుతంగా మెలగాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో "జేఎన్‌యూలో ముసుగులు వేసుకున్న వ్యక్తుల దాడి, విద్యార్థులు, టీచర్లను కొట్టడం దిగ్భ్రాంతి కలిగించింది. అధికారంలో కూర్చున్న ఫాసిస్టులు సాహసికులైన విద్యార్థులను చూసి భయపడుతున్నారు. ఈరోజు జరిగిన హింస వారి భయానికి ప్రతిబింబం" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఎయిమ్స్‌కు వెళ్లారు.

పరిస్థితిని అదుపు చేసేలా పోలీసులను ఆదేశించాలని కేజ్రీవాల్ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు.

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జేఎన్‌యూలో జరిగిన హింసపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తన ట్విట్టర్‌లో తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

"జేఎన్‌యూలో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు, హింసకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునేందుకు జేఎన్‌యూ అధికారులతో కలిసి తగిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను ఆదేశించాం" అని ట్వీట్ చేశారు.

"జేఎన్‌యూ లాంటి యూనివర్సిటీలో ఇంత పెద్ద సంఖ్యలో ముసుగులు వేసుకున్నవారు చొరబడితే, విద్యార్థులపై దాడి చేస్తుంటే, పోలీసులు ఏం చేస్తున్నారు? దిల్లీ పోలీస్ కమిషనర్ ఎక్కడున్నారు?" అని మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 10
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 10

సీపీఎం నేత సీతారాం ఏచూరీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఐషీ జోషీ వీడియో ట్వీట్ చేశారు. అందులో "ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నాయో ఈ వీడియో చూపిస్తోంది. కానీ మేం వారిని అలా చేయనివ్వం" అన్నారు.

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన ట్వీట్‌లో "జేఎన్‌యూలో ఇలా ముసుగు వ్యక్తులు విద్యార్థులు, అధ్యాపకులపై హింసాత్మకంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై వెంటనే ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరగాలి" అని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)